Shabbir Ali Comments: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. బిగ్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ హయాంలో కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు. ఎంఎల్ఏ కి ఎంత బాధ్యత ఉందో.. కిషన్ రెడ్డి కి అంతే బాధ్యత ఉంది. అభివృద్ధి జరగలేదు అనడానికి కిషన్ రెడ్డి కూడా కారణమే అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర మంత్రి, ఎంపీగా ఉన్న నువ్వు.. జూబ్లీహిల్స్ కోసం ఎన్ని నిధులు తెచ్చావు? ఒక్క రూపాయి అయినా తెచ్చి ఉంటే చెప్పు. ఏ ఒక్క ప్రాజెక్టుకైనా కేంద్ర నిధులు తీసుకురాలేదు. అది నీ వైఫల్యం అని కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో మంత్రి పదవి ఉన్నప్పటికీ.. తన నియోజకవర్గానికి ఏదీ చేయలేదని ఆయన విమర్శించారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయినందుకు.. కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని షబ్బీర్ అలీ తెలిపారు. ఇంతకాలం ఎంపీగా, మంత్రిగా ఉన్నా ఒక్క అభివృద్ధి ప్రాజెక్ట్ చూపించలేకపోయావు. ప్రజల ముందు క్షమాపణ చెప్పు కిషన్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణలా సంక్షేమ పథకాలు ఉన్నాయా? పెన్షన్లు, మహిళల ఆర్థిక సాధికారత ఇవన్నీ తెలంగాణ ప్రత్యేకత. బీజేపీకి ప్రజల జీవన స్థాయి గురించి కనీస ఆలోచన లేదు అంటూ ఫైర్ అయ్యారు.
గతంలో పీ జనార్దన్ రెడ్డి చేసిన అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి అని పిలుపునిచ్చారు.
Also Read: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ కేడర్ మద్దతు ఎవరికి?
మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకుని.. షబ్బీర్ అలీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.