The Raja Saab: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)నటించిన తాజా చిత్రంది రాజా సాబ్(Raja Saab) . మారుతి(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కామెడీ హర్రర్ త్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా సంక్రాంతి పండుగ నుంచి కూడా తప్పుకొని మరోసారి వాయిదా పడుతుంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి.
ఇలా ఈ సినిమా వాయిదా పడుతోంది అంటూ వస్తున్నటువంటి వార్తలపై తాజాగా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా అధికారికంగా స్పందిస్తూ సినిమా విడుదల విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఫుల్ స్వింగ్ లో ప్రభాస్ ది రాజా సాబ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందని క్లారిటీ ఇచ్చారు అలాగే ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. జనవరి 9వ తేదీ ఈ సినిమా అన్ని భాషలలోనూ ఐమాక్స్ వెర్షన్ తో పాటు అన్ని లార్జెర్ ఫార్మాట్ లో విడుదల కాబోతుందని వెల్లడించారు. డిసెంబర్ 25 నాటికి ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని, అలాగే డిసెంబర్లో యూఎస్ఏ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్టు చిత్ర బృందం వెల్లడించారు. ఇలా అన్ని హంగులతో సంక్రాంతి సందడిని రెట్టింపు చేయడానికి రాజా సాబ్ రాబోతున్నారు అంటూ మేకర్స్ ఈ సినిమా విడుదల గురించి క్లారిటీ ఇస్తూ అధికారకంగా ఒక పోస్ట్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బాహుబలి ది ఎపిక్…
ఇక చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఒక కామెడీ హర్రర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా, ఇందులో ప్రభాస్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ తో పాటు టీజర్ వీడియో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ప్రభాస్ చివరిగా కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈయన నటించిన సినిమాలు ఈ ఏడాది ఏవి ప్రేక్షకుల ముందుకు రాకపోయినా, ప్రభాస్ నటించిన సినిమాలు రీ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను సందడి చేశాయి .ఇక ప్రస్తుతం థియేటర్లలో బాహుబలి ది ఎపిక్ సినిమా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.
Also Read: Prakash Raj: అవార్డుల విషయంలో రాజీ… జాతీయ అవార్డులపై ప్రకాష్ రాజ్ కామెంట్స్!