BigTV English
Advertisement

Mahesh Babu: టీనేజ్ లోకి అడుగు పెట్టిన సితార.. స్పెషల్ విషెస్ చెప్పిన మహేష్ బాబు!

Mahesh Babu: టీనేజ్ లోకి అడుగు పెట్టిన సితార.. స్పెషల్ విషెస్ చెప్పిన మహేష్ బాబు!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన గారాలపట్టి సితార(Sitara) పుట్టినరోజు(Birthday) సందర్భంగా తనతో కలిసి దిగిన ఒక ఫోటోని షేర్ చేస్తూ తన కూతురికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సితారతో కలిసి దిగిన ఫోటోను మహేష్ బాబు షేర్ చేస్తూ.. చిటికెలో అలా తను టీనేజ్ లోకి అడుగు పెట్టింది అంటూ తన కుమార్తెకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.


హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ …
సితార నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో తన కుటుంబ సభ్యులతో పాటు మహేష్ బాబు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సితార 12 సంవత్సరాల పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో మహేష్ బాబు టీనేజ్ లోకి అడుగు పెట్టింది అంటూ పోస్ట్ చేశారు. ఇంత చిన్న వయసులోనే సితార ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చిన్నప్పటినుంచి ఎంతో యాక్టివ్ గా ఉండే సితార అతి చిన్న వయసులోనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన తన డాన్స్ కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ వచ్చేవారు.

కోటి రూపాయల రెమ్యూనరేషన్..
ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఈమె ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ ద్వారా కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఇంత చిన్న వయసులోని సితార పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తారు ఈమె మొదటిసారి పీఎంజే జువెలరీకి (PMJ Jewellery)బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ బ్రాండ్ ప్రమోట్ చేయడం కోసం సితార ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.


ఇక ఈ కోటి రూపాయలను సితార తన తండ్రి మహేష్ బాబు చారిటబుల్ ట్రస్ట్ కు అందజేసినట్లు వెల్లడించడంతో సితార మంచి మనసు పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. ఇక సితార హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ఆ దిశగా అడుగులు వేస్తూ శిక్షణ కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో ఎంతో బిజీగా ఉన్నారు. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులు జరుపుకుంటున్నారు. ఈ సినిమా ఓ అడ్వెంచర్స్ మూవీగా ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో రాబోతుంది. మొదటిసారి మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ మంచి తదితరులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారని తెలుస్తుంది.

Also Read: Babu Mohan: ఇండస్ట్రీలో కుల వివక్ష…దళితుడని అవకాశాలు ఇవ్వలేదు!

Related News

Janhvi Kapoor : ఇది నా అదృష్టం, జాన్వి పాపా పెద్ది కన్సర్ట్ లో ఎంత ముద్దుగా మాట్లాడిందో

Ram Charan: నా కల నిజం అయిపోయింది, కన్సర్ట్ లో రామ్ చరణ్ అదిరిపోయే ఎంట్రీ

SSMB29 : మొత్తానికి మహేష్ బాబు అప్డేట్ ఇచ్చాడు, గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ పై మహేష్ రియాక్షన్.

Gouri G Kishan : నాకు మారి సెల్వరాజ్ సార్ ఫోన్ చేశారు, ఇష్యూ గురించి ఏం చెప్పారంటే?

The Great Pre wedding show: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాపై బెల్లంకొండ రియాక్షన్, మొదటి సెలబ్రిటీ సపోర్ట్

Shraddha Das: అల్లు అర్జున్ టాలీవుడ్ షారుక్.. నా ప్రపంచమే మారిపోయిందన్న నటి!

Actor Vikranth: అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ..700 మంది ఎంప్లాయిస్.. ఈ హీరో బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదే!

Ajay Bhupathi : ఘట్టమనేని వారసుడు సినిమా టైటిల్ ఇదే, ఆ సెంటిమెంట్ వదలని అజయ్ భూపతి

Big Stories

×