BigTV English

Film industry: రియాలిటీ షోలో పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్.. ఎవరు? ఏ షో అంటే?

Film industry: రియాలిటీ షోలో పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్.. ఎవరు? ఏ షో అంటే?

Film industry:ఈ మధ్యకాలంలో ఎన్నో రియాలిటీ షోలు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలతోపాటు సామాన్యులు కూడా ఈ రియాల్టీ షోలలో పాల్గొంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఇలాంటి రియాలిటీ షోలో ఒక హీరోయిన్ ఏకంగా నిజం పెళ్లి చేసుకోబోతోంది అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులు తనను ఆదరించారని.. ఈ కారణం చేతనే వారికి కృతజ్ఞతగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. మరి ఆమె ఎవరు ? ఎవరిని వివాహం చేసుకోబోతోంది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.


రియాలిటీ షోలో పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్..

తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ప్రేక్షకులను హీరోయిన్ గా అలరించిన అవికా గోర్ (Avika Gor).. ఇప్పుడు తన ప్రియుడు ప్రముఖ వ్యాపారవేత్త మిలింద్ చాంద్వానీతో ఏడడుగులు వేయబోతోంది . ఈ ఏడాది జూన్లో నిశ్చితార్థం చేసుకున్న వీరు.. ఇప్పుడు సెప్టెంబర్ 30వ తేదీన పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఒక ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పిన అవికా గోర్ తన పెళ్లి వెన్యూ కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఈమె హోస్ట్గా చేస్తున్న ‘పతి పత్నీ ఔర్ పంగా’ అనే రియాలిటీ షోలో తాను సెప్టెంబర్ 30వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ తెలిపింది. ముఖ్యంగా తనకు బుల్లితెర ఆడియన్స్ మంచి ఆదరణ అందించారని, వారి కృతజ్ఞత భావంగానే ఇలా లైవ్ రియాలిటీ షోలో తాను వివాహం చేసుకోబోతున్నాను అంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది అవికా గోర్. ఏది ఏమైనా ఇలా రియాల్టీ షోలో నిజం పెళ్లి చేసుకోబోతున్న తొలి హీరోయిన్గా కూడా రికార్డు సృష్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.


also read:Rishabh Shetty : కాంతార చావులు… హీరో రిషబ్‌ను కూడా వదల్లేదు… 4 సార్లు బతికిపోయాడు

వరుస చిత్రాలతో భారీ పాపులారిటీ..

‘బాలికా వధూ’ అనే హిందీ సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై..’చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో తెలుగింటి ఆడపిల్లలా అందరి మనసులు దోచుకుంది అవికా గోర్. ఈ సీరియల్ తెలుగు, హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో చిన్నారి పెళ్లికూతురు గానే అవికా గోర్ ముద్ర వేయించుకుంది. ఇప్పుడు ఈమె హీరోయిన్ గా అవతరించిన విషయం అందరికీ తెలిసిందే. ‘ఉయ్యాల జంపాల’ అనే సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నెట్, బ్రో , రాజుగారిగది 3, టెన్త్ క్లాస్ డైరీస్ , థాంక్యూ, పాప్ కార్న్ , ఉమాపతి అంటూ ఇలా చాలా చిత్రాలలో నటిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సినిమాలే కాదు వెబ్ సిరీస్ లు కూడా..

అవికా గోర్ కెరియర్ విషయానికి వస్తే.. మ్యాన్షన్ 24, వధువు వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ఇవి రెండు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు తన ప్రియుడితో ఏడడుగులు వెయ్యబోతోంది.

Related News

Mirai Movie: గుడ్ న్యూస్.. మిరాయ్‌లో వైబ్‌ వచ్చేసింది.. ఈ రోజు నుంచి సినిమాల్లో..

Katrina Kaif: ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన కత్రినా దంపతులు.. కొత్త అధ్యాయం ప్రారంభం అంటూ!

Movie Tickets: 200 రూపాయలకే మూవీ టికెట్… ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హై కోర్టు

Allu Arjun-Rajamouli: అల్లు అర్జున్‌-రాజమౌళి కాంబోలో భారీ ప్రాజెక్ట్‌.. వరల్డ్‌ సన్సేషన్‌ పక్కా!

Rishabh Shetty : కాంతార చావులు… హీరో రిషబ్‌ను కూడా వదల్లేదు… 4 సార్లు బతికిపోయాడు

Rahul Ravindran: ఓజీలో నేను నటించాను.. కానీ, ఎడిటింగ్ లో తీసేశారు..

Malaika Kapoor: అర్జున్ కు హాగ్ ఇచ్చిన మలైకా.. ఫైనల్ గా మీరు మీరు..

Big Stories

×