E-Paper
Advertisement

జియో, ఎయిర్‌టెల్, BSNL.. రూ.200లోపు బెస్ట్ ప్లాన్స్ ఇవే.. బోలెడన్ని లాభాలు భయ్యా!

జియో, ఎయిర్‌టెల్, BSNL.. రూ.200లోపు బెస్ట్ ప్లాన్స్ ఇవే.. బోలెడన్ని లాభాలు భయ్యా!
Advertisement

Recharge Plans: ప్రస్తుతం మెుబైల్ రీఛార్జ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ బడ్జెట్ లో కాస్త పర్వాలేదనిపించినా.. జియో, ఎయిర్ టెల్ ప్రీమియం ప్రయోజనాల పేరుతో భారీగా వసూలు చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ సంస్థలు.. రూ.200 కంటే తక్కువ ధరలో అందిస్తున్న ప్రధానమైన ప్లాన్స్ గురించి ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

రిలయన్స్ జియో

జియో తన కస్టమర్ల కోసం రూ.200లోపు బడ్జెట్ లో 2 అద్భుతమైన ప్లాన్స్ తీసుకొచ్చింది. అందులో రూ.189 ప్లాన్ ఒకటి కాగా, రూ.198 ప్లాన్ మరొకటి. రూ.189 ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే.. ఇది 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంది. ప్లాన్ కాలానికి 2GB డేటా, అపరిమిత కాల్స్, 300 SMSలు యూజర్ కు లభిస్తాయి. మరోవైపు రూ.98 ప్లాన్.. 14 రోజులు వ్యాలిడిటీతో వచ్చింది. ఇది ప్రతిరోజూ 2GB హై స్పీడ్ డేటాను అందిస్తుంది. ఇది కాకుండా రూ.123 ప్లాన్, రూ.152 ప్లాన్స్ ను సైతం జియో ఆఫర్ చేస్తోంది.

భారతీ ఎయిర్ టెల్

Advertisement

ఎయిర్‌టెల్ కూడా తక్కువ ధరకు కొన్ని ప్లాన్‌లను అందిస్తోంది. ముఖ్యంగా 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చిన 199 ప్లాన్.. యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMSలు (మొత్తం వాలిడిటీకి) లభిస్తాయి. ఒకవేళ మీకు కేవలం డేటా మాత్రమే కావాలంటే రూ.100 కంటే తక్కువ ధరకు అనేక డేటా వోచర్లను ఎయిర్ టెల్ అందిస్తోంది.

Also Read: ఓరి దేవుడా.. మే నెలలో ఇన్ని అద్భుతమైన ఫోన్లు రాబోతున్నాయా? మెుబైల్ ప్రియులకు పండుగే!

బీఎస్ఎన్ఎల్ (BSNL)

Advertisement

ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్.. ప్రైవేటు సంస్థల కంటే తక్కువ ధరకే ఎక్కువ వాలిడిటీని ఇస్తోంది. రూ.107 ప్లాన్ తీసుకుంటే ఇది తక్కువ ధరలో లభించే బెస్ట్ ప్లాన్. 35 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ కింద 3GB డేటా, 200 నిమిషాల ఉచిత కాల్స్ లభిస్తాయి. రూ. 153 ప్లాన్ తీసుకుంటే ఇది 26 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో ప్రతిరోజూ 1GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు పొందవచ్చు. ఇక రూ.199 ప్లాన్ పరిశీలిస్తే.. ఇది 28 రోజుల పాటు ప్రతీ రోజూ 2GB డేటా, అపరిమిత కాల్స్, ఉచిత ఎస్ఎంఎస్ లను ఆఫర్ చేస్తుంది.

Also Read: ఇన్వర్టర్‌ బ్యాటరీలో ఎలా పడితే అలా నీరు పోస్తున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×