BigTV English

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి చుక్కలు చూపిస్తున్న ప్రభావతి..బాలుని ఇరికించేందుకు శోభన ప్లాన్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి చుక్కలు చూపిస్తున్న ప్రభావతి..బాలుని ఇరికించేందుకు శోభన ప్లాన్..

Gundeninda GudiGantalu Today episode june 28th: నిన్నటి ఎపిసోడ్ లో..  ఫంక్షన్ కు టైం అవుతుంది. అందరు ఇంకా రెడీ అవ్వలేదా అని అందరినీ హడావిడి చేస్తుంది. బాలు మీనా కోసం కొత్త చీర తీసుకొచ్చి ఇస్తాడు. ఆ చీరను కట్టుకొని మీనా కిందకి రావడం చూసి మైమరిసిపోతాడు. ప్రభావతి చూసింది చాలు ఫంక్షన్ కి టైం అవుతుంది వెళ్దాం పదండి అని అందరూ ఫంక్షన్ హాల్ కి వెళ్తారు. వీళ్ళని చూసిన సురేంద్ర, శోభన పలకరిస్తారు. సురేంద్ర మాత్రం సత్యం పై కోపంతోనే ఉంటాడు. శోభనం మాట ప్రకారం సత్యం ను బావగారు అని పిలుస్తాడు. అటు రోహిణిని అందరూ టార్గెట్ చేస్తారు. మీ నాన్న ఎప్పుడు వస్తారు అని అడగగానే రోహిణి ఫంక్షన్ హాల్ చూద్దాం వెళ్దాం పద అని లోపలికి వెళ్ళిపోతారు. శృతి వాళ్ళ నాన్నతో సంతోషంగా మాట్లాడుతుంది. అందరూ కలిసి సంతోషంగా ఫంక్షన్ హాల్ లోకి వెళ్లి పోతారు.


చివరగా బాలు మౌనంగానే లోపలికి వెళ్ళిపోతాడు. ఈ బాలు గాడి వల్లే మన అమ్మాయి అల్లుడు మన ఇంటికి వచ్చేస్తారు అని శోభన సురేందర్ తో అంటుంది. ఏం చేస్తావో నాకు తెలియదు మన అమ్మాయి మన ఇంట్లోనే ఉండాలి అని సురేంద్ర కూడా అంటాడు. ఇక లోపలికి వెళ్ళగానే ఫంక్షన్ హాల్ చాలా బాగుంది అని రోహిణి అంటుంది. రోహిణి సేఫ్ అయ్యేందుకు బాలును ఇరికించాలని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి ఫంక్షన్ హడావిడిలో ఉంటుంది. అందరూ రెడీ అవుతున్నారు రోహిణికి చీర ఇద్దామని అక్కడికి వెళుతుంది. రోహిణి విజ్జి మాట్లాడుకుంటూ ఉంటారు. మా అత్తయ్య ఈమధ్య నా మీద ప్రేమను పూర్తిగా తగ్గించేసింది. మా నాన్నని తీసుకురావాలని తెగేసి చెప్పేసింది అని అంటుంది.. అప్పుడే ప్రభావతి డోర్ కొడుతుంది.. అత్తగారింటి తరపున నీకు పెట్టాల్సిన చీరను తీసుకొచ్చాను. ఇదిగో తీసుకొని రోహిణి చేతికి ఇస్తుంది.. రోహిణి ఆ చీర తీసుకోగానే మీ నాన్న ఎక్కడ వరకు వచ్చాడు. అసలు వస్తున్నాడా లేదా అప్పుడెప్పుడో ఫ్లైట్ ఎక్కాడు అని అడిగావు కదా వెంటనే నువ్వు ఫోన్ చేసి అడుగు ఎక్కడున్నాడు అని అంటుంది.


