V Hanumantha Rao: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వీహెచ్ హనుమంత రావు కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. వెనుకబడిన తరగతుల (బీసీ) హక్కులు, రిజర్వేషన్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేసిన పాదయాత్ర ద్వారా ఎస్టీ, ఎస్టీ, బీసీ వర్గాల కష్టాలను, సమస్యలను దగ్గరగా తెలుసుకున్నారని వీ హెచ్. పేర్కొన్నారు. ఇది ఈ వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధతను సూచిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల నిర్వహించిన బీసీ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు సహకరించారని, దీని ద్వారా వెనుకబడిన తరగతుల హక్కుల పట్ల సమాజంలో ఉన్న మద్దతు స్పష్టమైందని తెలిపారు.
బీసీ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చాలని వి. హెచ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గట్టిగా డిమాండ్ చేశారు. ఓబీసీ వర్గానికి చెందిన ప్రధానిగా మోదీ, బీసీలకు తప్పనిసరిగా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించపోతే.. భవిష్యత్తులో రిజర్వేషన్లు సాధించుకోవడం కష్టమవుతుందని వి. హెచ్. హెచ్చరించారు. బీసీల జనాభాకు అనుగుణంగా వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని పట్టుబట్టారు.
ALSO READ: IND VS AUS: ఫ్యాన్స్ కు బిగ్ షాక్..ఆసీస్-టీమిండియా తొలి వన్డేకు వర్షం అడ్డంకి
ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికర పోలికను తీసుకువచ్చారు. ‘నక్సలైట్లలో సైతం మార్పు వచ్చి, వారు తుపాకులు విడిచిపెట్టి గ్రామాల్లోకి వస్తున్నారు. అలాగే.. ప్రధాని మోదీ కూడా తన ఆలోచనలో మార్పు తెచ్చుకొని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి” అని వి. హెచ్. సూటిగా విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లను రాజ్యాంగ బద్ధంగా కాకుండా.. కేవలం పార్టీ పరంగా ఇస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. గతంలోనే కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ALSO READ: AP Govt on BPS: అనుమతులు లేని ఇళ్లకు క్రమబద్దీకరణ.. బీపీఎస్ పై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న సమయంలో.. వీహెచ్ హనుమంతా రావు భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన గొంతులో కనిపించిన ఈ ఉద్వేగం, వెనుకబడిన వర్గాల హక్కుల పట్ల ఆయనకున్న నిబద్ధతను, ఆవేదనను స్పష్టంగా తెలియజేస్తోంది.