Rajinikanth Brother Narayana Rao Hospitalised: సూపర్ స్టార్ రజనీకాంత్ సోదరుడు తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. ఆయన అన్నయయ సత్యనారాయణ రావు గైక్వాడ్ (84) నిన్న రాత్రి గుండెపోటుకు గురయ్యారు. దీందో ఆయనను బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఆయన ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలిపోయారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
తన సోదడుకు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకుని రజనీ హుటాహుటిన బెంగళూరు చేరుకున్నారు. తన సొదరుడితో పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆయన ఆస్పత్రికి వెళ్లిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రజనీ సోదరుడి గుండెపోటుకు గురయ్యారని తెలిసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్యనారాయణ రావు త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
நடிகர் ரஜினியின் சகோதரர் மருத்துவமனையில் அனுமதி…
செய்தி கேட்டதும் சகோதரரை பார்க்க உடனடியாக சென்னையில் இருந்து கிளம்பிய ரஜினிகாந்த்.. #Rajinikanth #hospital #bangalore
சூப்பர் ஸ்டார் நடிகர் ரஜினிகாந்த் சகோதரர் சத்யநாராயணாவுக்கு திடீரென உடல்நல குறைவு ஏற்பட்டது. அதாவது… pic.twitter.com/ilkWux2QQh
— Thanthi TV (@ThanthiTV) November 8, 2025
కాగా సత్యానారాయణ రావు గైక్వాడ్‌లో గతంలో మోకాలి చిప్ప మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయన ఆరోగ్యం దెబ్బతింది. వృద్ధాప్య సమస్యలతో తరచూ అస్వస్థతకు గురవుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా గుండెపోటు రావడంతో ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళణ చెందుతున్నారు. రజనీ కూడా సోదరుడికి గుండెపోటు రావడంతో ఆవేదన చెందినట్టు సన్నిహితుల నుంచి సమాచారం. కాగా ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2 చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇటీవల కూలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ఆగష్టు 14న విడుదలైంది. డివైడ్ టాక్ తో ఈ సినిమా బొల్తా కొట్టింది. కోలీవుడ్ తొలి వెయ్యి కోట్ల సినిమా అవుతుందనుకున్న కూలీ ఊహించని విధంగా పరాజయం పొందింది.
Also Read: Hero Vishal: యువతిపై అత్యాచారం.. మీ కాళ్లు పట్టుకుంటానంటూ హీరో విశాల్ ట్వీట్