Actress Death:టెలివిజన్, సినిమాల ద్వారా సుపరిచితురాలు అయినటువంటి ప్రముఖ మరాఠీ నటి దయా డోంగ్రే (Daya Dongre) వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో పోరాడుతూ.. 85 ఏళ్ల వయసులో మరణించారు. దయా డోంగ్రే మరణం మరాఠీ సినీ ఇండస్ట్రీలో తీరని దుఃఖం మిగిల్చింది. ఎన్నో సినిమాల్లో, సీరియల్లలో నటించి మరాఠి ఇండస్ట్రీలో ఫేమస్ అయిన దయా డోంగ్రే మార్చి 11, 1940లో మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించింది. అలా కేవలం 16 ఏళ్ల వయసులోనే రంభ నాటకంతో నటించడం మొదలు పెట్టింది. పూణేలోని ఫెర్గూసన్ కళాశాలలో చదివిన తర్వాత ఆమె యాక్టింగ్ లో శిక్షణ కోసం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD)లో చేరింది. ఆ తర్వాత దయా డోంగ్రే పెళ్లి ఆమె సినీ ఎంట్రీకి అడ్డుపడింది.
కానీ ఆ తర్వాత భర్త శరద్ మద్దతుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా గత కొద్ది సంవత్సరాల నుండి దయా డోంగ్రే మరాఠీ టెలివిజన్ రంగంలో,సినిమా రంగంలో చెరగని ముద్ర వేసుకుంది… తుఝి మాఝి జోడి జమ్లి రే,యాచసతి కేలా హోతా అత్తహాస్, నందా సౌఖ్య భరే వంటి సినిమాల్లో దయా డోంగ్రే పోషించిన పవర్ఫుల్ పాత్రలతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.. ఇక దూరదర్శన్ లో వచ్చిన గజారా సిరీస్ తో దయా డోంగ్రే కి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.ఆ తర్వాత ఆమె మరాఠీ, హిందీ సినిమాలైనటువంటి ఆత్మ విశ్వాస్, మాయాబాప్, ఖత్యాల్ సాసు నాథల్ సూన్, నవ్రీ మిలే నవర్యాలా, నకాబ్ వంటి సినిమాలలో నటించింది.
ALSO READ:Bigg Boss 9 Promo: బిగ్ బాస్ ముద్దుబిడ్డ.. ఫైనల్ గా గుట్టు రట్టు.. శ్రీజ మాటలు నిజమేనా?
దయా డోంగ్రేను అందరూ అత్త పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అంటారు.అలా టాలీవుడ్ లో ఒకప్పుడు అత్త పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా సూర్యకాంతం ఎలా ఉండేదో బాలీవుడ్లో అత్త పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా దయా డోంగ్రే ఉండేది. ఇక దయా డోంగ్రే మాయా బాప్ , ఖత్యాల్ సాసు నాథల్ సూన్ వంటి సినిమాల్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినందుకుగానూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకి అవార్డులు ఇచ్చి సత్కరించింది..
దయా డోంగ్రే మరణ వార్త వినగానే మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సంతాపం తెలుపుతూ “తన పవర్ఫుల్ నటనతో.. ఎనర్జీతో మరాఠీ సినీ రంగంలో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ నటి దయా డోంగ్రే మరణ వార్త విని చాలా బాధపడ్డాను. మహారాష్ట్రలో నటన, కళా ప్రపంచం యొక్క యుగం ముగిసింది.. మనమందరం దయా డోంగ్రే కుటుంబం, అభిమానుల దుఃఖాన్ని పంచుకుందాం.. దేవుడు ఆమె ఆత్మకి శాంతి చేకూర్చాలి” అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అలాగే పలువురు ప్రముఖులు దయా డోంగ్రే మరణం పట్ల ఎమోషనల్ అవుతూ సంతాపం ప్రకటిస్తున్నారు.