 
					Chatrapathi Shekar : తెలుగు ప్రజలకు చత్రపతి శేఖర్ పేరు తెలిసే ఉంటుంది.. చత్రపతి సినిమా ద్వారా బాగా పాపులర్ అయిన ఈ నటుడు ఆ సినిమా పేరుని తన పేరులో చేర్చుకున్నారు.. ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. విలన్ గా మాత్రమే కాదు ఏడిపించే సీన్లలో కూడా ఈయన అద్భుతంగా నటించారు. అయితే ఈమధ్య ఎక్కువగా సినిమాలు చేయలేదు కానీ.. పలు యూట్యూబ్ ఛానల్ కి టీవీ చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే రాజమౌళితో గొడవలు ఏమైనా ఉన్నాయా అన్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారో ఒకసారి తెలుసుకుందాం..
నటుడు శేఖర్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో ఆయన చేసిన సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా బోయపాటి శ్రీను, రాజమౌళి తో చేసిన సినిమాల గురించి ఎన్నో విషయాలను బయటపెట్టారు. అయితే మీరు సినిమాలు కావాలని డైరెక్టర్లకు ఫోన్లు చేసి అడుగుతారని యాంకర్ ప్రశ్నించగా.. నేను ఎవరిని ఏది అడగను. ఈ క్యారెక్టర్ ఉంది చేయాలి రమ్మని పిలిస్తే వస్తాను. అది సినిమా మొత్తం అయినా సరే నాలుగు సీన్లు అయినా సరే. అంతేగాని నేను పలాన డైరెక్టర్ కి ఫోన్ చేసి మీ సినిమాలో ఒక క్యారెక్టర్ ఇవ్వండి అని ఎప్పుడూ అడగలేదు అని శేఖర్ అన్నారు.
అదేవిధంగా రాజమౌళి సినిమాలలో మీరు నటించారు. మీరు ఎప్పుడైనా ఆయనకు కాల్ చేసి నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వండి అని అడిగారా లేకపోతే ఆయనే మిమ్మల్ని తీసుకువచ్చి సినిమాలలో పెడుతున్నారా అని యాంకర్ అడిగారు. నిజం చెప్పాలంటే ఆయన సినిమాలన్నిటిలో నేను చాలా వరకు నటించాను. అయితే నేను ఎప్పుడూ ఆయనకి ఫోన్ చేయలేదు. రాజమౌళి గారి నెంబర్ కూడా నా దగ్గర లేదు. నేను ఎప్పుడూ ఆయనతో గొడవ పడలేదు ఎప్పుడు అంత క్లోజ్ గా మాట్లాడలేదు కూడాను అని శేఖర్ అన్నారు. తన సినిమాల్లో ఒక క్యారెక్టర్ కి నేను చేస్తే బాగుంటుంది అని అనుకొని నాకు ఫోన్ చేసి పిలుస్తారు అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Also Read :ఎట్టకేలకు చిరంజీవి డీప్‌ఫేక్ వీడియోలు డిలీట్.. ఆ ఖాతాలు బ్లాక్..
టాలీవుడ్ నటుడు చత్రపతి శేఖర్ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో బ్లాక్ మాస్టర్ హిట్ చిత్రాలలో నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన పర్సనల్ లైఫ్ విషయానికోస్తే.. భార్యతో విడాకులు తీసుకున్నాడు అంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. ప్రస్తుతమైన భార్యతో కలిసి ఉన్నాడా లేదా విడిగా ఉన్నాడా అన్న విషయం గురించి తెలియలేదు. శేఖర్ నటించిన సినిమాలలో ఎక్కువగా రాజమౌళి తెరికెక్కించిన సినిమాలే ఉండటం విశేషం.. ఇప్పటివరకు ఆయన 50 కి పైగా సినిమాలు చేశారు. అంతేకాదు వెబ్ సిరీస్ లలో కూడా నటించారు. ఇటీవల బుల్లితెర పై అడుగుపెట్టి పలు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.