Film Industry: సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో వరుస మరణాలు అభిమానులను ఎంతగానో ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో కోటా శ్రీనివాసరావు, సరోజా దేవి, ఫిష్ వెంకట్ వంటి తదితరులు వరుసగా మరణించడంతో అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీలో కూడా వరుసగా దర్శకులు ఇతర సెలబ్రిటీలు మరణిస్తున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. తాజాగా బాలీవుడ్ అగ్ర దర్శకుడు చంద్ర బరోట్ (86)(Chandra Barot) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో (Health Issues)బాధపడుతున్న ఈయన గత కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.
పల్మనరీ ఫైబ్రోసిస్…
చంద్ర బారోట్ గత కొద్దిరోజులతో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ముంబైలో బాంద్రాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈయన మరణించిన నేపథ్యంలో తన మరణ వార్తను చంద్ర బారోట్ భార్య దీప బారోట్ (Deepa Barot) తన భర్త మరణం గురించి అధికారకంగా తెలియజేశారు. “చంద్ర బారోట్ గత ఏడు సంవత్సరాలుగా పల్మనరీ ఫైబ్రోసిస్‌తో పోరాడుతున్నాడని వెల్లడించారు. ఇలా గత కొద్దిరోజులుగా చికిత్స తీసుకుంటున్న ఈయనకు ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా గుండెపోటు రావడంతోనేడు ఉదయం 6.30 గంటలకు గురునానక్ ఆసుపత్రిలో మరణించినట్లు” తెలిపారు.
డాన్ సినిమాతో గుర్తింపు…
ఈ విధంగా డైరెక్టర్ చంద్ర మరణ వార్త తెలుసుకున్న బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన మరణం పట్ల పోస్టులు పెడుతూ నివాళులు అర్పిస్తున్నారు. డాన్ మూడవ భాగానికి దర్శకత్వం వహిస్తున్న ఫర్హాన్ అక్తర్, ఇన్‌స్టాగ్రామ్‌లో చంద్ర బరోట్ మరణం గురించి స్పందిస్తూ… “OG డాన్ దర్శకుడు ఇక లేరని తెలిసి బాధపడ్డాను. RIP చంద్ర బరోట్-జీ. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి” తెలియజేశారు.చంద్ర బరోట్ అమితాబచ్చన్(Amitabh Bachchan) హీరోగా నటించిన డాన్ సినిమా(Don Movie) ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైన సినీ ప్రయాణం…
ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఇప్పటికీ డాన్ ప్రాంచైజీస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం డాన్ 3 సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు ఫరాన్ అక్బర్ దర్శకత్వం వహించగా కృతి సనన్, రణవీర్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
చంద్ర బరోడ్ కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా బెంగాలీ సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. అయితే ఈయన దర్శకత్వం వహించిన పలు సినిమాలు విడుదలకు నోచుకోలేదు. టాంజానియాకు చెందిన బరోట్ అక్కడ అల్లర్ల కారణంగా ఇండియాకి వచ్చి స్థిరపడ్డారు. ఇక ఇండియాలో స్థిరపడిన తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి అనంతరం దర్శకుడుగా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక నేడు ఈయన అనారోగ్య సమస్యలతో మరణించడంతో చిత్ర పరిశ్రమ నివాళులు అర్పిస్తోంది.
Also Read: Mahesh Babu: టీనేజ్ లోకి అడుగు పెట్టిన సితార.. స్పెషల్ విషెస్ చెప్పిన మహేష్ బాబు!