BigTV English

Narendra Modi: మోదీ @ 75.. ఫిట్ నెస్ సీక్రెట్స్.. ఆ శక్తి వెనుక రహస్యాలు..

Narendra Modi: మోదీ @ 75.. ఫిట్ నెస్ సీక్రెట్స్.. ఆ శక్తి వెనుక రహస్యాలు..

Narendra Modi: ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో తెలుసు. మైనస్ లను ప్లస్ గా మార్చుకోవడం తెలుసు. కఠినమైన పరీక్షలను తట్టుకుని ఎదుర్కోవడం తెలుసు. జియోపాలిటిక్స్ ను గిరగిరా తిప్పడం తెలుసు. ట్రంప్ అయినా.., జిన్ పింగ్ అయినా ఎవరైనా ఒకటే. పని చేయడం తెలుసు.. పని చేయించుకోవడం ఎలాగో తెలుసు. పార్టీని సింగిల్ హ్యాండ్ తో నడపడం తెలుసు. దేశాన్ని ఎలా టాప్ పొజిషన్ లో ఉంచాలో తెలుసు. విమర్శలను ఎలా డీల్ చేయాలో తెలుసు. 75 ఏళ్ల వయసులో ఇవన్నీ సాధ్యమా? కానీ సుసాధ్యం చేస్తున్నారు మన ప్రధాని మోడీ. ప్రపంచదేశాధినేతలు వరుసపెట్టి వీడియో మెసేజ్ ల రూపంలో మోడీకి బర్త్ డే విషెస్ చెప్పారు. ఏంటి మన ప్రైమ్ మినిస్టర్ స్పెషల్?


మన ప్రధాని మోడీ బర్త్ డే సందర్భంగా ఆస్ట్రేలియా నుంచి ఇజ్రాయెల్ దాకా ప్రధానమంత్రులు ప్రత్యేకంగా వీడియో మెసేజ్ లు రిలీజ్ చేశారు. సోషల్ మీడియా మోడీ బర్త్ డే విషెస్ తో హోరెత్తిపోయింది. ఇలా ప్రధానమంత్రులు ప్రత్యేకంగా మోడీ కోసం వీడియో చేసి విడుదల చేయడం అంటే మాటలు కాదు. అసాధారణ సందర్భం. భారత్ కు, మోడీకి ఇస్తున్న వాల్యూ ఇది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా మొదలైన మోడీ ప్రయాణం, బీజేపీలో చేరడం, గుజరాత్ సీఎం, 2014 నుంచి భారత దేశ ప్రధానిగా, ప్రపంచంలో తిరుగులేని నేతగా కొనసాగడం అంటే ఈ ప్రయాణం అసాధారణం. సెప్టెంబర్ 17 మోడీ 75వ పుట్టిన రోజు. ఈ వయసులో సాధారణంగా అంతా రిటైర్మెంట్ అయి రెస్ట్ తీసుకుంటారు. కానీ మోడీ అలా కాదు.. ఆయన నడక, ఫిట్ నెస్ చూస్తే 75 ఏళ్లు ఉంటాయా అన్న ఆశ్చర్యం కలగకమానదు. ఫిట్ నెస్ అంటే మోడీ.. మోడీ అంటే ఫిట్ నెస్, దేశాన్ని కూడా ఫిట్ గా ఉంచుతున్నారన్న చర్చ కూడా ఉంది.

