Intinti Ramayanam Today Episode September 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని అక్షయ్ ఇద్దరు కలిసి మ్యారేజ్ డే సెలెబ్రేషన్ చేసుకోవడం కోసం మేడం ని పిలవడానికి వెళ్తారు.. మనం మీ మేడమ్ ని పిలిస్తే మన మధ్య దూరం లేదని అనుకుంటుంది అని అవని అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆఫీస్ కి వెళ్తారు. ఆ గీత కనిపించి బాగున్నారా అని అడుగుతుంది. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏమి ఎరగనట్లు ఎంత అమాయకంగా అడుగుతున్నావే ఆయన నిన్ను అనడం కాదు నువ్వు జస్ట్ నటివి మాత్రమే అక్కడ నిన్ను డైరెక్ట్ చేస్తుంది వేరే వాళ్ళు వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని మనసులో అనుకుంటుంది. బాగానే ఉన్నాం ఇకమీదట కూడా బాగుంటాము అని అవని కావాలని గీతతో అంటుంది. గీత ఏదో జరిగింది అని అనుకుంటుంది… అవని, అక్షయ్ ఇద్దరు కూడా బాస్ దగ్గరికి వెళ్లి మా పెళ్లి రోజు రేపు మేము ఫంక్షన్ చేసుకుంటున్నాము. మీరు కచ్చితంగా రావాలి మేడం అని అడుగుతారు. చాముండేశ్వరి ఏదో ఇష్టం లేనట్లుగా మాట్లాడుతుంది. పెళ్లి రోజు అనగానే వాళ్లతో మాట్లాడుతుంది. వీరిద్దరూ గొడవలు పడ్డారు కదా మరి పెళ్లి రోజు జరుపుకుంటారా అని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇకపోతే తర్వాత రోజు ఉదయం అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా పల్లవి శ్రీకర్ కమల్ శ్రియ అందరూ వచ్చేస్తారు. రేపు పెళ్లి రోజు వేడుకంటే ఇప్పుడే వచ్చేసారేంటి ఏంట్రా అనేసి అడుగుతారు. పూజలు వ్రతాలు అన్ని మన ఇంట్లో చేసుకుంటున్నాం. మన ఇంటి వేడుకను మన ఇంట్లోనే చేసుకోవాలి కదా.. ఇక్కడ ఎందుకు చేసుకోవాలి వేరే వాళ్ళ ఇళ్లల్లో అని పల్లవి అంటుంది.. మొదట వద్దని అన్న పార్వతి తర్వాత వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా రా మన ఇంట్లోనే ఈ వేడుకను చేసుకుందామని అక్షయతో అంటుంది.
రాజేంద్రప్రసాద్ కూడా ఒకపక్క పల్లవి వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతాడు. కానీ అవని అక్షయ్ లు మాత్రం అందుకు ఒప్పుకోరు.. పల్లవి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. మనింట్లోనే ఈ వేడుక జరగాలి లేదంటే మేం కూడా ఇక్కడే ఉంటాం లగేజ్ తెచ్చుకుంటామని అంటుంది.. ఇక అక్షయ్ తప్పక ఫంక్షన్ ఇంట్లో చేయడానికి ఒప్పుకుంటాడు.. అందరూ కలిసి ఎంత సరదాగా ఆ ఇంటికి వెళ్లి పోతారు. కమల్ శ్రీకర్ ఇద్దరు ఇంటిని అందంగా డెకరేషన్ చేస్తారు.
రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరూ రావడం చూసినం కమల్ అమ్మ నాన్న అన్నయ్య వదిన అందరు వచ్చారు అని సంతోషంతో గంతులు వేస్తాడు. ఇంట్లోకి అడుగు పెట్టినను పల్లవిని హారతి తీసి లోపలికి తీసుకురామని పార్వతి చెప్తుంది. పార్వతి మాట ప్రకారం పల్లవి హారతి ఇచ్చి అవని అక్షయలను లోపలికి తీసుకుని వస్తుంది. అందరూ లోపలికి రాగానే కమల్ మీరందరూ వెళ్లి ఫ్రెష్ ఏ రండి ఫంక్షన్ ఏర్పాట్లు చేద్దామని అంటాడు. పల్లవి శ్రీయ ఇద్దరు కూడా.. మీ ఆయనకి ఇంకా వదిన భజన తప్ప వేరేది ఏమీ లేదు కదా అని అనుకుంటారు.
అయితే పల్లవిని బయటికి తీసుకొచ్చి అవని మాట్లాడుతుంది. ఏంటి అసలు ఊహించలేదు కదా నువ్వు ఇలా జరుగుతుందని పల్లవి అంటుంది. ఆ మాటకి నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు చేయాలనుకున్నది నువ్వే చేసావు. నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకొని కీప్ ఇట్ అప్.. నువ్వే దగ్గరుండి ఫంక్షన్ అంతా జరిగిన చేస్తావు చూడు అని వార్నింగ్ ఇస్తుంది. అయితే ఫంక్షన్ జరగడం గురించి అవని పల్లవి తో మాట్లాడడానికి విని షాక్ అవుతుంది. ఇక రాజేంద్రప్రసాద్ ఆ ఇంటికి వెళ్లిన తర్వాత అక్షయని నువ్వు ఏదో ఒక పని చేయొచ్చు కదా రా..
వాళ్ళిద్దరూ మీ ఫంక్షన్ కోసమే కదా కష్టపడుతున్నారు అని అంటారు.. కానీ అక్షయ్ మాత్రం మౌనంగా ఉండిపోతాడు. పార్వతి వచ్చి ఏదో ఒక పని చేయొచ్చు కదరా మీ మేడం వచ్చిన తర్వాత ఏ పని చేయవు కదా అని అడుగుతుంది. అప్పుడే పైనుంచి ఆ పని రావడం చూసినా అక్షయ్ ఆమె అందాన్ని చూసి ఫీదా అయిపోతాడు. ఇక కిందికి వచ్చిన అవని శ్రీకర్ని కావాలని మాట్లాడిస్తుంది. నేనేమైనా చేయమంటావా శ్రీకర్ చెప్పు చేస్తాను అని అడుగుతుంది. కానీ శ్రీకర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతాడు.
Also Read : మనోజ్ పై కక్ష్య తీర్చుకున్న బాలు.. ప్రభావతికి క్లాస్ పీకిన మీనా.. ఇంట్లో చిచ్చు పెట్టిన శోభన..
ప్రణతి నగలు వేసుకోవడం చూస్తున్న అవని ఈ నగలని నీకు ఎవరు ఇచ్చారు ప్రగతి అని అడుగుతుంది. పల్లవి వదిన ఈ నగలను వేసుకోమని ఇచ్చింది వదిన అని అంటుంది. ఇంటి తాళాలు చిన్నపిల్లవి నీకెందుకు.. పెద్దవాళ్ళకి చేయి నీకెందుకు ఈ పెత్తనం అని అంటుంది. పార్వతిని పిలిచి అవని తాళాలను ఇస్తుంది. ఇంటి పెద్ద కోడలు నువ్వు ఈ తాళాలు నీ దగ్గర పెట్టుకోవాలి అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..