Hyderabad News: ఆ భార్యభర్తల మధ్య ఏం జరిగిందో తెలీదు. వారిద్దరి మధ్య విభేదాలు చల్లారలేదు. ఫలితంగా భర్తను ఈ లోకం నుంచి పంపేయాలని డిసైడ్ అయ్యింది ఆ ఇంటి ఇల్లాలు. కరెక్టుగా అలాగే చేసింది. చివరకు భర్తను చంపిసేంది భార్య. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్ సిటీలోని కోకాపేట్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
అస్సాంకి చెందిన భార్యాభర్తలు హైదరాబాద్‌లో కొన్నాళ్లుగా జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ జంట కోకాపేట్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. స్థానికుల చెబుతున్న వివరాల మేరకు గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఆవేశం హద్దులు దాటడడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ ఇంటి ఇల్లాలు.. ఏకంగా కత్తితో భర్తపై దాడి చేసింది.
అతగాడి కేకలు విని స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లారు. రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఈ ఘటనకు గురించి తెలియగానే పోలీసులు ఆసుపత్రికి వచ్చారు. కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
హైదరాబాద్ లోని కోకాపేటలో దారుణం
విబేధాల నేపథ్యంలో భర్తను కత్తితో హత్య చేసిన భార్య
నిన్న అర్ధరాత్రి భర్త కేకలు వేయడంతో ఇంట్లోకి వచ్చిన స్థానికులు
రక్తపు మడుగులో ఉన్న భర్తను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి
భార్యాభర్తలు అసోం రాష్ట్రానికి చెందిన వారని చెప్తున్న… pic.twitter.com/Bi0wSObUib
— BIG TV Breaking News (@bigtvtelugu) September 19, 2025