E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పవన్ ‘ఓజీ’, చరణ్ ‘బ్రూస్ లీ’ కెమెరామెన్‌కు సీఎం విజయ్ బంపర్ గిఫ్ట్.. అసలు మ్యాటర్ ఇదా!

పవన్ ‘ఓజీ’, చరణ్ ‘బ్రూస్ లీ’ కెమెరామెన్‌కు సీఎం విజయ్ బంపర్ గిఫ్ట్.. అసలు మ్యాటర్ ఇదా!
Advertisement

Manoj Paramahamsa: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దళపతి విజయ్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.రాజకీయ వ్యూహాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న విజయ్, మరోవైపు సినిమా రంగానికి చెందిన ప్రముఖులతో వరుస భేటీలు జరుపుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే తాజాగా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అయింది.

సౌత్ ఇండియాలోనే మోస్ట్ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న మనోజ్ పరమహంసకు విజయ్ సర్కార్ ఒక అత్యున్నతమైన పదవిని కట్టబెట్టింది. తమిళనాడు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ నూతన ఛైర్మన్‌గా మనోజ్ పరమహంసను నియమిస్తూ ముఖ్యమంత్రి విజయ్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది.

ఈ ఇన్‌స్టిట్యూట్‌ లోనే చదువుకున్న మనోజ్ పరమహంస 

Advertisement

ఇక్కడ విశేషం ఏంటంటే, మనోజ్ పరమహంస ఏ ఇన్‌స్టిట్యూట్‌లోనైతే ఒకప్పుడు విద్యార్థిగా చేరి సినిమాటోగ్రఫీలో ఓనమాలు నేర్చుకున్నారో, సరిగ్గా అదే ప్రతిష్టాత్మక సంస్థకు ఇప్పుడు ఆయనే బాస్ కావడం ఒక అరుదైన రికార్డ్. ఇన్‌స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చాక అసిస్టెంట్ కెమెరామెన్‌గా ఎన్నో కష్టాలు పడి, తన టాలెంట్‌తో ఈరోజు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌కు చేరుకున్నారు. కేవలం సినిమాలు చేయడమే కాకుండా, తనకున్న టెక్నికల్ నాలెడ్జ్ ని యువతకు పంచాలనే ఉద్దేశంతో ఖాళీ సమయాల్లో వర్క్ షాప్స్ నిర్వహించడం, క్లాసులు చెప్పడం మనోజ్ కు అలవాటు. ఈ నాలెడ్జ్ మరియు అనుభవమే ఆయనకు ఈ పదవి దక్కేలా చేసింది.

విజయ్ సినిమాలకి dop గా చేసిన మనోజ్  

విజయ్ హీరోగా నటించి 2012 జనవరిలో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘స్నేహితుడు’ సినిమాకు మనోజ్ అద్భుతమైన విజువల్స్ అందించారు. ఆ తర్వాత విజయ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్లుగా నిలిచిన ‘బీస్ట్’ (2022 ఏప్రిల్), లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘లియో’ (2023 అక్టోబర్) సినిమాలకు కూడా ఈయనే విజువల్స్ అందించడం విశేషం. ఈ కాంబినేషన్ సక్సెస్ వెనుక ఉన్న బాండింగ్ వల్లే విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ టాక్.

Advertisement

also read :కిరణ్ అబ్బవరం చేతికి ‘కాంతార’ కనెక్షన్.. ఆ బాలీవుడ్ ప్రొడక్షన్‌లో మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్!

అయితే ఈ నియామకంపై తమిళనాడు ప్రతిపక్షాలు మాత్రం అప్పుడే విమర్శల దాడి మొదలుపెట్టాయి. ముఖ్యమంత్రి విజయ్ అర్హతలను పక్కనబెట్టి, కేవలం తన సినిమాలకు పనిచేసిన తన అత్యంత సన్నిహితులకు, స్నేహితులకు మాత్రమే ప్రభుత్వ పదవులు కట్టబెట్టుకుంటున్నారంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు.

తెలుగులోనూ సూపర్ హిట్స్ 

నిజానికి మనోజ్ పరమహంసకు కేవలం తమిళంలోనే కాదు, తెలుగులోనూ తిరుగులేని క్రేజ్ ఉంది. మన టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఎన్నో విజువల్ వండర్స్ వెనుక ఈయన కెమెరా మ్యాజిక్ ఉంది. 2010లో వచ్చిన గౌతమ్ మీనన్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘ఏ మాయ చేశావె’ సినిమాతో మనోజ్ తెలుగులో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ (2015), అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ‘రేసుగుర్రం’ (2014) సినిమాలకు టాప్ నాచ్ విజువల్స్ ఇచ్చారు.

also read :సీనియర్ల సేఫ్ గేమ్.. యంగ్ హీరోల ప్రీ ప్లాన్..వచ్చే సంక్రాంతి రేసులో గెలిచేదేవరు?

ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ (2022) ప్లాప్ అయినా కూడా, ఆ సినిమాలో విజువల్స్ మరియు కలర్ ప్యాలెట్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయంటూ మనోజ్ వర్క్‌ను అందరూ మెచ్చుకున్నారు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో పాటు, పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ డ్రామా ‘హరిహర వీరమల్లు’, మరియు స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’ సినిమాలకు కూడా ఈయనే విజువల్స్ అందిస్తూ బిజీగా ఉన్నారు.

ఈ వివాదానికి విజయ్ ఎలా చెక్ పెడతారో

ఇలాంటి భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న టెక్నీషియన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్‌గా నియమించడం వల్ల రాబోయే తరానికి ఎంతో మేలు జరుగుతుందని సినిమా వర్గాలు అంటుంటే, రాజకీయంగా మాత్రం ఇది విజయ్ వర్సెస్ అపోజిషన్ అన్నట్టుగా మారింది. ఏదేమైనా, ఒకప్పటి స్టూడెంట్ ఇప్పుడు అదే కాలేజీకి ఛైర్మన్ కావడం అనేది ఖచ్చితంగా ఒక సినిమాటిక్ మూమెంట్ అని చెప్పాలి. మరి ఈ కొత్త బాధ్యతల్లో మనోజ్ పరమహంస ఎలాంటి మార్పులు తీసుకువస్తారో, ఈ వివాదానికి విజయ్ ఎలా చెక్ పెడతారో చూడాలి.

Related News

కిరణ్ అబ్బవరం చేతికి ‘కాంతార’ కనెక్షన్.. ఆ బాలీవుడ్ ప్రొడక్షన్‌లో మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్!

సీనియర్ల సేఫ్ గేమ్.. యంగ్ హీరోల ప్రీ ప్లాన్..వచ్చే సంక్రాంతి రేసులో గెలిచేదేవరు?

సమంత నిజంగానే తల్లి కాబోతుందా? ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్‌ పిక్స్ వెనుక మిస్టరీ !

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న “హ్రీం” మూవీ టీజర్.. గ్రాండ్‌గా లాంఛ్ చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి!

గుడ్‌బై చెప్పేసిన టాలీవుడ్ బ్యూటీ… అసలు కారణం ఇదేనా!

ఫస్ట్ టైమ్.. క్లింకార ఫేస్ రివీల్ చేసిన చెర్రీ, ఉపాసన.. ఎంత ముద్దుగా ఉందో!

స్టార్ ప్రొడ్యూసర్ రూ. 1.35 కోట్ల నగలు మాయం.. లగ్జరీ ఫ్యాషన్ జర్నీలో ఊహించని ట్విస్ట్!

Big Stories

×