75 ఏళ్లకు పనికి సంబంధం లేదన్న బీజేపీ


విషయం ఏంటంటే.. బీజేపీలో 75 ఏళ్లు దాటిన తర్వాత నాయకులు కీలక పదవుల్లో కొనసాగకూడదని గతంలో మౌఖిక నియమం పెట్టుకున్నారు. ఆ ప్రకారమే ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషిలను సలహాదారుగా పెట్టి పక్కన పెట్టారు. అయితే ఇది మోడీ విషయంలో వర్కవుట్ అవుతుందా అన్న చర్చ గత ఏడాది కాలంగా సాగుతూ వస్తోంది. ఫైనల్ గా ఆ రోజు రానే వచ్చింది. 75 ఏళ్లు నిండాయి. కానీ మోడీ తన పనిలో మరింతగా ఉత్సాహంగా పాల్గొనడం బీజేపీ శ్రేణులకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే వయసు గురించి వాళ్లు ఆలోచించట్లేదు కాబట్టి. మొన్నటి ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో ఆరెస్సెస్ పై మోడీ ప్రశంసలు కురిపించారు. ఇదంతా రిటైర్మెంట్ పొడగించుకునే ప్లానే అని కాంగ్రెస్ డౌట్ పడింది. అటు సంఘ్ చీఫ్ కూడా తాను 75 ఏళ్లకు రిటైర్మెంట్ అని చెప్పలేదని మాట మార్చేశారు. సో పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా మారిపోయాయ్. ఫిట్ గా ఉన్నారు. దేశాన్ని నడిపించే సత్తా ఉన్నప్పుడు కొనసాగితే తప్పేంటన్నది మోడీ అభిమానుల మాట. ట్రంప్ వయసు 79 ఏళ్లు, నెతన్యాహు వయసు 75 ఏళ్లు, జిన్ పింగ్, పుతిన్ వయసు 72 ఏళ్లు. సో ఏ ప్రామినెంట్ లీడర్ ను తీసుకున్నా వయసు 70 పైనే ఉంది. మోడీకే ఎందుకు వయసును ఆపాదిస్తున్నారన్న వారూ ఉన్నారు.

మోడీ వయసుపై సోషల్ మీడియాలో చర్చ

మోడీ వయసు గురించి సోషల్ మీడియాలో రకరకాల హ్యాష్ ట్యాగ్ లతో నడిచాయి. చాలా మంది అనుకూలంగా, కొందరు ప్రతికూలంగా పోస్టులు పెట్టారు. ఒక్కసారి ఈ పోస్ట్ చూడండి.. ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుు ట్రంప్ ఫోన్ చేసి మరీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీనికి మోడీ Xలో థాంక్యూ మై ఫ్రెండ్ అంటూ ట్వీట్ చేశారు. ఇంకొన్ని పోస్ట్‌ల్లో మోడీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పోల్చారు. ఇద్దరూ ఇద్దరే అని స్ట్రాంగ్ లీడర్స్ అని, సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉన్న వారంటూ పోస్టులు పెట్టారు. నెతన్యాహు చేతుల్లో ఇజ్రాయెల్ ఎలా ఉందో.. మోడీ చేతుల్లో భారత్ అలా సేఫ్టీగా ఉందన్నారు. మోడీకి మరో రెండు టర్మ్‌లు కోరుకున్న వారూ ఉన్నారు.

మోడీ జీవితంలో ప్రేరణాత్మక స్టోరీలు షేర్..

కొందరైతే My Mod Story అనే హ్యాష్‌ట్యాగ్‌తో మోడీ జీవితంలో ఉన్న ప్రేరణాత్మక స్టోరీలను షేర్ చేశారు. ఈ పోస్ట్‌లు మోడీ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా చేసిన సేవలను హైలైట్ చేశాయి. చాయ్ వాలా నుంచి ప్రధాని పీఠం దాకా సాగిన జర్నీని ప్రస్తావించారు. ఈ సందర్భంగా మోడీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్, వ్యాక్సిన్ మైత్రీ, G20 నాయకత్వం, ఆయుష్మాన్ భారత్, జీఎస్టీ సంస్కరణలు, ఆపరేషన్ సిందూర్, పీఎం ఆవాస్ యోజన, ఆర్టికల్ 370, స్వచ్ఛ భారత్, జన్ ధన్ యోజన, యూపీఐ వంటి విజయాలను గుర్తు చేసుకున్నారు.

