AP pension update: ఒక చిన్న తప్పుతో నెలల తరబడి పెన్షన్ ఆగిపోతే ఎలా ఉంటుంది? భర్త చనిపోయాక భార్యకు రావాల్సిన సహాయం, కాస్త తప్పుగా నమోదు చేసిన తేదీ వల్ల వాయిదా పడితే ఆ ఇబ్బంది ఊహించలేం. కానీ ఇప్పుడు ఆ సమస్యకు ఓ సింపుల్ సొల్యూషన్ వచ్చింది. మీరు కూడా అలాంటి ఇబ్బందిలో ఉన్నవారైతే, ఇక ఆందోళన అవసరం లేదు.
పెన్షన్ తీసుకుంటూ మరణించిన భర్త యొక్క భార్య పెన్షన్ కొనసాగించాలంటే, భర్త మరణించిన తేదీ సహా ఇతర వివరాలు కచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో, డెత్ డేట్ తప్పుగా నమోదవుతోంది. ఇలాంటి సమయంలో, మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరిగే పని పడుతుంది. కానీ ఇకపై అలాంటిది అవసరం లేదు. ఎందుకంటే.. ప్రభుత్వం ఇప్పుడు ఓ సింపుల్ ఆప్షన్ తీసుకొచ్చింది.
గ్రామ, వార్డు సచివాలయంలో పని చేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ ల వద్దకు వెళ్లి SS Pension వెబ్‌సైట్ లోనే ఈ వివరాలను అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించారు. అంటే మీరు మీ భర్త చనిపోయిన తేదీ తప్పుగా నమోదయిందని గుర్తించారంటే, వెంటనే మీకు దగ్గరలో ఉన్న సచివాలయంలో అధికారిని సంప్రదించండి.
అక్కడ మీ వివరాలు చెక్ చేసి, కొత్తగా డెత్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయించి, తప్పుగా ఉన్న తేదీకి బదులుగా సరిగా ఉన్న తేదీని నమోదు చేయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, కొత్తగా సరిచేసిన వివరాలతో మీ పెన్షన్ గనుక క్లియరైపోతుంది. ఇది ఒక రకంగా పెద్ద సులభతరం.
ఎందుకంటే ఇప్పటివరకు ఈ వివరాలను మార్చాలంటే జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండేది. ఈ సదుపాయాన్ని ప్రభుత్వం అందించడంతో గ్రామస్థాయిలోనే సమస్య పరిష్కారమవుతోంది. పేదలు, వృద్ధులు ఎక్కువగా ఆధారపడే పెన్షన్ స్కీమ్స్ ఇప్పుడు మరింత సులభంగా అందుబాటులోకి వస్తున్నాయన్నమాట.
Also Read: Amaravati railway line: అమరావతికి ట్రైన్.. అంతా అనుకున్నట్లే జరిగేనా?
ఒక్కవేళ మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే.. లేదా మీకు తెలిసినవారు ఇలా తప్పుగా నమోదైన వివరాలతో ఇబ్బందిపడుతుంటే.. వెంటనే వారిని సచివాలయ అధికారిని కలవమని చెప్పండి. మరణించిన తేదీ తప్పుగా నమోదు అయిందంటే అది పెద్ద సమస్యనే. కానీ ఇప్పుడు ఆ సమస్యకు సరైన సొల్యూషన్ వచ్చేసింది.
ఇంకెందుకు ఆలస్యం? డెత్ డేట్లో తప్పులుంటే వెంటనే సరిచేయించండి. లేదంటే మీరు పెన్షన్ పొందడంలో ఇబ్బందులు వస్తాయి. ఈ చర్య వల్ల డేటా మెరుగవుతుంది, పెన్షన్ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతుంది, అలాగే అనధికారిక లబ్ధిదారులను బయటపెట్టడం కూడా సులభం అవుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ మార్గదర్శకాలు ఇప్పటికే అన్ని సచివాలయాలకు చేరాయి.
మీ భర్త పేరుతో తీసుకునే వితంతువు పెన్షన్ సజావుగా సాగాలంటే.. వివరాలు సరైనవిగా ఉండాల్సిందే. అందుకే డెత్ డేటా, డెత్ సర్టిఫికెట్ లాంటివి తప్పు లేకుండా అప్డేట్ చేయించుకోవాలి. మీ దగ్గరలోని సచివాలయానికి వెళితే చాలు, ఈ పని 10 నిమిషాల్లో అయిపోతుంది. అందుకు మృతుల డెత్ సర్టిఫికెట్, ఆధార్ డీటెయిల్స్ మాత్రమే అవసరం.
ఇది ఎప్పటికీ ఓపెన్ ఆప్షన్ కాదు. ప్రభుత్వం తరచూ ఇలా సిస్టమ్ ఓపెన్ చేసి, కొన్ని రోజులు మాత్రమే అవకాశం ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది ఓపెన్ అయిన సమయంలోనే చేసుకోవడం మంచిది.