Rajeev Kanakala: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు పొందిన వారిలో రాజీవ్ కనకాల (Rajeev Kanakala)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ దర్శకులు దేవదాస్ కనకాల కుమారుడిగా ఈయన కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఇటీవల కాలంలో రాజీవ్ కనకాల ఏదైనా ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ సినిమాలో దర్శక నిర్మాతలు ఆయనని చంపేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా సినిమాలలో రాజీవ్ కనకాల నటిస్తున్న పాత్రను చంపేస్తే ఆ సినిమా సక్సెస్ అవుతుందనే సెంటిమెంట్ కూడా ఇండస్ట్రీలో ఉంది.
ఇలా ప్రతి సినిమాలోను ఈయన చనిపోయే పాత్రలలో నటిస్తున్న నేపథ్యంలో సుమ కనకాల (Suma Kanakala)దయచేసి మా ఆయనని సినిమాలలో బ్రతికించండి అంటూ సరదాగా ఓ సందర్భంలో మాట్లాడారు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఇదే విషయం గురించి రాజీవ్ కనకాల మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నేను కనుక చనిపోయే పాత్రలలో నటిస్తున్నాను అంటే సుమ చాలా సీరియస్ అవుతూ నన్ను తిడుతుందని తెలిపారు. చనిపోయే పాత్రలలో నటించడం ఎందుకు రాజా నటించకపోతే సరిపోయేది కదా అంటూ ఇప్పటికీ తిడుతుందని తెలిపారు.
ఒక దర్శకుడు ఆ పాత్ర కోసం నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చారు అంటే ఆ పాత్రకు నేను మాత్రమే న్యాయం చేయగలనని వాళ్లు భావిస్తున్నట్టు. అలాంటప్పుడు ఎందుకు వదులుకోవాలని నేను కూడా తనకి ఇదే చెబుతూ ఉంటాను. ఏది చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. నేను ఆ పాత్రకు సూట్ అవుతానని వారు భావిస్తున్నారు అందుకే తాను కూడా నటిస్తున్నానని రాజీవ్ కనకాల ఈ సందర్భంగా తెలియచేశారు. అయితే ఈయన ఏ సినిమాలో అయితే చనిపోయే పాత్రలో నటిస్తున్నారో ఆ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి.
కానిస్టేబుల్ పాత్రలో సుమ..
ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాజీవ్ కనకాల సుమ గొడవల గురించి, విడాకుల గురించి కూడా ప్రశ్నలు ఎదురవడంతో ఎప్పటిలాగే ఈయన సమాధానం ఇచ్చారు. అందరు భార్యాభర్తలులాగే మా మధ్య గొడవలు ఉంటాయి కానీ విడాకులు అయితే తీసుకోలేదని తెలిపారు. సోషల్ మీడియాలోనే నాకు సుమకు చాలా సార్లు విడాకులు ఇచ్చేశారు అంటూ సరదాగా మాట్లాడారు. గతంలో ఎన్నో సందర్భాలలో సుమ రాజీవ్ విడాకులు తీసుకొని విడిపోతున్నారని, ఇద్దరూ వేరుగా ఉంటున్నారంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. ఇక సుమ కెరియర్ పరంగా యాంకర్ గా ఎంతో బిజీగా ఉండడమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈమె ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ప్రేమంటే(Premante) సినిమాలో కానిస్టేబుల్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక సుమ కుమారుడు రోషన్ కూడా ఇండస్ట్రీలో హీరోగా బిజీగా గడుపుతున్నారు.