BigTV English
Advertisement

Dhanush: ఇడ్లీ తినడానికి కూడా డబ్బుల్లేవు.. నాటి బాధలు గుర్తుచేసుకున్న ధనుష్!

Dhanush: ఇడ్లీ తినడానికి కూడా డబ్బుల్లేవు.. నాటి బాధలు గుర్తుచేసుకున్న ధనుష్!

Dhanush: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటనతో.. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా చలామణి అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు, హేళనలు ఎదుర్కొన్న ఈయన.. నేడు సౌత్ స్టార్ గా పేరు సొంతం చేసుకొని.. అందరి మన్ననలు పొందుతున్నారు. అలాంటి ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఇడ్లీ కడై’..ఇటీవలే తెలుగులో ‘కుబేర’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన.. ఇప్పుడు తన స్వీయ దర్శకత్వంలో ‘ఇడ్లీ కొట్టు’ అనే తెలుగు టైటిల్ తో అక్టోబర్ 1న ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు.


ఘనంగా ఇడ్లీ కడై ఆడియో లాంఛ్..

ఇందులో ధనుష్ సరసన నిత్యామీనన్ (Nithya Menon) రెండవసారి నటిస్తున్నారు .ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘తిరు’ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. వీరితో పాటు ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ షాలిని పాండే (Shalini pande), ప్రకాష్ రాజ్ (Prakash Raj) కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్రామీణ ప్రాంత నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ గా రూపొందిస్తున్నారు.అటు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ఇటీవల ఘనంగా నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న ధనుష్ తన బాల్యంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పంచుకున్నారు.

ALSO READ:Bigg Boss 9: నాగ్ తో ఆ పనికి సిద్ధమైన శ్రష్టి.. చెప్పినట్టుగానే వచ్చిందిగా?


ఇడ్లీ తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు..

ధనుష్ మాట్లాడుతూ.. ‘ఇడ్లీ కడై’ సినిమా నిజ జీవిత ఆధారంగా రూపొందించింది. ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. నిజానికి నా చిన్నతనంలో ప్రతిరోజు ఇడ్లీ తినాలని ఆశగా ఉండేది. కానీ అప్పుడు ఇడ్లీ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఇప్పుడు డబ్బులు ఉన్నా.. నా చిన్నతనంలో ఇడ్లీ తినేటప్పుడు ఉన్న ఆనందం.. ఆ ఇడ్లీ రుచి ఇప్పుడు ఉండడం లేదు.. ఏదైనా సరే కాలంతో పాటు మనం కూడా మారాల్సిందే ” అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు ధనుష్. మొత్తానికైతే ఇడ్లీ తినడానికి కూడా డబ్బులు లేవని చెప్పి అభిమానులను సైతం ఆశ్చర్యపరిచారు. నేడు వందల కోట్ల ఆస్తికి అధిపతి అయిన ఈయన.. నాటి స్మృతులను గుర్తు చేసుకోవడం వైరల్ గా మారింది..

ఫేక్ కి.. రియాలిటీకి చాలా తేడా ఉంటుంది..

అలాగే తనపై వచ్చిన ట్రోల్స్ గురించి కూడా మాట్లాడుతూ.. అసలు హేటర్స్ అనే కాన్సెప్టే ఎప్పటికీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హీరోలు అందరి సినిమాలు చూస్తారు. ఎవరో 30 మంది ఒక టీం గా ఏర్పడి.. 300 ఫేక్ ఐడీలను క్రియేట్ చేసుకుని వారి మనుగడ కోసం కొంతమంది హీరోలపై కావాలని ద్వేషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే ఆ 30 మంది కూడా సినిమా చూస్తారు అనే విషయం చాలామందికి తెలియదు. బయట కనిపించడానికి రియాలిటీ కి చాలా తేడా ఉంటుంది. ఇది ప్రజలు గమనించాలి” అంటూ కూడా తెలిపారు ధనుష్.

వడ చెన్నై సీక్వెల్ పై క్లారిటీ..

ఇదిలా ఉండగా ఇదే ఈవెంట్లో తన మూవీ సీక్వెల్ పై కూడా ఆయన స్పందించారు. త్వరలోనే వెట్రిమోరన్ దర్శకత్వంలో ‘వడ చెన్నై’ సినిమా సీక్వెల్ తో రాబోతున్నట్లు స్పష్టం చేశారు. మొత్తానికి అయితే ధనుష్ ఇప్పుడు భారీ అంచనాలతో ఒక సినిమా తర్వాత మరొక సినిమాని విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు.

Related News

The Girl Friend: ఒక పాట కోసం కోటి రూపాయలు ఖర్చు అయిపోయింది, ఇంతకు మించిన బూతు లేదు

The Girl Friend: సితార బ్యానర్ కు ఏమైంది? ది గర్ల్ ఫ్రెండ్ ని కూడా వదులుకున్నారు

Sandeep Reddy Vanga: అసిస్టెంట్ డైరెక్టర్ పెళ్లికి హాజరైన సందీప్ రెడ్డి వంగ, కనిపించిన వ్యక్తిత్వం

Dhruv Vikram : రియల్ కబడ్డీ ప్లేయర్ కార్తిక ను కలిసి అభినందనలు తెలిపిన ధృవ్

Sai Durga Tej : ఆ విలక్షణ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి తేజ్

Sun pictures : ఇద్దరు ప్లాప్ డైరెక్టర్లతో కలిసి ఒక సినిమా, రేపే అనౌన్స్మెంట్

Actor Dharmendra: హాస్పిటల్ పాలైన ప్రముఖ నటుడు…ఆందోళనలో అభిమానులు.. ఏం జరిగిందంటే!

Biker Glimpse : మొత్తానికి శర్వానంద్ సినిమా వస్తుంది, దీని పరిస్థితి ఏంటో?

Big Stories

×