Fauji Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడన్న విషయం అందరికి తెలిసిందే.. సీతారామం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ లుక్ కొత్తగా ఉండటంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీని చూస్తామా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈచిత్రానికి సంబంధించిన మరో ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో కీలక పాత్రలో నటించబోతున్నాడని టాక్.. ఇంతకీ ఆ హీరో ఎవరో ఒకసారి తెలుసుకుందాం..
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు అభిషేక్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్ హీరో తెలుగులోకి అడుగుపెడుతున్నాడు. ఇదే మొదటి తెలుగు చిత్రం కావడం విశేషం.. అభిషేక్ బచ్చన్ ‘ఫౌజీ’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించడానికి అంగీకరించారని సమాచారం. ప్రభాస్‌కు ధీటుగా ఆయన పాత్ర ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పీరియడ్ వార్ డ్రామా కాబట్టి, అభిషేక్ పాత్ర కూడా చరిత్రతో ముడిపడి ఉండే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్ ఈ సినిమాతో మరో హిస్టరీ బ్రేక్ చేసేలా ఉంటుందని టాక్.. అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే ఈ మూవీ గురించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది..
Also Read : పల్లవికి మైండ్ బ్లాక్.. అవని ప్లాన్ సక్సెస్..పార్టీ మార్చిన శ్రీకర్..
ప్రభాస్ ఫౌజీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.. కానీ స్పిరిట్ మూవీలో నటిస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న చిత్రానికి ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, రాహుల్ రవీంద్రన్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లలో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.. స్వాతంత్ర్యం ముందు జరిగిన పరిస్థితుల గురించి చూపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా సుమారు రూ. 700 కోట్లతో భారీ బడ్జెట్‌గా రూపొందుతోందని తెలుస్తోంది. ప్రభాస్ కెరీర్‌లోనే ఇది అత్యధిక బడ్జెట్ చిత్రం అవుతుందని అంటున్నారు. త్వరలోనే మరో అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది..
ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఫౌజీతో పాటుగా స్పిరిట్ మూవీ కూడా చేస్తున్నాడు.. ఈ మూవీ తర్వాత కల్కి 2, సలార్ 2 చిత్రాల్లో నటించనున్నాడు.