 
					Naga Vamsi: టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటిగా వెలుగొందుతుంది సితార ఎంటర్ టైన్మెంట్స్. మంచి మంచి కథలను వెతికి, స్టార్ హీరోల డేట్స్ తీసుకొని ప్రేక్షకులకు మంచి సినిమాలను అందించడానికి నిర్మాత సూర్య దేవర నాగవంశీ ఎప్పుడు ముందే ఉంటాడు. నిర్మాలు కూడా ప్రమోషన్స్ కు వస్తారు.. వారికీ కూడా ఫ్యాన్స్ ఉంటారని నాగవంశీని చూసాకే తెలిసిందని చెప్పుకోవచ్చు.
ఇక ఇండస్ట్రీ అన్నాకా విజయాపజయాలు సాధారణమే. అలాగే నాగవంశీకి కూడా విజయాలు వచ్చాయి.. అపజయాలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువ అపజయాలే అందుకున్నాడు. ముఖ్యంగా కింగ్డమ్, వార్ 2 సినిమాలు సితార ఎంటర్ టైన్మెంట్స్ కు భారీ పరాజయాలను అందుకున్నాయి. ఈ రెండు సినిమాలపై నాగవంశీ భారీ ఆశలను పెట్టుకున్నాడు. వార్ 2 కి అయితే కాలర్ ఎగరేసి మరి చెప్పాడు.
అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి అన్నట్లు.. ఆ రెండు సినిమాలు తెలుగులోనే కాదు హిందీలో కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. వార్ 2 హక్కులను ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా రికార్డ్ ధరకు కొనుగోలు చేయడంతో నాగవంశీ అతలాకుతలం అయ్యిపోయాడు. ఇక దీనివలన కొద్దిరోజులు ఇండస్ట్రీలో ఎవరికి కనిపించడు అనుకున్నారు కానీ, కొత్త లోకతో నేను ఉన్నాను అని మరోసారి గుర్తుచేశాడు. గుడ్డిలో మెల్ల అన్నట్లు ఈ సినిమా నాగవంశీకి కొద్దిగా ఊపిరి పోసింది.
ప్రస్తుతం నాగవంశీ నిర్మిస్తున్న చిత్రాల్లో మాస్ జాతర రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. సూర్య సినిమా సెట్స్ మీద ఉంది. లక్కీ భాస్కర్ లాంటి సినిమాతో హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి.. సూర్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం నాగవంశీ ఆశలన్నీఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. హిట్ డైరెక్టర్.. మరో హిట్ ను ఇస్తాడని నమ్ముతున్నాడు. అనుకున్నట్లుగానే ఈ సినిమాకు ఓటీటీ డీల్ కూడా బాగా గట్టిగా జరిగిందని తెలుస్తోంది.
సినిమా ఇంకా ఫినిష్ కాకముందే దాదాపు రూ. 80 కోట్లతో ఓటీటీ డీల్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే అది ఏ ఓటీటీ అనేది ఇంకా తెలియరాలేదు. 80 కోట్లు అంటే అది చిన్న మొత్తం అయితే కాదు. ఈసారి నాగవంశీ మరో జాక్ పాటు ను అందుకున్నట్టే. మరి ఈ సినిమాతో సూర్య – వెంకీ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో.. నాగవంశీకి ఎలాంటి విజయాన్ని అందిస్తారో చూడాలి.