BigTV English

Star Actress : మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ హీరోయిన్ కన్నుమూత..

Star Actress :  మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ హీరోయిన్ కన్నుమూత..

Bollywood : బాలీవుడ్ ఇండస్ట్రీకి దిష్టి తగిలిందేమో.. లేకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతుంది.. ఒకటి, రెండు రోజుల గ్యాప్ తో ఒక్కొక్కరు మరణిస్తున్నారు.. కారణాలు ఏవైన కానీ ఇలా వరసగా చనిపోతున్నారని బాలీవుడ్ ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే చాలా మరణించారు. ఒక ఘటన మరువక ముందే మరోఘటన జరుగుతుంది.. తాజాగా మరొకరు మృత్యువు ఒడిలోకి చేరారు. బాలీవుడ్ ప్రముఖ నటి, మోడల్ షేపాలీ జరీవాలా కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె తుది శ్వాస విడిచారు. కాంటాలాగా వంటి మ్యూజిక్ వీడియోలతో బాగా పాపులర్ అయ్యారు.. నటిగా బాలీవుడ్ లో వరుస సీరియల్స్ లలో నటించింది. అలాగే బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ లో సందడి చేసింది. ఆమె మరణ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. పలువురు ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. ఈమె అంత్యక్రియలు నేడు ముంబైలో ఘనంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలో పెద్దలు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.


‘కాంటాలాగా ‘ ఫేమ్ నటి షేఫాలీ మృతి..

బాలీవుడ్ లో కొందరు నటీనటులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులో కొందరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి వారిలో మోడల్, నటి షేపాలీ జరీవాలా ఒకరు. ‘కాంటా లగా’ సాంగ్‌ ఫేమ్‌, నటి షఫాలీ జరివాలా గుండె పోటుతో మరణించారు. శుక్రవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురికావడంతో వెంటనే భర్త పరాగ్‌ త్యాగి అంధేరిలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని కూపర్‌ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అయితే ఆమె మరణించిన విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే ఆమె సన్నిహిత వర్గాల్లో ఈ వార్త తెలిసి ఆమెను చూడటానికి ఇంటికి చేరుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read: శనివారం టీవీల్లో వచ్చే సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

ఆమె కెరీర్ విషయానికొస్తే.. 

మోడల్ గా, నటిగా సక్సెస్ అయ్యింది. 2005లో వచ్చిన ‘కాంటా లగా’ రిమిక్స్ సాంగ్‌తో కుర్రకారు మదిని దోచిన ఆమె ఒక్కసారి ఫేమస్‌ అయ్యారు. దీంతో అంతా ‘కాంటా లాగా గర్ల్‌’గా పిలవడం ప్రారంభించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఆమె నటించింది. ముజ్సే షాదీ కరోగా చిత్రంలో ఆమె ఓ పాత్ర దక్కించుకున్నారు. అనంతరం షఫాలీ పలు టీవీ రియాలిటీ షోలలో మెరిశారు. హిందీ బిగ్‌బాస్‌ 13లోకి సైతం ఎంట్రీ ఇచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫోటోలను, పర్సనల్ విషయాలను షేర్ చేస్తుంది. అకస్మాత్తుగా మృతిచెందారని తెలియడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెకు ఇన్‌స్టాలో 33 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆమె మృతిపై సింగర్‌ మికా సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ప్రస్తుతం ఆమె భౌతికాయానికి పలువురు నివాళులు అర్పిస్తున్నారు.

Related News

Manchu Manoj: మనోజ్ ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు.. చాలా రోజులైంది భయ్యా ఇలా చూసి!

Actress Girija: గుర్తుపట్టలేని స్థితిలో నాగార్జున హీరోయిన్… ఇలా తయారయ్యింది ఏంటీ?

Lokesh Kanagraj: తెలుగులో రికార్డు సృష్టించిన లోకేష్ కనగరాజ్ .. మొదటి సినిమాగా కూలీ!

Kangana Ranaut: సహజీవనంపై కంగనా హాట్ కామెంట్స్.. గర్భం వస్తే ఎవరిది బాధ్యత?

Tollywood Producer: ఒకేసారి 15 సినిమాలకు కమిట్ అయిన నిర్మాత.. రికార్డుల కోసం రిస్క్ అవసరమా?

Ram Gopal Varma: నాన్న జన్మనిస్తే.. నాగార్జున రెండో జీవితాన్ని ఇచ్చారు.. వర్మ ఎమోషనల్ !

Big Stories

×