రోహిణి ఫ్లైట్లో ఉన్నాడు అత్తయ్య ఫోన్ పనిచేయదు కదా నాట్ రిచబుల్ వస్తుంది.. వస్తుంటాడు అనేసి అంటుంది. ఎప్పుడు మీ నాన్నని అడిగినా అదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. పెళ్లి టైంలో అలానే వస్తున్నాడు అని చెప్పేసి అన్నావు. ఇప్పుడు వస్తున్నాడు అని అంటున్నావ్ తప్ప అసలు వస్తాడో రాడో తెలియట్లేదు. కూతురు కన్నా బిజినెస్ లు ఎక్కువ అనేసి ప్రభావతి అడుగుతుంది. పెళ్లెప్పుడు ఎలాగో రాలేదు కనీసం ఇది చాలా ముఖ్యమైన ఫంక్షన్ ఇప్పుడు రాకుండా ఉంటే నేనేం చేస్తానో నాకు తెలియదని ప్రభావతి అంటుంది.

ప్రభావతి ఏమంటే కామాక్షి కూడా అదే అంటుంది. ఇంత పెద్ద ఫంక్షన్ లో మీ నాన్న లేకుండా నీకు ఫంక్షన్ చేస్తే ఏం బాగుంటుంది. ఇంత సంపాదించాడు కదా మీ ఒక్కదానికోసమే కదా ఇప్పటికైనా కూతురు కూతురు కుటుంబం అని ఆయనకుండాలి కదా అని అంటుంది.. లేదంటే వస్తున్నాడు అనేసి అంటుంది. ఫంక్షన్కు టైం అవుతుంది నువ్వు వెంటనే రెడీ అవ్వమ్మ అని చెప్పేసి వెళ్ళిపోతారు.

సురేంద్ర సత్యం ను ఎలాగైనా అవమానించాలని అనుకుంటాడు. తన ఫ్రెండుని సత్యం పక్కన కూర్చోబెట్టి కాలు తగిలేలా చేస్తాడు. అది గమనించిన సత్యం సురేందర్ కావాలనే ఇదంతా చేస్తున్నాడు. ఆ బాలు ఎక్కడ చివర్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఇక్కడే కనుక ఉనింటే పెద్ద రచ్చ చేసేవాడు అని రంగాతో అంటాడు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇలా చేయడం ఏంట్రా అని రంగ కూడా అంటాడు. ఈ డబ్బున్నోళ్లంతా ఇంతే రా.. కుటుంబలు విలువలు కన్నా తమ పంతం తనదే.. పద మనం వెళ్లి వేరేచోట కూర్చుందామని అంటాడు.

రోహిణి విజ్జి ఇద్దరు కలిసి బాలు చేత తాగించి ఫంక్షన్ హాల్ లో గొడవ జరిగేలా చేయాలని అనుకుంటారు.. అందుకోసం ఒక మనిషిని మాట్లాడి విజ్జి ఫంక్షన్ హాల్ కి తీసుకొస్తుంది. అతన్ని బాలుని రెచ్చగొట్టి మందు తాగేలా చేయాలని అంటుంది. అటు శోభన కూడా ఈ ఫంక్షన్ లో బాలు ఉంచేత గొడవ చేయించాలని ప్లాన్ చేస్తుంది. ఓ ఇద్దరు మనుషుల్ని తీసుకొచ్చి బాలుని రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. బాలు మాత్రం నోరు తెరిస్తే గొడవలు అవుతాయని మౌనంగా చివర్లో కూర్చొని ఉంటాడు. రోహిణి మనిషి బాలు దగ్గరికి వెళ్లే లోపే శోభన మనుషులు బాలుని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు..అవే స్పెషల్…

Chhaava: సైలెంట్ గా టీవీల్లోకి రాబోతున్న రష్మిక ఛావా.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

Actress Harshitha: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బుల్లితెర నటి… బేబీ ఆన్ ద వే అంటూ!

Actress : ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత..

Intinti Ramayanam Today Episode: పార్వతి పై అక్షయ్ సీరియస్.. పల్లవికి మరో షాక్.. భరత్, ప్రణతి ల కొత్త కాపురం..

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించేసిన గుణ.. గుండెలు పగిలేలా ఏడ్చిన మీనా.. విడిపోతారా..?

Big Stories

×