BigTV English

KritiSanon: ప్రియుడుతో సెల్ఫీలకు ఫోజులు ఇచ్చిన ప్రభాస్ బ్యూటీ… రూమర్స్ నిజమేనా?

KritiSanon: ప్రియుడుతో సెల్ఫీలకు ఫోజులు ఇచ్చిన ప్రభాస్ బ్యూటీ… రూమర్స్ నిజమేనా?

Kriti Sanon: సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లు పట్ల ఎన్నో రకాల వార్తలో నిత్యం సోషల్ మీడియాలో వినపడుతూనే ఉంటాయి. ఒక హీరోయిన్ ఒక వ్యక్తితో కలిసి చాలా క్లోజ్ గా కనిపించారు అంటే  వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొస్తాయి.  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) ఇలాంటి వార్తలలో ఎన్నో సందర్భాలలో నిలిచారు. ముఖ్యంగా ఈమె ప్రభాస్(Prabhas) తో కలిసి నటిస్తున్న ఆది పురుష్ (Aadi Purush)సినిమా సమయంలోనే రిలేషన్ లో ఉన్నారని రహస్యంగా నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఇలాంటి వార్తలను ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు..


క్రికెట్ స్టేడియంలో జంటగా..

ఇకపోతే ఇటీవల కాలంలో మరోసారి ఇలాంటి వార్తలలో నిలుస్తున్నారు. కృతి సనన్ గత కొంతకాలంగా వ్యాపారవేత్త కబీర్ బహియా (Kabir Bahia)తో  రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కలిసి కనిపించడంతో డేటింగ్ రూమర్లకు మరింత బలం చేకూరాయి.జూలై 14, 2025న లండన్‌లోని ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా టీమ్ ఇండియాను ఉత్సాహపరుస్తూ వీరిద్దరూ కనిపించిన తర్వాత ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.


డేటింగ్ రూమర్ల పైకి మౌనం..

ఈ క్రమంలోనే గ్రౌండ్లో వీరిద్దరూ సెల్ఫీలకు ఫోజులు ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ సెల్ఫీ ఫోటో బయటకు రావడంతో వీరిద్దరూ కచ్చితంగా రిలేషన్ లో ఉన్నారని అభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు అయితే వీరిద్దరి రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్న ఇటు కృతి సనన్, కబీర్ బహియా ఇద్దరు ఈ వార్తల పట్ల ఏమాత్రం స్పందించలేదు. ఇక కృతి సనన్ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. కృతి చివరిసారిగా దో పట్టి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇటీవలే ధనుష్ సరసన తేరే ఇష్క్ మే సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

తెలుగులో తీవ్ర నిరాశ…

కృతి సనన్ కేవలం బాలీవుడ్ సినిమాలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా నటించారు. ఈమె తెలుగులో మహేష్ బాబుతో కలిసి 1 నేనొక్కడినే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అదేవిధంగా నాగచైతన్యతో కలిసి దోచేయ్ అనే సినిమాలో నటించారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా తెలుగులో ఈమెకు పెద్దగా గుర్తింపు తీసుకు రాకపోవడమే కాకుండా పూర్తిస్థాయిలో నిరాశ పరిచాయి. దీంతో కృతి సనన్ బాలీవుడ్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అయితే ఆది పురుష్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా కూడా నిరాశ కలిగించింది.

Also Read: Dheeraj Kumar: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×