E-Paper
Advertisement

Summer Re Release Movie: సమ్మర్ స్పెషల్ రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న స్టార్ హీరోల సినిమాలు.. లిస్ట్ వైరల్!

Summer Re Release Movie: సమ్మర్ స్పెషల్ రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న స్టార్ హీరోల సినిమాలు.. లిస్ట్ వైరల్!
Advertisement

Summer Re Release Movie:గత కొన్ని రోజులుగా రీ రిలీజ్ చిత్రాల హవా ఎక్కువగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమాన హీరోల కొత్త సినిమాలు లేనప్పుడు లేదా ఆయా హీరోల జీవితంలో ముఖ్యమైన రోజులలో ఆయా హీరోల కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ థియేటర్లలో అభిమానులు సందడి చేస్తున్నారు.. అంతేకాదు ఆ సినిమాలలోని సన్నివేశాలను మళ్లీ రీ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఒకవైపు సమ్మర్ రానే వచ్చేసింది. అందులో భాగంగానే ఒకవైపు కొత్త సినిమాలతో పాటు మరొకవైపు రీ రిలీజ్ చిత్రాలు కూడా సందడి చేయడానికి సిద్ధం అయిపోయాయి. ఈ మండే ఎండలో ఆడియన్స్ ను చిల్ చేయడానికి స్టార్ హీరోల కెరియర్లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన చిత్రాలు ఇప్పుడు మళ్లీ విడుదల అవడానికి సిద్ధమవుతున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న సినిమాలు..

ఇక అందులో భాగంగానే ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టిన రోజు సందర్భంగా ‘రేసుగుర్రం’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే ఏప్రిల్ 23వ తేదీన ప్రభాస్, కాజల్ కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘డార్లింగ్’ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే 20వ తేదీన ‘ఊసరవెల్లి’, ‘ఆంధ్రావాలా’ చిత్రాలను రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. అలాగే ఆగస్టులో మహేష్ బాబు పుట్టినరోజు ఉండగా ఆయన పుట్టినరోజు వేడుకలు వారం ముందే మొదలుకానున్నాయి. అందులో భాగంగానే మే 29వ తేదీన మహేష్ బాబు ‘అతిధి’ సినిమా రిలీజ్ అవుతుండగా అలాగే ఆగస్టులో ‘పోకిరి’ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఏది ఏమైనా ఈ చిత్రాలు సమ్మర్ స్పెషల్ గా విడుదలవుతూ అభిమానులకు మంచి వినోదాన్ని పంచడానికి సిద్ధం అయిపోయాయి. మళ్ళీ రీ రిలీజ్ లో ఈ చిత్రాలన్నీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తావే చూడాలి.

Advertisement

ALSO READ:Monalisa: అక్క పెళ్లిపై సంచలన విషయాలు బయటపెట్టిన మోనాలిసా చెల్లెలు?

పాన్ వరల్డ్ టార్గెట్..

ఇకపోతే ఈ రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న చిత్రాల హీరోల విషయానికే వస్తే.. అటు జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు అల్లు అర్జున్ – అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాతో పాన్ వరల్డ్ టార్గెట్ ఆయన దృష్టిలో పెట్టుకోవడం.. అలాగే మరొకవైపు ప్రభాస్.. ప్రస్తుతం ఈయన ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక మిగిలింది మహేష్ బాబు.. ఈయన ఏకంగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ వారణాసిలో నటిస్తున్నారు. ఇక ఈ హీరోలందరూ కూడా ఇలా పాన్ ఇండియా కాదు కాదు పాన్ వరల్డ్ టార్గెట్గా చేసుకొని సినిమాలు చేస్తుంటే మరొకవైపు ఆయన అభిమానులు వీరి కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలను మళ్లీ రిలీజ్ చేసి థియేటర్లలో సందడి చేస్తున్నారు.

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×