ఏటీ 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని మరికొందరు

ఇంకొదరు.. National Unemployment Day అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు రన్ చేశారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని, ఉద్యోగ కల్పన ఏదన్న ప్రశ్నల్ని సంధించారు. ఇవన్నీ పక్కన పెడితే సో ఫైనల్ గా మోడీ 75 మార్క్ క్రాస్ చేశారు. ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. స్వస్థ నారీ- స్వశక్త్ పరివార్ పథకాన్ని ప్రారంభించారు. అంతే కాదు మధ్యప్రదేశ్ లో జరిగిన ప్రోగ్రామ్ లో శత్రు దేశాలకు బిగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాము బతికేదే దేశం కోసమని, అణు బెదిరింపులకు భయపడేదే లేదంటున్నారు. ఆపరేషన్ సిందూర్ తో పాక్ కు, ఉగ్రవాదులకు గట్టి బుద్ధి చెప్పామన్నారు. దేశ రాజకీయాలపైనే కాదు.. ప్రజల మనసులపైనా ముద్ర వేసిన లీడర్ మోడీ. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే ఇందిర.. ఇందిర అంటే కాంగ్రెస్‌. ఇప్పుడు మోడీ అంటే బీజేపీ.. బీజేపీ అంటే మోడీ అన్నట్లుగా మారింది. ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలో మోడీకి తెలిసినట్లుగా నేటితరం రాజకీయనేతల్లో ఎవరికీ తెలియదు. మైనస్‌ను కూడా ప్లస్‌గా మార్చుకునే టాలెంట్ మోడీ సొంతం. అందుకే కథ మారుస్తున్నారు. దేశాన్ని కొత్త శకంవైపు నడిపిస్తున్నారు.

పెద్దఎత్తున అభిమానుల్ని సంపాదించుకున్న మోడీ

మాకు దేశమే ముఖ్యం.. దేశం కన్నా ఏదీ ఎక్కువ కాదు.. మోడీ నోటి నుంచి వచ్చిన ఈ ఒకే ఒక్క డైలాగ్ చాలు.. కోట్లాది మందిని తనవైపు తిప్పుకోవడానికి. ఆయన దేశభక్తికి తిరుగులేదని, సర్వస్వం త్యాగం చేసి దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చేందుకు అహర్నిశలూ కృషి చేస్తుంటారని ఆయన అభిమానులు, చాలా మంది కామన్ పీపుల్ నమ్మేది. విద్వేష భావాలు రెచ్చగొడతారని, అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుని దేశాన్ని వెనక్కి నడిపిస్తారని వ్యతిరేకులు విమర్శిస్తుంటారు. కానీ మోడీ ముందు విమర్శలన్నీ తేలిపోతుంటాయి. అదే ఆయన ఛరిష్మా. అందుకే ఆయనకు జనం సెల్యూట్ చేసేది.

1987లో గుజరాత్ బీజేపీలో కీలక బాధ్యతలు

ఒకటా? రెండా.. మోడీ విజయాలు ఎన్నో ఉన్నాయి. గత 11 ఏళ్లుగా భారత దేశ ప్రధానమంత్రిగా చెరగని ముద్ర వేశారు. దేశాన్ని మరో లెవెల్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. బాల్యంలోనే తండ్రితో పాటు చాయ్‌ అమ్మిన మోడీ ఎనిమిదేళ్ల వయస్సులో సంఘ్ లో చేరి 15 ఏళ్ల పాటు చాలా బాధ్యతలు చూశారు. 1987లో బీజేపీ గుజరాత్‌ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాడు అత్యధిక సీట్లు సాధించింది. అద్వానీ సోమనాథ్‌ రథయాత్రను అలాగే మురళీ మనోహర్ జోషి ఏక్తా యాత్రను సక్సెస్ చేయడంలో మోడీది కీ రోల్. మోడీ పనితీరు చూసిన వాజ్ పేయి గుజరాత్ సీఎంగా అవకాశం ఇచ్చారు. ఇక అంతే మోడీ వెనుదిరిగి చూసుకోలేదు. గుజరాత్‌ సీఎంగా 13 ఏళ్లలో బలమైన పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థగా మార్చారు. గుజరాత్ మోడల్ ను దేశానికి పరిచయం చేశారు.

తొలిసారి పూర్తి మెజార్టీతో అధికారంలోకి బీజేపీ

2014లో దేశమంతటా మోడీ ప్రభంజనంతో తొలిసారి బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధించి పెట్టి బీజేపీలో తనకు ప్రత్యామ్నాయం లేదని నిరూపించుకున్నారు. మోడీ హయాంలో బీజేపీ బలమైన పార్టీగా, అతిపెద్ద పార్టీగా అవతరించి సొంతంగా దాదాపు 18 రాష్ట్రాలలో అధికారంలోకి రావడమే కాకుండా మొత్తం 21 రాష్ట్రాలలో ఎన్డీయే సారథ్యంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేలా తిరుగులేని విధంగా చేశారు. 2014కు ముందు మనదేశంలో సంకీర్ణ రాజకీయాలు నడిచాయి. కానీ మోడీ ఎప్పుడైతే వచ్చారో వార్ వన్ సైడ్ అయింది. లక్ష్యాల కోసం నిరంతరం కృషి చేయడంతో ప్రత్యర్థులు కూడా ఆయన ముందు బలంగా నిలవలేకపోయారు.

