Samantha Rakul Vaters in Jubilee Hills: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కి అంత రంగం సిద్దమైంది. అభ్యర్థుల ప్రకటనతో నియోజకవర్గంలో పోరు మరింత హీటెక్కింది. బీఆర్ఎస్ గట్టిగా పోటీ ఇస్తూ అనిల్ యాదవ్ని రంగంలోకి దింపింది కాంగ్రెస్. దీంతో అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది. గెలుపు ఎవరిదా అని వాడివేడిగా చర్చ జరుగుతుంది. ఇక ఎన్నికల సమయం కూడా దగ్గరపడుతున్నకొద్ది గెలుపుపై మరింత ఉత్కంఠ నెలకొంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఓటర్లపై ఆసక్తి నెలకొంది.
ఎవరూ ఏటు ఎక్కువ మొగ్గుచూపుతున్నారనే సర్వేలు కూడా మొదలయ్యాయి. ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికలు హాట్ టాపిక్ అవుతుంటే.. మరోవైపు ఓటర్ల లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. జూబ్లీహిల్స్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు.. వివిధ వర్గాల ఓటర్ల ఎంతమంది అంటూ ఓటర్ల జాబితాలను సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారు. ఈ ఓటర్ల జాబితాలో సినీ హీరోయిన్లు సమంత, తమన్నా, రకుల్ పేర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు వారి పేరుపై ఉన్న ఓటర్లు స్లిప్పులు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో ఇది కాస్తా ఎన్నికల సంఘం కంటపడింది. తీరా చూస్తే ఇవి ఫేక్ ఓటర్ జాబితా అని తేలడంతో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యింది. అంతేకాదు ఈ ఓటర్ల జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, సమంతల పేర్లు కూడా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇది ఎన్నికల సంఘాన్ని మరింత కోపానికి గురిచేసింది. దీంతో ఫేక్ ఓటర్ల జాబితాపై ఈసీఐ చర్యలకు దిగింది. సినీ నటులు సమంత, తమన్నా, రకుల్ ఫేక్ ఓటర్ జాబితాను వైరల్ చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read: Bigg Boss 9: బిగ్బాస్ షోకి బిగ్ షాక్.. అశ్లీలత ప్రోత్సహిస్తున్నారంటూ కేసు నమోదు
ఈ మేరకు ఎ న్నికల కమిషన్ ఓ ప్రకటన ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓటర్ల జాబితా ఫేక్ అని, ఈసీఐ ప్రతిష్ఠను దిగజార్చేలా కొందరు సోషల్ మీడియాలో ఈ ఫేక్ జాబితాను వైరల్ చేస్తున్నారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. ఎక్కడ వీటిని ఫ్యాబ్రికేట్ చేశారని, ఎవరూ ప్రచారం చేశారన్న అంశాలపై ఎన్నికల అధికారులు విచారణ జరుపుతున్నారు. అలాగే హీరోయిన్లు పేరుతో ఓటర్ స్లీప్పుల అంశంపై కూడా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇకపై ఎవరైన ఫేక్ ఓటర్ల జాబితా తయారు చేసి వైరల్ చేస్తే చర్యలు తప్పవని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఓటర్లుగా స్టార్ హీరోయిన్లు.. ఫేక్ ప్రచారంపై ఈసీ సీరియస్..
టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లుగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం
ఈసీ ప్రతిష్ఠ దిగ జార్చేలా ప్రచారం చేయడంపై పోలీసులకు ఫిర్యాదు
అటు.. టాలీవుడ్ హీరోయిన్ల… pic.twitter.com/rSbnhvf5u9
— BIG TV Breaking News (@bigtvtelugu) October 16, 2025
కాగా గతంలో సమంత, రకుల్, తమన్నా హైదరాబాద్ లో సెటిలైన సంగతి తెలిసిందే. అక్కినేని కోడలైన తర్వాత సమంత ఇక్కడే తన ఓటర్ అడ్రస్ మార్చుకుంది. ఇక రకుల్, తమన్నా కూడా ఇక్కడే మార్చుకున్నారు. ఇప్పుడు సమంత హైదరాబాద్ వదలి ముంబై వెళ్లిపోయింది. ఇక రకుల్ కూడా జాకీ భగ్నానీతో పెళ్లి అనంతరం ముంబైలోనే ఉంటుంది. ఈ క్రమంలో వారి ఓటింగ్ అడ్రస్ ను హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చుకున్నారు. అయితే ఈ క్రమంలో ఓటర్ జాబితాలో వారి పేర్లు పెట్టడం, అలాగే తప్పుడు లెక్కలతో ఓటర్ల జాబితాను తయారు చేయడంతో ఎన్నికల సంఘం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది.