Theater Movies: ప్రతి వారం థియేటర్లోకి బోలెడు సినిమాలో రిలీజ్ అవుతుంటాయి.. ప్రతి నెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. అయితే సెప్టెంబర్ నెలలో మాత్రం బోలెడు కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. ఈ మధ్య రిలీజ్ అయిన మిరాయ్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో పాటుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించిన కిష్కింధపురి అనే సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది కానీ తేజ మూవీ మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కేవలం రిలీజ్ అయిన వారం రోజుల లోపే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక ఈవారం థియేటర్లలోకి కొన్ని కొత్త సినిమాలు రాబోతున్నాయి. మరిక ఆలస్యం ఎందుకు థియేటర్లలో సందడి చెయ్యబోతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..
సెప్టెంబర్ 19న రిలీజ్ కాబోతున్న సినిమాలను చూస్తే.. చిన్న సినిమాలే ఉన్నాయి. తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తోన్న `భద్రకాళి` తప్ప, మిగిలిన అన్ని సినిమాలు తక్కువ బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం. వాటిలో మంచు లక్ష్మి, మోహన్‌బాబు నటించిన `దక్ష`, అలాగే మరో రెండు సినిమాలు థియేటర్లలోకి రిలీజ్ కాబోతున్నాయి.. ఈ సినిమాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ల పై రూపొందిన చిత్రం దక్ష.. మంచు లక్ష్మి, మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇవాళ థియేటర్లోకి వచ్చింది. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఈ చిత్రంలో నటించడం విశేషం. సముద్రఖని మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు. ఈ సినిమాలో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రిలీజ్ చేయబోతున్నారు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమా లేని మంచు లక్ష్మి కి ఈ సినిమా అయినా హిట్ టాక్ ను అందిస్తుందేమో చూడాలి..
తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం భద్రకాళి.. కంటెంట్ ఉన్న చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరవుతున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు ఆయన `భద్రకాళి` అనే చిత్రంతో ఈశుక్రవారం ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ అరుణ్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పకులు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. భారీ అంచనాలతో ఇవాళ థియేటర్లలోకి ఈ సినిమా వచ్చేసింది.
హీరో అంకిత్ కొయ్య చిన్న చిన్న సినిమాలు చేస్తూ స్టార్ హీరో అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన `బ్యూటీ` చిత్రంతో రాబోతున్నారు. ఇందులో నీలఖి హీరోయిన్‌గా నటించింది. జే ఎస్ ఎస్ వర్థన్ దర్శకుడు.. మారుతి టీమ్ ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ పతాకంపై విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించారు..ఈ సినిమా కూడా ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది…
Also Read : ప్రేమ రహస్యం శ్రీవల్లికి తెలిసిపోతుందా? నర్మద దెబ్బకు మైండ్ బ్లాక్.. కళ్యాణ్ కోసం ధీరజ్ వేట..
వీటితో పాటుగా మరో రెండు మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను అల్లరించేందుకు థియేటర్లోకి వచ్చేసాయి. వచ్చేవారం స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాడంతో ఈ సినిమాలన్నీ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. ఇవాళ రిలీజ్ అయిన సినిమాలలో భద్రకాళి సినిమా ఒక్కటే కాస్త ఆసక్తికరంగా ఉంది.. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.. విజయ్ ఆంటోని ఎప్పుడూ కొత్త సినిమాలను, సరికొత్త కథతో ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు.. మరి ఈ సినిమా ఏ మాత్రం మెప్పిస్తుందో.. ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి..