BigTV English

OTT Movie : దేవుడితో ఆ కోరికలతో రగిలిపోయే రాణి పాడు పనులు… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : దేవుడితో ఆ కోరికలతో రగిలిపోయే రాణి పాడు పనులు… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : మలయాళం సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త కొత్త స్టోరీలను తెరమీదకెక్కిస్తున్నారు. ఈ సినిమాలు ప్రేక్షకులకు కొత్త అనుభవాలను అందిస్తోంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం సినిమా,టెక్నికల్ , విజువల్స్, బీజీఎం అంశాల పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా ఒక రియాలిటీ షో లో, హఠాత్తుగా చనిపోయిన వ్యక్తుల ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

ఈ మలయాళ సూపర్‌నాచురల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వడక్కన్’ (Vadakkan). 2025 లో వచ్చిన ఈ సినిమాకి సజీద్ A దర్శకత్వం వహించారు. ఇందులో కిషోర్, శ్రుతి మీనన్, మెరిన్ ఫిలిప్, గ్రీష్మా అలెక్స్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాని ఆఫ్‌బీట్ స్టూడియోస్ బ్యానర్‌లో జయదీప్ సింగ్, భవ్య నిధి శర్మ నిర్మించారు. ఇది 2025 మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. మే 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ డబ్బింగ్‌లలో అందుబాటులో ఉంది. 1 గంట 52 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 7.3/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ రామ్ అనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ చుట్టూ తిరుగుతుంది. అతను కేరళకి సమీపంలో ఉన్న ఒక ద్వీపంలో ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళతాడు. అక్కడ ఒక రియాలిటీ టీవీ షో షూటింగ్ సమయంలో, కొంతమంది అనుమానస్పదంగా చనిపోయి ఉంటారు. ఈ షోలో అతని మాజీ ప్రియురాలు మేఘ భర్త కూడా ఉంటాడు.  ఆమె రామ్ కి ఫోన్ చేసి, తన భర్త ‘రవివర్మతో’ పాటు ఓ ఆరుగురు ఫ్రెండ్స్ ఓ రియాలిటీ షో కోసం ఐలాండ్ కి వెళ్లారనీ, అక్కడి నుంచి వాళ్లెవరూ తిరిగి రాలేదని చెబుతుంది. ఈ విషయంలో తనకి హెల్ప్ చేయమని కోరుతుంది. రామ్ ఆ ఐలాండ్ గురించి ఒక షాకింగ్ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ ద్వీపంలోకి అడుగుపెట్టినవాళ్ళు ఇంతవరకూ తిరిగిరాలేదని తెలుసుకుంటాడు. 400 వందల సంవత్సరాల క్రితం అక్కడ ఒక సంఘటన జరిగిందని తెలుస్తుంది. అదే ప్రాంతంలో ఆంగ్లేయులు నిర్మించిన ఆ బంగాళా ఉండేదని, వాళ్ళు కూడా ఆప్రాంతాన్ని విడిచి వెళ్లారని తెలుసుకుంటాడు. ఇది ఒక పురాతన ద్రావిడ కల్ట్ ఆచారంతో ముడిపడిన, ఒక భయంకరమైన శక్తి నివాసమని తెలుస్తుంది.

ఇక్కడ రియాలిటీ షో షూటింగ్‌ సమయంలో,ఒక బృందం ద్వీపంలో ఒక పురాతన ఆలయం, థెయ్యం ఆచారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఊహించని విధంగా అక్కడ ఉన్నవాళ్ళు చనిపోతారు. పారానార్మల్ లో అనుభవం ఉన్న రామ్ ఇన్వెస్టిగేటర్‌గా, ఈ సంఘటనలు ఎలా జరిగాయి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ త్వరలోనే అతను ఒక అతీంద్రియ శక్తిని ఎదుర్కోవలసి వస్తుందని తెలుసుకుంటాడు. ఇక రామ్ ద్వీపంలోని ద్రావిడ కల్ట్ చరిత్రని తెలుసుకున్నప్పుడు, ఫ్యూజులు అవుట్ అయ్యే విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇది కుంజంబు అనే తక్కువ కుల వ్యక్తి, ముఖిల్ అనే ఉన్నత కుల మహిళ మధ్య సంబంధంతో ముడిపడి ఉంటుంది. ఇది స్టోరీని మరో లెవెల్ కి తీసుకెళ్తుంది. చివరికి కుంజంబు, ముఖిల్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? ఈ హత్యలకు, వీళ్ళకు ఉన్న లింక్ ఏంటి ? రామ్ ఈ శక్తిని ఎలా ఎదుర్కుంటాడు ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : ఓటీటీలో దుమ్మురేపుతున్న బాలయ్య హీరోయిన్ మూవీ… ఆ సీన్స్ అయితే అరాచకం మావా

Related News

OTT Movie : పెళ్ళైన నెలకే భర్త మృతి… అర్ధరాత్రి అలాంటి అమ్మాయి ఇంటికి అనామకుడు… ఫీల్ గుడ్ తమిళ మూవీ

OTT Movie : కోర్టులో కచేరి… ఓటీటీలో ట్రెండ్ అవుతున్న కోర్టు రూమ్ డ్రామా… ఇంకా చూడలేదా?

OTT Movie : ఆ సౌండ్స్ వింటే ఈ దెయ్యానికి పూనకాలే… అమ్మాయి వెంటపడి అరాచకం… కల్లోనూ వెంటాడే హర్రర్ సీన్స్

OTT Movie : కళ్ళకు గంతలు… అతని కన్ను పడితే అంతే సంగతులు… క్రేజీ కొరియన్ క్రైమ్ డ్రామా

F1 OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన క్రేజీ రేసింగ్ మూవీ F1.. ఎప్పుడు?ఎక్కడంటే?

OTT Movie : ఇంటి ఓనర్లే ఈ కిల్లర్ టార్గెట్… వీడి చేతికి చిక్కారో నరకమే… క్రేజీ మలయాళ సైకో థ్రిల్లర్

Big Stories

×