 
					Hollywood Movie : అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో చెప్పలేము.. మన టైం బాగుంటే యెల్లలు దాటి ప్రతిభను కనబరిచే అవకాశం రావొచ్చు.. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అనే సందేహం రావచ్చు.. అందుకు ఒక కారణం ఉంది. ఎక్కడో భద్రాచలంలో పుట్టి పెరిగిన ఓ తెలుగు యువకుడు హాలీవుడ్ లోకి దర్శకుడుగా అడుగుపెట్టాడు.. ఇది తెలుగు ప్రజలంతా గర్వించదగ్గ విషయం.. తన ప్రతిభతో తెలంగాణ యువకుడు దేశాలను దాటి సత్తాను చూపించాడు. ఆ యువ డైరెక్టర్ పేరు వివేకానంద కొండపల్లి. ‘ద లాస్ట్ విజిల్’ మూవీతో దర్శకుడుగా ఆరంగ్రేటం చేశాడు. యూట్యూబ్‌లో విడుదలైన ట్రైలర్ రెండు రోజుల్లోనే మూడు లక్షలకుపైగా వ్యూస్ సాధించింది. ఈ సినిమా షూటింగ్ని పూర్తిచేసుకుని డిసెంబర్లో థియేటర్లలోకి రాబోతుంది.. ఇంతటి ఘనత సాధించిన ఈ కుర్రాడి బ్యాగ్రౌండ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్రం భద్రాచలంకు చెందిన యువకుడు వివేకానంద.. మహేష్, జమునారాణి దంపతుల పెద్ద కుమారుడు వివేకానంద, ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం భార్య, పిల్లలతో న్యూయార్క్‌లో నివసిస్తున్నాడు.. మహేష్ తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందాడు. అంతేకాదు ఆయన ఒక గాయకుడు కూడా.. తన తండ్రి పాటలు, కథలతో పెరిగినట్లు వివేకానంద తెలిపారు. తన సృజనాత్మక దృక్పథానికి నాన్న కారణమని వివేకానంద పలు ఇంటర్వ్యూలలో బయట పెట్టారు.. అలా తనలోని ఆశతోనే షార్ట్ ఫిలిం లకు ముందుగా దర్శకత్వం వహించారు.. అవి మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఆ తర్వాత తన టాలెంట్ తో మూవీ డైరెక్టర్ గా ఛాన్స్ కొట్టేశాడు..
Also Read : రాజమౌళితో, శేఖర్ మధ్య గొడవలు? అసలు మ్యాటర్ ఇదా..?
తెలంగాణ యువకుడు వివేకానంద కు డైరెక్టర్ అవ్వాలని కోరిక ఉండేదట. తన తండ్రి సపోర్టుతో షార్ట్ ఫిలింలకు ముందుగా డైరెక్టర్ గా పని చేశారు.. రెండు హాలీవుడ్ షార్ట్ ఫిల్మ్‌లకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.. ఇప్పుడు ఏకంగా మూవీకి డైరెక్టర్ గా మారాడు.. ప్రస్తుతం ఈయన ది లాస్ట్ విజిల్ సినిమాకు దర్శకత్వం వహించారు.. 90 నిముషాల నిడివి గల ఈ మూవీకి 1.3 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. మన ఇండియన్ కరెన్సీ లో 11 కోట్ల 45 లక్షలు అన్నమాట.. ఇకపోతే క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 300 థియేటర్ల లో ఈ చిత్రం విడుదల కానుంది. వివేకానంద ప్రస్తుతం మరో హాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు చర్చలు జరుపుతున్నారు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత తెలుగులో సినిమాకి దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. తెలుగు యువకుడు హాలీవుడ్ లో సత్తాను చాటి మనం దేశ గౌరవాన్ని పెంచాడని ఆయన పై తెలుగు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ప్రస్తుతం ఆయన పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది..