BigTV English

Dheeraj Kumar: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

Dheeraj Kumar: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

Dheeraj Kumar: ఇటీవల కాలంలో ఇండస్ట్రీని వరుస మరణాలు కుదిపేస్తున్నాయి. ఒకరి మరణ వార్త మర్చిపోకముందే మరొకరు మరణించడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తాజాగా బాలీవుడ్ బెటర్ అండ్ యాక్టర్ టెలివిజన్ ప్రొడ్యూసర్ర ధీరజ్ కుమార్(Dheeraj Kumar)(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఈయన నిమోనియాతో బాధపడుతూ ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వెండి లెటర్ పై చికిత్స పొందుతున్నారు. ఈయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిన నేపథ్యంలో నేడు కన్నుమూశారు. ధీరజ్  మరణ వార్త తెలిసిన అభిమానులు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.ఇక ఈయన 1965 వ సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా పంజాబీ సినిమాలలో కూడా నటించి గుర్తింపు పొందారు. అలాగే టెలివిజన్ ప్రొడ్యూసర్ గా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు.


క్రియేటివ్ ఐ..

ఇక ధీరజ్ కుమార్ తన సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఎన్నో పురస్కారాలను కూడా సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలలో మాత్రమే కాకుండా ఈయన పంజాబీ సినిమాలలో కూడా నటించారు. దాదాపు 21 పంజాబీ సినిమాలలో నటించి గుర్తింపు పొందారు. ఇక నిర్మాతగా మారి “క్రియేటివ్ ఐ” అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాణ రంగంలో కూడా గుర్తింపు పొందారు. ముఖ్యంగా టెలివిజన్లో పౌరాణిక,భక్తి తరహా షోలను నిర్వహిస్తూ ఎంతో ఆదరణ పొందారు. ఆయన బ్యానర్ ఓం నమః శివాయ్, శ్రీ గణేష్, జై సంతోషి మా, మరియు జప్ తాప్ వ్రత్ వంటి వాటిని నిర్మించి మంచి సక్సెస్ అందుకున్నారు.


ధీరజ్ సినిమాలు..

ధీరజ్ కుమార్ నటించిన సినిమాల విషయానికి వస్తే..1970లో దీదార్ అనే సినిమాలో నటించిన ఈయన అనంతరం రాథోన్ కా రాజా, బిజులి, హీరా పన్నా, షరాఫత్ చోడ్ ది మై నేమ్, రంగా ఖుష్, స్వామి, షిరిడీకే సాయి బాబా వంటి పలు సినిమాలలో నటించి నటుడిగా కూడా గుర్తింపు పొందారు. ఇలా కొన్ని దశాబ్దాల సినీ కెరియర్లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ధీరజ్ కుమార్ నేడు అనారోగ్య సమస్యల కారణంగా మరణించారనే వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. ఈయన మరణ వార్త తెలుసుకున్న పలువురు తన చివరి చూపు కోసం తరలి వెళ్తున్నారు. అలాగే అభిమానులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఈయన మృతి పట్ల స్పందిస్తూ నివాళులు అర్పిస్తూ ఆయనతో వారికున్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో కంగారు వ్యక్తం చేస్తున్నారు.

Related News

OG Movie: ‘ఓజీ’ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. డీవీవీ ట్వీట్‌తో డిసప్పాయింట్‌ అవుతున్న అభిమానులు

Shruti Haasan: బ్లాక్ కలర్ సెంటిమెంట్ వెనక ఇంత కథ ఉందా?

Coolie War 2 films: అక్కడ రెడ్ అలెర్ట్… కూలీ, వార్ 2 సినిమాలకు భారీ నష్టం!

Film industry: ఇండస్ట్రీలో మరో విషాదం.. క్యాన్సర్ తో ప్రముఖ నటి మృతి!

Sridevi: శ్రీదేవి మరణించినా చెల్లి రాకపోవడానికి కారణం.. 2 దశాబ్దాల మౌనం వెనుక ఏం జరిగింది?

Sridevi Birth Anniversary: అతిలోక సుందరి శ్రీదేవి ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

Big Stories

×