BigTV English
Advertisement

Akshay Kumar: 100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్.. షాక్ లో ఫ్యాన్స్!

Akshay Kumar: 100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్.. షాక్ లో ఫ్యాన్స్!

Akshay Kumar:కొంతమంది సినీ నటీనటులు తమ వృత్తిపట్ల ఎంత అంకితభావంతో పనిచేస్తారో చెప్పనక్కర్లేదు. సినిమా కోసం ఎలాంటి సాహసాలైనా చేస్తారు. సినిమాలో నేచురల్ గా కనిపించడం కోసం తమ నట విశ్వరూపాన్ని చూపిస్తారు. అయితే అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) కూడా ఒకరు. ఎందుకంటే ఆయన ఓ సినిమా కోసం ఏకంగా 100 కోడిగుడ్లతో కొట్టించుకున్నారట. మరి ఇంతకీ అక్షయ్ కుమార్ ఏ సినిమా కోసం 100 కోడి గుడ్లతో కొట్టించుకున్నారు.. ? ఎందుకు ఇలాంటి సీన్ చేయవలసి వచ్చింది ? అనేది ఇప్పుడు చూద్దాం.


అక్షయ్ కుమార్ పై కొరియోగ్రాఫర్ ప్రశంసలు…

కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ (Chinni Prakash) అంటే తెలియని వారు ఉండరు. ఆయన ఈ మధ్యకాలంలో అక్షయ్ కుమార్ తన సినిమాల పట్ల ఎంత అంకితభావంతో పనిచేస్తారు అనే విషయంలో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తో చెప్పారు.అంతేకాదు అక్షయ్ కుమార్ క్రమశిక్షణని ప్రశంసించారు కూడా.. చిన్ని ప్రకాష్ ఫ్రైడే టాకీస్ తో మాట్లాడుతూ.. “అక్షయ్ కుమార్ చాలా నిజాయితీపరుడు.. ఆయన తనకి ఇచ్చిన పాత్రకు 100% న్యాయం చేస్తాడు.నేను ఆయనతో కలిసి దాదాపు 25 నుండి 50 పాటల వరకు చేశాను. అన్ని పాటలు చేసినా కానీ ఒక్క పాటలో కూడా అక్షయ్ కుమార్ నాకు అడ్డు చెప్పలేదు.నేను చెప్పినట్లే చేశారు తప్ప నన్ను ఇబ్బంది పెట్టలేదు.

100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్..

ఇక 1992లో వచ్చిన ఖిలాడి సినిమాలోని ఓ పాట కోసం అక్షయ్ కుమార్ మీద 100 కోడిగుడ్లు కొట్టాము. అయితే ఆ పాటలోని ఓ సీన్లో అమ్మాయిలందరూ అక్షయ్ పై గుడ్లతో కొట్టాల్సి ఉంటుంది. అలా గుడ్లతో కొట్టినప్పుడు కాస్త నొప్పి కూడా ఉంటుంది. అలాగే గుడ్డు స్మెల్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. గుడ్డు మీద పడితే విపరీతమైన వాసన వస్తుంది. అలాగే ఆ వాసన చాలా సేపటి వరకు అలాగే ఉంటుంది. అయితే ఈ సీన్ చేయడానికి అక్షయ్ అస్సలు మొహమాట పడలేదు. తనకి గుడ్డుతో కొట్టడం వల్ల నొప్పి వస్తుంది అని తెలుసు..దాని నుండి విపరీతమైన వాసన వస్తుంది అని కూడా తెలుసు. అయినా కూడా ఆయన వాటన్నింటినీ భరించి 100 గుడ్లను కొట్టించుకున్నాడు. ఆ సీన్ కోసం చాలా కష్టపడి పని చేశాడు. కేవలం ఆ ఒక్క సీన్ మాత్రమే కాదు అక్షయ్ కుమార్ తనకు ఇచ్చిన ప్రతి ఒక్క సీన్ కోసం కష్టపడేవాడు. అక్షయ్ కుమార్ లో ఎలాంటి ఈగో,కోపం లాంటివి ఉండవు. అతను ఏ విషయంలో అయినా సరే చాలా నిక్కచ్చిగా ఉంటాడు. నేను ఇప్పటివరకు అక్షయ్ కుమార్ కంటే ఎక్కువ కష్టపడి పని చేసే యాక్టర్ ని చూడలేదు.తన సినిమాల పట్ల ఆయన చాలా అంకిత భావంతో ఉంటాడు” అంటూ అక్షయ్ కుమార్ యాక్టింగ్ ని ఓ రేంజ్ లో పొగుడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్..


