E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

కిరణ్ అబ్బవరం చేతికి ‘కాంతార’ కనెక్షన్.. ఆ బాలీవుడ్ ప్రొడక్షన్‌లో మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్!

కిరణ్ అబ్బవరం చేతికి ‘కాంతార’ కనెక్షన్.. ఆ బాలీవుడ్ ప్రొడక్షన్‌లో మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్!
Advertisement

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం …ఇపుడు టాలీవుడ్ కి యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో. రాజా వారు రాణి గారు చిత్రంతో ప్రామిసింగ్ హీరోగా పేరు కొట్టేసిన ఈ కుర్ర హీరో ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో మాస్ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు.ఇక ఇటీవలి కాలంలో ‘క’ మరియు ‘కె-ర్యాంప్’ వంటి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్  అందుకున్నారు. ముఖ్యంగా గతేడాది విడుదలైన పీరియాడిక్ మిస్టరీ థ్రిల్లర్ ‘క’ చిత్రం కిరణ్ కెరీర్‌లోనే మైల్‌స్టోన్‌గా నిలిచింది.

కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు వసూళ్ల వర్షం కురిపించింది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు కిరణ్ అబ్బవరం నేరుగా పాన్ ఇండియా మార్కెట్‌పై కన్నేశారు. భారతీయ సినీ పరిశ్రమలో క్రేజీ ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే జీ స్టూడియోస్‌తో కలిసి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ప్రేరణ అరోడా ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం.

దర్శకత్వం వహించనున్న శ్రీకాంత్ పుప్పాల 

Advertisement

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి  శ్రీకాంత్ పుప్పాల దర్శకత్వం వహించనున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ బ్లాక్‌బస్టర్ చిత్రం కాంతార ప్రీక్వెల్ అయిన ‘కాంతార-ఛాప్టర్ 1’ చిత్రానికి దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవం శ్రీకాంత్ పుప్పాలకు ఉంది. రిషబ్ శెట్టి లాంటి విజనరీ మేకర్‌తో పనిచేసిన శ్రీకాంత్, ఇప్పుడు కిరణ్ అబ్బవరం కోసం ఒక మైండ్ బ్లోయింగ్ మిస్టికల్ థ్రిల్లర్ కథను సిద్ధం చేశారు.

also read :సీనియర్ల సేఫ్ గేమ్.. యంగ్ హీరోల ప్రీ ప్లాన్..వచ్చే సంక్రాంతి రేసులో గెలిచేదేవరు?

Advertisement

జూన్ 20న నిర్మాత ప్రేరణ అరోడా అధికారికంగా ఈ ప్రాజెక్టును ప్రకటిస్తూ, సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఈ కథలోని మిస్టరీ ఎలిమెంట్స్, విజువల్ గ్రాండియర్ అన్ని భాషల ప్రేక్షకులను కట్టిపడేస్తాయని, కిరణ్ అబ్బవరం ఇమేజ్‌ను ఈ సినిమా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బాలీవుడ్ మేకింగ్ స్టాండర్డ్స్, సౌత్ ఇండియన్ నేటివిటీ మిక్స్ అయి  రాబోతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్న కిరణ్ 

కేవలం ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా, కిరణ్ అబ్బవరం డైరీ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆయన, ప్రస్తుతం ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. నగర నేపథ్యంలో సాగే ఒక అందమైన ప్రేమకథగా దీనిని తెరకెక్కిస్తున్నారు. దీనితో పాటు కిరణ్ అబ్బవరం అభిమానులకు మరో బిగ్ సర్ప్రైజ్ లైన్‌లో ఉందండోయ్. నటుడిగా తనను తాను నిరూపించుకున్న కిరణ్, త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్నారు కూడా. ఆయన స్వీయ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ సినిమా రూపొందనుంది. నటనతో పాటు దర్శకత్వ ప్రతిభను కూడా చూపించేందుకు ఆయన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్‌లో బిజీయెస్ట్ హీరోగా మారిపోతున్న యంగ్ హీరో 

వీటన్నింటికీ మించి, కిరణ్ అబ్బవరం కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘క’ చిత్రానికి సీక్వెల్‌గా ‘క2’ రాబోతుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొదటి భాగానికి మించిన మైండ్ బెండింగ్ ట్విస్టులతో ఈ సీక్వెల్‌లో చూపించబోతున్నారట. ఈ ఏడాది ఆఖర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ క్రేజీ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉంది. కిరణ్ అబ్బవరం గతంలో నటించిన సెబాస్టియన్, వినరో భాగ్యము విష్ణుకథ, వంటి సినిమాలు ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ, రూట్ మార్చి చేసిన ‘క’ ఇచ్చిన సక్సెస్ ట్రాక్ ఆయనను నేడు పాన్ ఇండియా స్థాయికి చేర్చింది.మొత్తానికి ఒకే సమయంలో అటు లవ్ స్టోరీలు,ఇటు మిస్టికల్ థ్రిల్లర్లు, మరోవైపు సీక్వెల్స్ మరియు సొంత దర్శకత్వంలో సినిమాలు చేస్తూ కిరణ్ అబ్బవరం టాలీవుడ్‌లో అత్యంత బిజీయెస్ట్ హీరోగా మారిపోయారన్న మాట.

also read :గుడ్‌బై చెప్పేసిన టాలీవుడ్ బ్యూటీ… అసలు కారణం ఇదేనా!

Related News

పవన్ ‘ఓజీ’, చరణ్ ‘బ్రూస్ లీ’ కెమెరామెన్‌కు సీఎం విజయ్ బంపర్ గిఫ్ట్.. అసలు మ్యాటర్ ఇదా!

సీనియర్ల సేఫ్ గేమ్.. యంగ్ హీరోల ప్రీ ప్లాన్..వచ్చే సంక్రాంతి రేసులో గెలిచేదేవరు?

సమంత నిజంగానే తల్లి కాబోతుందా? ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్‌ పిక్స్ వెనుక మిస్టరీ !

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న “హ్రీం” మూవీ టీజర్.. గ్రాండ్‌గా లాంఛ్ చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి!

గుడ్‌బై చెప్పేసిన టాలీవుడ్ బ్యూటీ… అసలు కారణం ఇదేనా!

ఫస్ట్ టైమ్.. క్లింకార ఫేస్ రివీల్ చేసిన చెర్రీ, ఉపాసన.. ఎంత ముద్దుగా ఉందో!

స్టార్ ప్రొడ్యూసర్ రూ. 1.35 కోట్ల నగలు మాయం.. లగ్జరీ ఫ్యాషన్ జర్నీలో ఊహించని ట్విస్ట్!

Big Stories

×