BigTV English
Advertisement

Awara: రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎప్పుడంటే?

Awara: రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎప్పుడంటే?

Awara:ప్రస్తుత కాలంలో రీ రిలీజ్ చిత్రాల హవా ఎక్కువగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒకదానిని మించి మరొకచిత్రం థియేటర్లలో విడుదలవుతూ అటు అభిమానులను ఇటు సినీ లవర్స్ ను మళ్లీమళ్లీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలను మాత్రమే కాదు డిజాస్టర్ గా నిలిచిన చిత్రాలను కూడా రీ రిలీజ్ చేసి ఇప్పుడు నిర్మాతలు లాభపడుతున్నారు. ఇటీవల ఆరెంజ్ సినిమాను కూడా రీ రిలీజ్ చేసి భారీ కలెక్షన్లు అందుకొని ఆ డబ్బులు జనసేన పార్టీకి నిర్మాత నాగబాబు(Nagababu) కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైనప్పుడు నిర్మాత నాగబాబును అప్పుల్లోకి నెట్టివేయడమే కాకుండా రోడ్డున పడేలా చేసింది.


రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న కార్తీ ఆవారా..

ఇలాంటి ఎన్నో చిత్రాలు అప్పట్లో డిజాస్టర్ గా నిలిచి.. ఇప్పుడు రీ రిలీజ్ లో సత్తా చాటుతూ దూసుకుపోతున్నాయి. ఇక ఈ జాబితాలోకి ఇప్పుడు కార్తీ (karthi) ‘ఆవారా’ సినిమా కూడా వచ్చి చేరింది. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా నిలిచిన ఈ చిత్రం.. ఇప్పుడు మళ్లీ విడుదల కావడానికి సిద్ధమవుతోంది.. అసలు విషయంలోకి వెళ్తే.. 2010లో ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి(N. Linguswamy ) దర్శకత్వంలో కార్తీ హీరోగా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ఆవారా. అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. అంతేకాదు ఈ సినిమా పాటలు ఇప్పటికీ కూడా వినిపిస్తూ ఉంటాయనడంలో సందేహం లేదు. ఆ తరం యువతనే కాదు జనరేషన్ మారినా.. ప్రతి జనరేషన్ ని ఈ చిత్రం ఆకట్టుకుంటుంది అని.. ఇప్పుడు ఈ రీ రిలీజ్ తో స్పష్టం కాబోతోంది అంటూ నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:Actress Death: బాలీవుడ్ అత్తగారు మృతి.. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ!


రీ రిలీజ్ ఎప్పుడంటే?

విషయంలోకి వెళ్తే.. అప్పట్లో మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ సినిమా.. నవంబర్ 22వ తేదీన 4k వెర్షన్ లో రీ రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు మేకర్స్ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరి ఈ రీ రిలీజ్ లో ఈతరం యువతను ఈ సినిమా ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

హీరో కార్తీ సినిమాలు..

పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ లో మార్షల్ సినిమా రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అలాగే స్పై థ్రిల్లర్ మూవీ సర్దార్ 2 కూడా ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుపుకుంటుంది. అలాగే కృతి శెట్టి, సత్యరాజ్ ప్రధాన పాత్రలో వస్తున్న వా వాతియర్ సినిమాలో కూడా కార్తీ నటిస్తున్నారు. ఇది పోలీస్ డ్రామా మూవీ కావడం గమనార్హం. అలాగే 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ కైతి సినిమా సీక్వెల్ కైతి 2 లో కూడా నటిస్తున్నారు. అలాగే దర్శకులు మారి సెల్వరాజ్, గౌతమ్ మీనన్లతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు కార్తీ.

Related News

#NTRNeel: డైరెక్టర్‌తో గొడవలకు పుల్‌స్టాప్… కొత్త షెడ్యూల్‌కి రెడీ అవుతున్న ఎన్టీఆర్!

The Raja Saab : ఇంకా ఓటీటీ డీల్ కాలేదు… VXF కాలేదు… పైగా 218 కోట్ల తలనొప్పి ?

Kalki -Shambhala: ప్రభాస్ కల్కి సినిమాకు.. ఆది శంభాలకు లింక్

Aadi Sai Kumar: శంబాల ఆఖరి ప్రయత్నం.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న హీరో!

Bandla Ganesh: బండ్లన్న స్పీచ్ వెనుక కిరణ్… ఆ ఇద్దరు ముగ్గురు హీరోలే టార్గెటా ?

The Raja Saab: ప్రభాస్ రాజా సాబ్ వాయిదా… ఫైనల్లీ నిర్మాతలు స్పందించారు.. ఏం అన్నారంటే ?

Akshay Kumar: 100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్.. షాక్ లో ఫ్యాన్స్!

Prakash Raj: అవార్డుల విషయంలో రాజీ… జాతీయ అవార్డులపై ప్రకాష్ రాజ్ కామెంట్స్!

Big Stories

×