ప్రపంచంలో కొన్ని రెస్టారెంట్లు చాలా యూనిక్ గా ఉంటాయి. వాటి నిర్మాణం నుంచి అమలు చేసే మెనూ వరకు క్రేజీగా ఉంటాయి. జపాన్, చైనా, థాయ్ లాండ్ సహా పలు దేశాల్లో ఇలాంటి రెస్టారెంట్లు కనిపిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి బ్యాంకాక్ లోని కండోమ్ రెస్టారెంట్. దీని అసలు పేరు ‘క్యాబేజెస్ & కండోమ్స్’ (Cabbages & Condoms) రెస్టారెంట్. ఇది కేవలం వింత థీమ్‌తో కూడిన రెస్టారెంట్ మాత్రమే కాదు, ఒక సామాజిక కార్యక్రమం కోసం డబ్బు సేకరించే నాన్ ప్రాఫిట్ రెస్టారెంట్. ఇక్కడ రెస్టారెంట్ అంతా కండోమ్ లతో డెకరేట్ చేయబడి ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఫుడ్ తిన్న తర్వాత కస్టమర్లకు మింట్ కు బదులుగా కండోమ్‌లు గిఫ్ట్ గా ఇస్తారు. నచ్చినన్ని ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. సేఫ్ సెక్స్, ఫ్యామిలీ ప్లానింగ్, HIV/AIDSపై అవగాహన కల్పించేందుకు గాను రెస్టారెంట్ ఇలా కండోమ్స్ ఉచితంగా ఇస్తుంది. రెస్టారెంట్ స్థాపకుడు మెచై విరవైద్యా థాయ్ లాండ్ లో పాపులేషన్ & కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అసోసియేషన్ (PDA) సహకారంతో నడిపిస్తున్నారు.
బ్యాంకాక్ కు ప్రతి ఏటా ఎంతో మంది భారతీయులు, ముఖ్యంగా తెలుగు పర్యాటకులు వెళ్తుంటారు. ఒకవేళ మీరు కూడా వెళ్తే సుఖుమ్విత్ రోడ్ లో ఉన్న ఈ రెస్టారెంట్ కు వెళ్లడం అస్సలు మానకండి. BTS స్కైట్రైన్ అసోక్ లేదంటే నానా స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ రెస్టారెంట్ ఉదయం11:00 నుంచి రాత్రి 10:00 వరకు ఓపెన్ చేయబడి ఉంటుంది.
ఈ రెస్టారెంట్ లో థాయ్ కుసిన్ – ప్యాడ్ థాయ్, టామ్ యమ్, మస్సమాన్ కర్రీ, గ్రీన్ కర్రీ, మీంగ్ ఖుమ్ లాంటి వెజ్, నాన్-వెజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ ధర ప్లేట్ కు సుమారు రూ.500 నుంచి రూ.1000 ఉంటుంది. ఇక్కడ కాక్ టెయిల్స్, వైన్స్, బీర్ లభిస్తుంది. ఇక ఈ రెస్టారెంట్ థీమ్, అట్మాస్ఫియర్ అంతా కండోమ్ లతో డెకరేషన్ చేయబడి ఉంటుంది. ల్యాంప్ షేడ్స్, మాన్నెక్విన్స్ టేబుల్స్ మీద కలర్ ఫుల్ కండోమ్ లేయర్ ఉంటుంది. ఇన్ డోర్, ఔట్ డోర్ కలిపి 400 సీట్లు ఉంటాయి. ఫ్యామిలీ-ఫ్రెండ్లీ రెస్టారెంట్. కానీ కొంచెం వింతగా ఉంటుంది.
Read Also: ఐస్ క్రీమ్ అనకూడదా? ఇంగ్లీష్ పదాలపై కిమ్ మామ ఆంక్షలు, ఆ పదాలన్నీ బ్యాన్!
ఇక ఈ రెస్టారెంట్ గురించి గూగుల్ లో 4.5/5 రేటింగ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ రెస్టారెంట్ థాయ్ లాండ్ లో పట్టయ్యా, చియాంగ్ మైలో బ్రాంచిలు ఉన్నాయి. ) ఉన్నాయి. రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్లకు గిఫ్ట్ గా కండోమ్స్ ఇస్తారు. వీటిని PDA ఛారిటీగా అందిస్తుంది.
Read Also: ఛీ.. సూప్ లో మూత్రం పోసిన టీనేజర్, రూ.2.56 కోట్లు జరిమానా విధించిన కోర్టు!