Actor Ajay: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు అజయ్(Ajay) ఒకరు. ఈయన స్టార్ హీరోలు అందరూ సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. హీరో ఫ్రెండ్ పాత్రలలోనూ లేదా విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ భారీగా ఆదరణ సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో అజయ్ కాస్త సినిమాలను తగ్గించారని చెప్పాలి.. అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉన్నారా? లేకుంటే మరేదైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలు గురించి తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అజయ్ తన సినిమాల గురించి, రెమ్యూనరేషన్ గురించి ఎన్నో విషయాలను తెలిపారు. అయితే మీ అభిమాన హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురవడంతో వెంటనే తనకు బాలకృష్ణ (Balakrishna)గారు అంటే చాలా ఇష్టమని తెలిపారు. తనకు చిరంజీవి (Chiranjeevi)కంటే కూడా బాలయ్య అంటేనే ఇష్టమని ఈయన చెప్పడంతో ఒక్క సారిగా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు చిన్నప్పటినుంచి కూడా కృష్ణ గారంటే చాలా ఇష్టం ఆ తర్వాత చిరంజీవి గారు హీరోగా వచ్చిన తర్వాత చిరంజీవి గారిని బాగా ఇష్టపడే వాడిని ఇప్పుడు బాలకృష్ణ గారిని బాగా ఇష్టపడుతున్నానని తెలిపారు.
ఇక ఆ తర్వాత నేను కూడా ఇండస్ట్రీలోకి రావడంతో మిగిలిన హీరోలు అందరితో కలిసి నేను కూడా సినిమాలలో నటిస్తున్న నేపథ్యంలో నా ఇష్టం బాలకృష్ణ వరకు మాత్రమే ఆగిపోయిందని తెలిపారు. ఇక నాతోపాటు ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు అందరూ కూడా ఇప్పుడు స్టార్స్ గా ఉండటం చాలా సంతోషంగా అనిపిస్తుందని అజయ్ తెలిపారు. ఇకపోతే సినిమాలు తగ్గించడం గురించి కూడా అజయ్ తెలిపారు. ఇప్పుడు నేను ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను.. ఆ క్యారెక్టర్ కి సెట్ అవ్వాలి అంటే నన్ను నేను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అందుకు కొంత సమయం పడుతుందని అందుకే సినిమాలు కాస్త లేట్ అవుతున్నాయని తెలిపారు. ఇక త్వరలోనే వరుస సినిమాలు రాబోతున్నాయని వెల్లడించారు.
తెలుగు ఇండస్ట్రీలోనే రెమ్యూనరేషన్ ఎక్కువ..
ఇతర భాష సినిమాలలో కూడా నటిస్తున్న నేపథ్యంలో ఈ విషయాలు గురించి కూడా మాట్లాడారు. వేరే భాషలలో సినిమాలు చేసిన పెద్దగా రెమ్యూనరేషన్ ఇవ్వరు. రెమ్యూనరేషన్ విషయంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీనే చాలా రిచ్ అని.. ఇక్కడే మంచి రెమ్యూనరేషన్ ఇస్తారని తెలిపారు. బయట ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ విషయంలో బేరాలు సాగుతాయని అజయ్ వెల్లడించారు. ముంబైతో పోలిస్తే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా రిచ్ అని ఈ సందర్భంగా అజయ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక అజయ్ చివరిగా తెలుగులో పుష్ప2 సినిమాలో నటించి సందడి చేశారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కి అన్నయ్య పాత్రలో నటించినా ఈ సినిమాని కీలక మలుపు తిప్పే కావేరి పాత్రకు తండ్రిగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత అజయ్ కు ఫాదర్ రోల్స్ వస్తున్నాయని తెలిపారు.