E-Paper
Advertisement

Strange Rules: మురికి కార్లు రోడ్డు మీదికి వస్తే ఫైన్, ఇదెక్కడి వింత రూల్ అండీ బాబూ!

Strange Rules: మురికి కార్లు రోడ్డు మీదికి వస్తే ఫైన్, ఇదెక్కడి వింత రూల్ అండీ బాబూ!
Advertisement

Dubai Rules: దుబాయ్ మోడ్రన్ కంట్రీగా ఎదుగుతున్నా, నిబంధనల విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. దుబాయ్ లో ప్రస్తుతం అమల్లో ఉన్న కీలక నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీరు దుబాయ్ కి వెళ్తే ఈ పనులు అస్సలు చేయకూడదు. కాదంటే, కటకటాల్లోకి వెళ్లకతప్పదు.

దుబాయ్ లో చేయకూడని పనులు

⦿ పబ్లిక్ గా ప్రేమాయణం వద్దు: బహిరంగంగా ప్రేమించుకోవడం దుబాయ్ లో నేరం. చేతులు పట్టుకోవడం, బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం, హగ్గులు చేసుకోవడం చట్టవిరుద్ధం. ఇలా చేస్తూ పట్టుబడితే జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

Advertisement

⦿ అబద్ధం చెప్పొద్దు, తిట్లు తీడకూడదు: బహిరంగంగా లేదంటే ఆన్‌ లైన్‌ లో అసభ్యమైన భాష, భయపెట్టే వ్యాఖ్యలు చేయడం సీరియస్ గా వ్యవహరిస్తారు. ఇలాంటి పనులు చేస్తే జరిమానా లేదంటే జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు దేశ బహిష్కరణ కూడా విధించే అవకాశం ఉంటుంది.

⦿ రంజాన్‌ మాసంలో బహిరంగంగా తినకూడదు: ఉపవాస సమయంలో బహిరంగంగా తినడం, తాగడం, ధూమపానం చేయడం నిషిద్ధం. నిబంధలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.

Advertisement

⦿ కార్లు పరిశుభ్రంగా ఉండాలి: మురికిగా ఉన్న కార్లను రోడ్డు మీదికి తీసుకురాకూడదు. దుమ్ముతో నిండిపోయిన కారు రోడ్డు మీదకి వస్త జరిమానాలు పడే అవకాశం ఉంటుంది. అపరిశుభ్రమైన కార్లు నగర పరిశుభ్రతను ప్రభావితం చేస్తాయి కాబట్టి, ఈ నిర్ణయం తీసుకున్నారు.

⦿ మత్తుపదార్థాలు తీసుకోకూడదు: దుబాయ్ లో మత్తుపదార్థాలను కలిగి ఉండటం, వాడటం తీవ్ర నేరం. జైలు శిక్ష విధిస్తారు.

⦿ అసభ్యంగా సైగలు చేయడం: దుబాయ్ లో అసభ్యంగా సైగలు చేయడం నేరం. మధ్య వేలు చూపించడం, అవమానకరమైన హావభావాలు నేరంగా పరిగణిస్తారు. కఠిన శిక్షలు విధిస్తారు.

⦿ బహిరంగంగా మద్యం సేవించకూడదు: దుబాయ్ లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం. ఇలా చేస్తే అరెస్ట్ చేయడంతో పాటు జరిమానాలు విధిస్తారు. కొన్నిసార్లు దేశ బహిష్కరణ కూడా విధిస్తారు.

⦿ అనుమతి లేకుండా ఫోటోలు తీయరాదు: ప్రజలను, ముఖ్యంగా మహిళలను, ప్రభుత్వ ప్రాంగణాలను అనుమతి లేకుండా ఫోటోలు తీయడం చట్టవిరుద్ధం. కఠిన శిక్షలు విధించే అవకాశం ఉంటుంది.

⦿ పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడం: పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడం కూడా నిషేధం. గతంలో కఠినంగా వ్యవహరించే వారు. ఇప్పుడు కొంచెం సడలించారు. సాంస్కృతిక, చట్టపరంగా ఇంకా సున్నితమైన విషయంగా పరిగణిస్తారు.

⦿ మతం, సంస్కృతిని అగౌరవ పరచకూడదు: మతం, సంప్రదాయాలు గౌరవించాలి. వీటి గురించి కించపరిచేలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటారు.

Read Also: యుద్ధ సమయంలో సంపన్నులు తలదాచుకొనే దేశాలివే.. ఈ ప్రాంతాలు అంత సేఫా?

Related News

టోకెన్ ఉన్నా లేకపోయినా రూ. 10 లక్షల ఇన్సూరెన్స్.. టీటీడీ సంచలన నిర్ణయం!

మళ్లీ పట్టాలెక్కనున్న భారత్-బంగ్లాదేశ్ రైళ్లు.. 2 ఏళ్ల తర్వాత ఇరు దేశాల కీలక నిర్ణయం!

నల్లగొండలో హైటెక్ బస్టాండ్.. ఏకంగా రూ. 54 కోట్లతో నిర్మాణం!

హోస్టెస్, వైఫై, టాయిలెట్.. ఈ ఆర్టీసీ బస్సును చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

బెంగళూరు–విజయవాడ ప్రయాణానికి కొత్త దారి.. ఏకంగా 110 కి.మీ తగ్గనున్న దూరం!

మగ జీవులను నీచంగా చూసే.. భయంకరమైన ఆడ జంతువులు.. ఇవి చాలా డేంజర్ భయ్యా!

ఇండియన్ బుల్లెట్ రైల్ రెడీ.. ఇక పట్టాలు ఎక్కుడే తరువాయి..

భూగర్భంలో వింత నగరం.. ఏకంగా 20 వేల మంది హ్యాపీగా ఉండొచ్చు.. ఇంతకి ఎక్కడుందో తెలుసా?

Big Stories

Advertisement
×