Bandla Ganesh: ప్రముఖ సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తిరిగి యాక్టివ్ అయ్యారు. ఈయన సోషల్ మీడియా వేదికగా ఈయన చేసే పోస్టులు క్షణాల్లో వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున చర్చలకు కూడా కారణం అవుతాయని చెప్పాలి. బండ గణేష్(Bandla Ganesh) ఎవరిని ఉద్దేశించి పోస్ట్ చేశారనే విషయాన్ని తెలియ చేయకపోయినా ఈయన మాత్రం పరోక్షంగా కొందరిని టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తుంటారు.. అయితే తాజాగా బండ్ల గణేష్ తన అధికారక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారడమే కాకుండా చర్చలకు కూడా కారణం అవుతుంది.
ఈయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ..”అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు..మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు..!” అంటూ పోస్ట్ చేశారు అయితే ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారడంతో నీ గురించి నువ్వే చెప్పుకుంటుంటే చాలా కామెడీగా ఉంది బండ్లన్న అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరికొందరు ఈయన చెప్పింది అక్షరాల వాస్తవమే అంటూ ఈ పోస్టుపై కామెంట్లు పెడుతున్నారు.. అయితే బండ్ల గణేష్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలకు కూడా కారణమైంది. బండ్ల గణేష్ ఈ పోస్ట్ ఒక నిర్మాతను ఉద్దేశించి చేశారంటూ చర్చలు జరుగుతున్నాయి.
బండ్ల గణేష్ ఈ పోస్ట్ టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ ని ఉద్దేశించి చేశారని, ఇటీవల కొన్ని సినిమా వేడుకలలో భాగంగా సదరు ప్రొడ్యూసర్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఈయన ఇలా మాట్లాడారని తెలుస్తోంది. ఒక సినిమా వేడుకలో సదురు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మధ్య కూడా కొంత పాటి వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ ఈ పోస్ట్ చేశారని తెలుస్తోంది . మరి ఈయన చేసిన ఆ పోస్ట్ పై నిర్మాత స్పందిస్తారా ?లేదంటే ఈ విషయాన్ని ఇక్కడితో నిలిపివేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
“అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు… మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు……!
— BANDLA GANESH. (@ganeshbandla) October 16, 2025
ఇక బండ్ల గణేష్ విషయానికి వస్తే ఈయన కెరియర్ మొదట్లో కమెడియన్ గా పలు సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించి అనంతరం నిర్మాతగా మారారు. ఈయన నిర్మాతగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan),రవితేజ(Raviteja), ఎన్టీఆర్(NTR) వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవల కాలంలో బండ్ల గణేష్ పూర్తిగా సినిమాల పరంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు కానీ, ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు గురించి తరచూ ఆయన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక సినిమాల గురించి పలు సందర్భాలలో బండ్ల గణేష్ ను ప్రశ్నించడంతో త్వరలోనే మరో సినిమా నిర్మించబోతున్నానని చెబుతున్నప్పటికీ, తన సినిమాల గురించి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలు వెల్లడించడం లేదు. బండ్లన్న ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సినిమాలకు సంబంధించిన విషయాలు అలాగే రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.