Anirudh Ravichandran: మామూలుగా పిట్ట కొంచెం కూత గానం అనే సామెతను వాడుతూ ఉంటారు. అయితే ఆ సామెత విన్నప్పుడు గుర్తొచ్చే కటౌట్ అనిరుద్. చూడటానికి చిన్న పిల్లాడులా కనిపించినా కూడా అతను చేసే మ్యూజిక్ సంచలనం. కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అద్భుతమైన ఎలివేషన్ ఇవ్వడం అతనికే సొంతం.
ధనుష్ నటించిన త్రీ సినిమాతో సంగీత దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనిరుద్. అనిరుద్ ఎంట్రీ ఇవ్వడానికంటే ముందు అనిరుద్ కంపోజ్ చేసిన “కొలవరి” పాట బీభత్సంగా పాపులర్ అయిపోయింది. కేవలం ఈ పాట కోసమే థియేటర్ కు వెళ్లిన ఆడియన్స్ కూడా ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు.
వాళ్లకు క్షమాపణలు
హుకుం అనే పేరుతో అనిరుధ్ కన్సర్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అది వాయిదా పడింది. అందువలన అభిమానులకు అనిరుద్ క్షమాపణలు తెలిపాడు. అధిక టిక్కెట్ల డిమాండ్ మరియు ప్రస్తుత వేదికలో ఎక్కువ మంది ప్రేక్షకులకు వసతి కల్పించడంలో పరిమితుల కారణంగా, జూలై 26న తిరువిదంతైలో జరగాల్సిన హుకుం చెన్నై కచేరీ వాయిదా వేయబడుతోంది. అభిమానులు అందరూ జాగ్రత్తగా వచ్చి వెళ్లడానికి వీలుగా, మేము కొత్త తేదీన వేరే వేదికకు మార్చుతున్నాము., ఇది త్వరలో అనౌన్స్ చేస్తాము. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా 7 నుంచి 10 రోజుల్లో రిటర్న్ మనీ వస్తుంది. అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నాము మరియు మీ వండర్ఫుల్ సపోర్ట్ కు థాంక్యూ. అంటూ ఈవెంట్ వాయిదా పడిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు అనిరుద్.
తెలుగులో కూడా క్రేజ్
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు అనిరుద్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. చాలామంది అనిరుద్ అప్పట్లో ట్రోల్ కూడా చేశారు. వాళ్లందరికీ జెర్సీ సినిమాతో అసలైన సమాధానం చెప్పాడు. ఇక ప్రస్తుతం గౌతమ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. ఈ సినిమా జులై 31న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో మంచి కం బ్యాక్ ఇస్తాడు అని చాలామంది నమ్ముతున్నారు. నిర్మాత నాగ వంశీ కూడా పలు సందర్భాల్లో ఈ సినిమా గురించి భారీ ఎలివేషన్ ఇచ్చారు.
Also Read : Ram Pothineni : మాస్ ట్విస్ట్, రామ్ పాటను రాయడానికి అసలైన కారణం ఇదే