Mega158 : ప్రస్తుతం ఉన్న చాలా మంది హీరోలకు ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా చిరంజీవి అంటే ఒక గ్రేస్. మెగాస్టార్ స్టెప్ వేస్తే ఆ బ్యూటీ ఏ వేరు. ఎంతమంది ఒళ్ళు నలక్కొట్టుకొని హూనం చేసుకున్న కూడా, మెగాస్టార్ డాన్స్ వేసినంత బ్యూటీ కనిపించదు.
ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత మెగాస్టార్ అభిమానుల్ని పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచిన సినిమా వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా బాబి తన తోటి అభిమానులకు ఇచ్చిన గిఫ్ట్ ఆ సినిమా అని చెప్పాలి. అందుకే మెగాస్టార్ మరోసారి బాబీ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కూడా రాబోతున్నట్లు అనౌన్స్ కూడా చేశారు. ఇది మెగాస్టార్ తన కెరీర్లో చేస్తున్న 158 వ సినిమా. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాను నెలకొన్నాయి.
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చేయబోయే సినిమాకి అక్టోబర్ రెండున ముహూర్తం పెట్టాలి అని ముందుగా నిర్ణయించుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమాకు సంబంధించిన ముహూర్తం క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు అక్టోబర్ రెండున గాంధీ జయంతి తో పాటు దసరా ఫెస్టివల్ కూడా ఉంది. ఫెస్టివల్ రోజున ముహూర్తం క్యాన్సిల్ చేయడానికి గల కారణాలు ఏంటో ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
ఈ సినిమా ముహూర్తానికి సంబంధించి త్వరలో కొత్త డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. బహుశా నవంబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించి ముహూర్త పూజ ఉండవచ్చు. అలానే నవంబర్లో కార్తీకమాసం కూడా ఉంది కాబట్టి కొంతమేరకు ఆ సెంటిమెంట్ కూడా కొంతమేరకు కలిసొస్తుంది.
బాబీ విషయానికొస్తే దర్శకుడుగా మంచి సక్సెస్ రేట్ ఉంది. ఒక సర్దార్ గబ్బర్ సింగ్ మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. సర్దార్ ఫెయిల్యూర్ ను బాబీకి అంటగట్టలేము. ఎందుకంటే అది కేవలం డైరెక్షన్ మాత్రమే. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని ఏ రేంజ్ లో చూపించబోతున్నారు అనే క్యూరియాసిటీ మరింత మొదలైంది. అలానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా తర్వాత మెగాస్టార్ చేస్తున్న సినిమా కాబట్టి బాబి పైన బాధ్యత మరింత పెరుగుతుంది. మరి బాబీ దీనిని ఎలా డీల్ చేస్తాడో చూడాలి. ఇక బాబీ చివరి సినిమా డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది.
Also Read: Priyanka Mohan : పవన్ తో OG బ్యూటీ రొమాంటిక్ ఫోజులు.. ఆ క్లోజ్ నెస్ చూశారా?