BigTV English
Advertisement

Mirai Collections : కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ‘మిరాయ్’.. హనుమాన్ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా..?

Mirai Collections : కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ‘మిరాయ్’.. హనుమాన్ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా..?

Mirai Collections : గత ఏడాది ఎటువంటి అర్భాటాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన హనుమాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా మరో సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేసాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన మిరాయ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఈ నెల ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. విజువల్ వండర్ గా తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకులు సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పాజిటివ్ టాక్ తో పాటుగా మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. ఈ మూవీ ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో చూద్దాం..


‘మిరాయ్’ కలెక్షన్స్..

విజువల్ వండర్ గా తెరకెక్కిన మిరాయ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు తేజా. రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో నిన్న థియేటర్లలోకి రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అనుకున్నట్లుగానే థియేటర్లోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులను బాగా అలరించింది. అంటూ సినిమా పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మొదటి షో నుంచి కలెక్షన్ల ఊచకోత మొదలైంది.. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 18 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక రెండో రోజు కూడా భారీగానే ఓపెనింగ్స్ జరిగాయి. 55 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను వసూల్ చేసింది. మూడు రోజులకు గాను 68 కోట్లు వసూళ్లను అందుకుంది. 48 కోట్ల నెట్ కలెక్షన్స్ ను అందుకుంది.

Also Read : ఈ వారం ఒక్కరోజే ఓటీటీలోకి 15 సినిమాలు.. ఆ 3 మిస్ అవ్వకండి..


హనుమాన్ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా..?

హనుమాన్ సినిమా ఒక్కసారిగా అతని స్టార్ని చేసింది. ఈ మూవీ ఊహించని విధంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాతగా వచ్చిన మిరాయ్ సినిమా ప్రస్తుతం థియేటర్ల లో సక్సెస్ఫుల్ టాక్ తో రన్ అవుతుంది. ఈ సినిమాను నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కింది.. అలాగే రితీక నాయక్ హీరోయిన్‌గా నటించారు. జగపతి బాబు, జయరాం, దర్శకులు తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. టెక్నీషియన్లు, మ్యూజిక్, నటీనటుల రెమ్యూనిరేషన్ మొత్తం కలిపి 60 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా హిట్ అవ్వడానికి 65 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాలి.. మొదటిరోజు 18 కోట్లను వసూలు చేసినట్లు తెలుస్తుంది. రెండో రోజు 55 కోట్లు, మూడో రోజు 68 కోట్లు మొత్తంగా వసూల్ చేసింది. అధికారిక ప్రకటన రాలేదు. మరి మరి రెండో వారం ఎన్ని కోట్లు అందుకుంటుందో చూడాలి..

 

Related News

Jailer 2: జైలర్ 2 నుంచి తప్పుకున్న బాలయ్య.. రంగంలోకి మరొక స్టార్ హీరో?

Ram pothineni: డెబ్యూ డైరెక్టర్ తో రామ్ పోతినేని.. జనవరి నుంచి షూటింగ్ మొదలు!

The Girl Friend Censor Review : రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సెన్సార్ రివ్యూ… ఏకంగా జాతీయ అవార్డే

Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్  ఫైర్ అవుతున్న ఆ హీరో ఫ్యాన్స్.. ఏమైందంటే?

Hyper Aadi: హైపర్‌ ఆది చంపేస్తానంటూ బాలయ్య వార్నింగ్‌.. అసలేం జరిగిందంటే!

Prasanth Varma : డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మకు కోట్ల రూపాయల అడ్వాన్స్… ఫైనల్‌గా ఓపెన్ అయిన నిర్మాత

Salman Khan: దిల్ రాజుతో డీల్ కుదుర్చుకున్న సల్మాన్ ఖాన్..ఆ డైరెక్టర్ తో కొత్త సినిమా?

Abishan Jeevinth: ఘనంగా టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ వివాహం.. ఫోటోలు వైరల్!

Big Stories

×