ALSO READ:Rashmika: 29 ఏళ్లకే అరుదైన రికార్డు.. బడా బడా హీరోలకు కూడా సాధ్యం కానీ!

20 సంవత్సరాల తర్వాత కూడా అదే అంకితభావం..

అలాగే రీసెంట్ గా కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ అక్షయ్ కుమార్ తో కలిసి హౌస్ ఫుల్ ఫిల్మ్ సిరీస్ లో వర్క్ చేశాడు. ఈ సిరీస్ సమయంలో అక్షయ్ కుమార్ 20 సంవత్సరాల తర్వాత కూడా అదే వైఖరిని కలిగి ఉన్నాడు.ఈ మధ్యనే నేను అక్షయ్ కుమార్ తో కలిసి హౌస్ ఫుల్ సిరీస్ చేశాను. ఇప్పటికి కూడా అక్షయ్ కుమార్ సినిమాల పట్ల అదే అంకితభావాన్ని చూపిస్తున్నాడు.సినిమాలో సీన్ డిమాండ్ చేస్తే అక్షయ్ కుమార్ 10వ అంతస్తు భవనం నుండి దూకమని చెప్పినా క్షణం కూడా ఆలోచించకుండా దూకేస్తాడు అంటూ అక్షయ్ కుమార్ పై పొగడ్తల వర్షం కురిపించారు కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్..

అక్షయ్ కుమార్ సినిమాలు..

అక్షయ్ కుమార్ సినిమాల విషయానికి వస్తే..ఆయన చేతిలో ప్రస్తుతం ధూమ్-4, వెల్కమ్ టు ది జంగిల్, బూత్ బంగ్లా వంటి సినిమాలు ఉన్నాయి. ఈయన చివరిగా జాలి LLB-3 అనే మూవీలో కనిపించారు.

Related News

Jigris Movie : ‘జిగ్రీస్’కు అండగా తరుణ్ భాస్కర్… క్రేజీ డైరెక్టర్ చేతుల మీదుగా ‘మీరేలే’ సాంగ్ రిలీజ్

The Raja saab: ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో షాక్ ఇచ్చిన రాజా సాబ్ టీమ్.. నిరీక్షణ తప్పదా?

AA22 ×A6: అల్లు అర్జున్ అట్లీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. కన్ఫామ్ చేసిన బన్నీ!

#NTRNeel: డైరెక్టర్‌తో గొడవలకు పుల్‌స్టాప్… కొత్త షెడ్యూల్‌కి రెడీ అవుతున్న ఎన్టీఆర్!

The Raja Saab : ఇంకా ఓటీటీ డీల్ కాలేదు… VXF కాలేదు… పైగా 218 కోట్ల తలనొప్పి ?

Kalki -Shambhala: ప్రభాస్ కల్కి సినిమాకు.. ఆది శంభాలకు లింక్

Aadi Sai Kumar: శంబాల ఆఖరి ప్రయత్నం.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న హీరో!

Bandla Ganesh: బండ్లన్న స్పీచ్ వెనుక కిరణ్… ఆ ఇద్దరు ముగ్గురు హీరోలే టార్గెటా ?

Big Stories

×