BigTV English

Viral Video: అండర్‌ వేర్‌ ను బ్యాగ్‌ గా మార్చేసి షాపింగ్.. ఆ మహిళ చేసిన పనికి అంతా షాక్!

Viral Video: అండర్‌ వేర్‌ ను బ్యాగ్‌ గా మార్చేసి షాపింగ్.. ఆ మహిళ చేసిన పనికి అంతా షాక్!
Advertisement

Underwear Bag Viral Video:

కుట్లు, అల్లికలు పట్ల చాలా మంది మహిళలకు ఆసక్తి ఉంటుంది. వారు తమ రోజు వారీ అవసరాల కోసం చిన్న చిన్న సంచులు తయారు చేస్తుంటారు. చాలా మంది క్లాత్ తో చక్కటి బ్యాగులు తయారు చేసి, కూరగాయలు కొని తెచ్చేందుకు, కిరాణా సామాన్యు తెచ్చేందుకు ఉపయోగిస్తారు. అయితే, తాజాగా ఓ మహిళ తయారు చేసిన బ్యాగ్ చూసి అందరూ షాక్ అయ్యారు. దానికి కారణం ఏంటంటే.. ఆమె ఏకంగా అండర్ వేర్ ను బ్యాగ్ గా మార్చేసింది. దానితో షాపింగ్ చేస్తూ కెమెరాకు చిక్కింది. ప్రస్తుతం ఈ అండర్ వేర్ బ్యాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


అండర్ వేర్ తో బ్యాగ్ తయారు చేసిన మహిళ

తాజాగా వైరల్ అవుతున్న వీడియో క్లిప్ లో సదరు మహిళ క్రేజీ బ్యాగ్ లో కూరగాయలను కొనుగోలు చేస్తూ కనిపించింది. ఈ వీడియోలో సదరు మహిళ అండర్ వేర్ తో క్రియేటివ్ గా తయారు చేసిన బ్యాగ్ కనిపించింది. అండర్ వేర్ కింది భాగాన్ని కుట్లు వేయడంతో పాటు పైభాగం చివర్లకు ఓ బెల్ట్ తగిలించింది. నడుము పట్టీకి అడ్డంగా ఒక పట్టీని కుట్టి, దానిని హ్యాండ్స్ ఫ్రీ బ్యాగ్‌ గా మార్చింది. భుజానికి తగిలించుకుని వెళ్లేలా దానిని రూపొందించింది. కొనుగోలు చేసిన వస్తువులను కూడా ఈజీగా ఈ అండర్ వేర్ బ్యాగులో తీసుకెళ్లేలా తయారు చేసింది.


Read Also:  ప్రతిష్టాత్మక కాలేజీలో అమ్మాయిల ఫైటింగ్, నెట్టింట వీడియో వైరల్.. యాజమాన్యం ఏం చేసిందంటే?

క్రేజీగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు

సదరు మహిళ ఈ అండర్ వేర్ బ్యాగుతో షాపింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. భారతీయ మహిళల క్రియేటివిటీ రోజు రోజుకూ పెరుగుతుందంటూ ఈ వీడియో పోస్టు చేశాడు.  ప్రస్తుతం ఈ క్లిప్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను చూసి క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు. “మహిళ ఏదైనా చేయగలదు. ఈ రోజుతో ఆ విషయం మరోసారి నిరూపించబడింది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “రీ సైక్లింగ్ ఎలా ఉండాలో ఈమెను చూసి నేర్చుకోవచ్చు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “పాత దుస్తులను పారేయడం కంటే ఇలా సృజనాత్మకంగా ఆలోచన చేసి బ్యాగుగా ఉపయోగించడం నిజంగా అద్భుతం. ఆమె ఆలోచనకు అభినందనలు చెప్పాల్సిందే” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “చాలా మంది బ్రాండెడ్ సంచులు కావాలని భావిస్తారు. కానీ, ఇలాంటి అనవసర దుస్తులతోనూ క్రియేటివ్ గా బ్యాగులు తయారు చేయవచ్చు అని నలుగురికి చాటి చెప్పడం అభినందించాల్సిన విషయం” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ అండర్ వేర్ బ్యాగ్ నెట్టింట నవ్వులతో పాటు కొత్త ఆలోచనలు పుట్టిస్తోంది.

Read Also: రణరంగంగా మారిన రైల్వే స్టేషన్, పిచ్చ పిచ్చగా కొట్టుకున్న రైల్వే సిబ్బంది.. నెట్టింట వీడియో వైరల్!

Related News

Diwali Special Sweet: ఈ దీపావళి స్వీట్ చాలా కాస్ట్లీ గురూ.. కేజీ రూ.1.11 లక్షలు

Viral Video: విద్యార్థుల కేరింతల మధ్య.. స్కూల్ బెల్ కొడుతూ భాగోద్వేగానికి గురైన ఉద్యోగి, 38 ఏళ్లు అనుబంధానికి తెర!

Viral News: దీపావళి వేళ 51 మంది ఉద్యోగులకు లగ్జరీ కార్లు, మళ్లీ వైరల్ వార్తల్లోకి ఎక్కిన భాటియా!

Viral Video: రణరంగంగా మారిన రైల్వే స్టేషన్, పిచ్చ పిచ్చగా కొట్టుకున్న రైల్వే సిబ్బంది.. నెట్టింట వీడియో వైరల్!

Viral Video: ప్రతిష్టాత్మక కాలేజీలో అమ్మాయిల ఫైటింగ్, నెట్టింట వీడియో వైరల్.. యాజమాన్యం ఏం చేసిందంటే?

Vande Bharath Staff Fight: ఢిల్లీ రైల్వే స్టేషన్ లో WWE.. చెత్తబుట్టలు, బెల్ట్ లతో కొట్టుకున్న వందే భారత్ సిబ్బంది.. వీడియో వైరల్

Spiderman Lizard: రాళ్లపై నివసించే రియల్ స్పైడర్ మ్యాన్.. ఎక్కడుందో తెలుసా?

Big Stories

×