Bandla Ganesh:బండ్ల గణేష్ (Bandla Ganesh).. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భక్తుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లకి కూడా హాజరవుతూ పలు ఊహించని కామెంట్లు చేస్తూ ఉంటారు. అంతేకాదు చెప్పేది ఏదైనా సరే ముక్కు సూటిగా చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే 90’స్ బయోపిక్ ఫేమ్ మౌళి (Mouli)హీరోగా.. శివాని నాగారం (Sivani Nagaram) హీరోయిన్ గా చిన్న సినిమాగా వచ్చిన చిత్రం లిటిల్ హార్ట్స్ (Little hearts). సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ సినిమా “ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్” లో రూపొందింది. చిన్న సినిమాగా విడుదలైన భారీ కలెక్షన్స్ వసూలు చేసుకోవడంతో అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాదులో గురువారం చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఈ వేడుకలో బండ్ల గణేష్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా అల్లు అరవింద్ ను టార్గెట్ గా చేసుకొని చేసిన కామెంట్లు చూస్తుంటే..” పొగుడుతూనే పొగ పెట్టేసాడు బండ్లన్న” అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
అల్లు అరవింద్ ను పొగుడుతూనే కౌంటర్ ఇచ్చిన బండ్లన్న..
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీకి వచ్చే ముందు ఎవరైనా సరే కష్టాలకు, కన్నీళ్ళకు ప్రిపేర్ అయ్యి ఇండస్ట్రీకి రావాలి. ఉదాహరణకు ఇండస్ట్రీలో ఒక పెద్దాయన ఉన్నారు. వందల కోట్లల్లో లాభాలు ఆయనకు మాత్రమే దక్కుతాయి. ఒక స్టార్ కమెడియన్ కొడుకుగా పుడతాడు. మెగాస్టార్ కి బామ్మర్దిగా ఉంటాడు. ఐకాన్ స్టార్ కి తండ్రిగా ఉంటాడు. కాలు మీద కాలు వేసుకొని ఉంటాడు. అయితే ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు. ఆయన తలుచుకుంటే ఎవరైనా సరే ఆయనకు అందుబాటులోకి వస్తారు. ఇలాంటి జీవితం అందరికీ రాదు. ముఖ్యంగా అల్లు అరవింద్ లాంటి మహారాజ్జాతకుడిని నా జీవితంలో నేను ఇప్పటి వరకు చూడలేదు. షర్టు నలగదు.. జుట్టు చెదరదుmm కానీ డబ్బు మాత్రం ఆయన ఖాతాలోకి వచ్చి చేరుతుంది. ఇది అల్లు అరవింద్ కి మాత్రమే సాధ్యం”. అంటూ బండ్ల గణేష్ అల్లు అరవింద్ పై కామెంట్లు చేశారు. కానీ అల్లు అరవింద్ మాత్రం నవ్వుతూనే ఉండడం గమనార్హం.
పొగడ్తలకు పొంగిపోకు అంటూ మౌళికి హెచ్చరికలు..
అలాగే ఇదే వేదికపై మౌళికి కూడా కీలక సూచనలు చేశాడు బండ్ల గణేష్.. “మహేష్ బాబు ట్వీట్ వేశాడు.. విజయ్ దేవరకొండ షర్ట్ ఇచ్చాడు.. ఇలాంటివన్నీ అబద్ధాలు మాత్రమే. టాలెంట్ ను మాత్రమే నమ్ముకోవాలి. ఏ మాత్రం సైడ్ అయినా ఇండస్ట్రీ నిన్ను బ్రతకనివ్వదు. సక్సెస్ కి ముందు నువ్వు ఎలా ఉన్నావో అలాగే సక్సెస్ ల తర్వాత కూడా కొనసాగితేనే నటుడిగా నిన్ను ఇండస్ట్రీలో ఉండనిస్తారు. ముఖ్యంగా చంద్రమోహన్ లాంటి గొప్ప వ్యక్తిలా నువ్వు కూడా ఒక నటుడిగానే పేరు సంపాదించుకో” అంటూ ఇండస్ట్రీ విషయాలను దృష్టిలో పెట్టుకొని హెచ్చరికలు జారీ చేశాడు.
అల్లు అరవింద్ పుట్టాకే అల్లు రామలింగయ్య స్టార్ అయ్యారు -బన్నీ వాసు
బండ్ల గణేష్ అన్న మాటలను దృష్టిలో పెట్టుకొని వెంటనే బన్నీ వాసు (Bunny Vasu) మాట్లాడుతూ.. “బండ్లన్న మర్చిపోయాడెమో అల్లు రామలింగయ్య అనే స్టార్ కమెడియన్ కు అల్లు అరవింద్ పుట్టడం కాదు.. అల్లు అరవింద్ పుట్టిన తరువాతనే అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్ అయ్యారు.. బండ్లన్నకు ఈ విషయం తెలియదేమో” అంటూ తనదైన శైలిలో రీకౌంటర్ ఇచ్చారు బన్నీ వాసు..
అల్లు అరవింద్ పై బన్నీ వాసు ప్రశంసలు..
బన్నీ వాసు అల్లు అరవింద్ ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ..” మీ ఎంటైర్ జీవితం మాలాంటి వాళ్ళందరికో స్ఫూర్తి. ఈ సినిమాలో నేను మిమ్మల్ని ఎక్కడ మిస్ అయ్యాను అంటే.. మీరు లేకపోవడం వల్ల నాకు పని తక్కువయింది. అంత పని పెడతారు. ఆయన నిద్రపోడు మమ్మల్ని నిద్రపోనివ్వరు. ఈ ఏజ్ లో కూడా ఆయన పరిగెడుతూనే అందర్నీ పరిగెత్తిస్తారు..ఒక గొప్ప వ్యక్తి ” అంటూ అల్లు అరవింద్ పై ప్రశంసలు కురిపించారు.
“#VijayDeverakonda ROWDY TShirt ఇచ్చాడు… #MaheshBabu Tweet వేసాడు… ఇవన్ని అబద్ధాలు.
నిన్ను Impress చెయ్యడానికి… Neeku wishes చెప్పడానికి చేస్తారు.
ఇంకో Friday ఇంకో #Mouli వస్తాడు.” pic.twitter.com/JGScQn7feJ
— Gulte (@GulteOfficial) September 18, 2025
అల్లు రామలింగయ్య అనే స్టార్ కమెడియన్ కు అల్లు అరవింద్ పుట్టడం కాదు…
అల్లు అరవింద్ పుట్టిన తరువాతనే అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్ అయ్యారు…!
బండ్ల గణేష్ అన్నకు ఆ విషయం తెలియదేమో..!
-Bunny Vasu#LittleHearts Celebration of Glory Event pic.twitter.com/HqmYfjRfev
— idlebrain.com (@idlebraindotcom) September 18, 2025