Anchor Suma: ప్రముఖ యాంకర్ సుమ గురించి ప్రత్యేకమైన పరిచయాల అవసరం లేదు. తన పవర్ఫుల్ యాంకరింగ్ తో ఎప్పుడు ఉత్సాహపరుస్తూనే ఉంటారు. ఏ ఈవెంట్ లో అయినా సుమ ఉంటే చాలా నిండుదనంగా కనిపిస్తుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్దపెద్ద సినిమాలు అన్నిటికీ కూడా సుమ యాంకర్ గా వ్యవహరిస్తుంటారు. అమిగోస్ సినిమా ఈవెంట్ లో ఎన్టీఆర్ సుమా పైన ఫైర్ అయినట్లు అప్పట్లో వీడియోలు వైరల్ అయ్యాయి దానిపైన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సుమా క్లారిటీ ఇచ్చారు.
సోషల్ మీడియాలో మనం కూర్చునే స్టిల్స్ బట్టి కూడా థంబ్నైల్ రెడీ చేయడం మొదలుపెట్టారు. ‘నేను మొహం మీద చేయి పెట్టి కొంచెం తల కిందకి దించితే ఘోరంగా ఏడ్చేసిన సుమ అని పెడతారు. అలా పైకి చూస్తే బాధతో చూస్తున్న సుమ. ఈ తరుణంలోనే అమిగోస్ సినిమా ఈవెంట్ లో ఎన్టీఆర్ సుమను సీరియస్ గా చూడటం వెనక ఉన్న రీజన్ చెప్పారు.
ఎన్టీఆర్ నా వెనక ఉన్నారు నేను ఎన్టీఆర్ కి కొంచెం ముందు నిల్చున్నాను. నేను ముందు నుంచి మాట్లాడుతున్నాను ఎన్టీఆర్ రియాక్షన్ నేను అసలు గమనించలేదు. నేను చెప్పాల్సింది చెబుతూ ఎన్టీఆర్ 30వ సినిమా గురించి అప్డేట్ కూడా అడిగేసాను. అదంతా అయిపోయి నేను ఇంటికి కూడా వెళ్ళిపోయాను. తర్వాత మా పిల్లలు ఇలా వచ్చిన రీల్ చూపించారు. నేను దానిని చాలా క్యాజువల్ గా తీసుకున్నాను.
కానీ పొద్దున లేస్తే ఆ వీడియో విపరీతంగా వైరల్ అయిపోయింది. అయితే అసలు నా మీద ఎన్టీఆర్ సీరియస్ అవ్వలేదు నో అంటూ చెప్పేశారు. కానీ వాస్తవానికి ఎన్టీఆర్ సుమాని అలా చూడటం నిజం. అలానే వాళ్లు అడగకపోయినా కూడా మీరే చెప్పేసేలా ఉన్నారు అని కూడా ఆ ఈవెంట్ లో ఎన్టీఆర్ సుమను ఉద్దేశిస్తూ అన్నారు. కానీ సుమ అవేవి చెప్పకుండా ఒక చక్కని కవర్ డ్రైవ్ చేశారు.
చిన్నప్పుడు కామిక్స్ వచ్చినప్పుడు క్యారెక్టర్స్ ను గీసి, ఆపైన ఒక క్లౌడ్ డిజైన్ వేసి అక్కడ వాళ్ళు మాట్లాడుకునేది రాసేవాళ్ళు. ఇప్పుడు మన బతుకులు అవి. ఇప్పుడు ఇలా కూర్చున్నా కూడా వాళ్ళు ఏమనుకుంటారో అదే పెడతారు.
చాలామంది అది నిజం అనుకొని నమ్మేస్తున్నారు. కేవలం క్లిక్ బైట్ కోసమే అవన్నీ రాస్తుంటారు. సుమ కూర్చుని మాట్లాడింది అని అంటే ఎవడు క్లిక్ చేయడు. సుమ వాళ్ళ ఆయన గురించి మాట్లాడుతూ చాలా బాధపడింది. అని రాస్తేనే క్లిక్ చేస్తారు. అలాంటివే వాళ్లు ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేస్తున్నారు. మొదట్లో ఈ విషయం పైన చాలా బాధేసింది. పాపులారిటీ వస్తున్నకొద్ది ఇవన్నీ కామన్ గా వస్తుంటాయి నేను పెద్దగా పట్టించుకోవడం మానేశాను. అలానే ఈ మధ్య కాలంలో జనాలు కూడా మెల్లగా నమ్మడం తగ్గించేస్తున్నారు.
Also Read: Andhra King Taluka : జెట్ స్పీడ్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఆంధ్రా కింగ్ ఎంతవరకు వచ్చిదంటే?