ఆర్టీకల్ 370 రద్దు సాహసోపేత వ్యూహం

ఈ 11 ఏళ్లల్లో ప్రధాని హోదాలో మోడీ సాధించిన విజయాల్లో కీలకమైన వాటిని ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా దశాబ్దాల నాటి బిజెపి లక్ష్యం నెరవేర్చారు. ఈ సాహసోపేతమైన వ్యూహం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. మోడీ రాజకీయ యుక్తి ఇదే మరి. పొలిటికల్ పాఠాల్లో ఇదొక మాస్టర్ క్లాస్ గా నిలుస్తుంది. రాజ్యసభలో తగినంత సంఖ్యాబలం లేకపోయినా ముందుకు నడిపించారు. మోడీ-అమిత్ షా కలిసి చాలా అంచనాలను బద్దలు కొట్టారు. వేర్పాటువాదులతో చర్చలను పక్కన పెట్టి మొత్తం జమ్మూకశ్మీర్ ను దాదాపుగా సెట్ చేసేశారు. ఇక లేటెస్ట్ గా జరిగిన ఆపరేషన్ సిందూర్ మోడీ చరిత్రలో మైల్ స్టోన్. పహల్గాంలో హిందువులనే టార్గెట్ చేసి చంపిన ఘటనను సీరియస్ గా తీసుకున్నారు మోడీ. మహిళల సింధూరాన్ని తుడిచేసిన వారిని ఆపరేషన్ సిందూర్ తో కథ ముగించారు. పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయించారు.

జీఎస్టీ వరుస సంస్కరణలతో బెనిఫిట్స్

ప్రపంచమంతా కరోనాతో తల్లడిల్లుతుంటే కోవిడ్ వ్యాక్సిన్ తయారీపై వ్యూహాత్మకంగా వ్యవహరించి, టీకాలను అందరికీ అందేలా చేశారు. యావరేజ్ గా 97% మందికి కనీసం ఒక డోస్, 90% మందికి రెండు డోస్ లు ఇచ్చేలా చూసుకున్నారు. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ టీకా కవరేజీలలో ఒకటి. అటు జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేయించి పన్ను సంస్కరణలు తీసుకొచ్చి.. ఒకే దేశం, ఒకే పన్ను వ్యవస్థను సృష్టించి.. వ్యక్తిగత ఆదాయపన్నులో మేలు చేసి, ఇప్పుడు జీఎస్టీ రెండు శ్లాబులుగా మార్చి.. ఐటీ చట్టాన్ని సరికొత్తగా తీసుకొచ్చి.. ఇలా ఒక్కటేమిటి ఆర్థిక రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చేలా చేశారు. మొండి బకాయిలను తిరిగి సాధించడంలో కీలకమయ్యారు.

జన్ ధన్ ఖాతాలతో నేరుగా నగదు బదిలీ స్రీంలు

2014లో మోడీ అధికారంలోకి వస్తూనే.. జన్ ధన్ యోజన కింద అందరికీ బ్యాంకు ఖాతాలు తెరవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐదు నెలల్లోనే 12.5 కోట్ల ఖాతాలు ఓపెన్ చేయించారు. ఇవాళ 56 కోట్లకు పైగా ఖాతాలలో 2.6 లక్షల కోట్ల డబ్బు జమై ఉంది. ఈ ఖాతాలతో డైరెక్ట్ బెనిఫిట్స్ కల్పించడం టార్గెట్. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైమ్ చెల్లింపు వ్యవస్థ UPIని తీసుకొచ్చారు. గత ఆగస్టులో 20 బిలియన్ల నెలవారీ ట్రాన్సాక్షన్స్ UPI ద్వారానే జరిగాయంటే ఆశ్చర్యమే. UPIపై మొదట్లో విమర్శలు వచ్చాయి. చదువుకోని వారు, ఇంటర్నెట్ లేని వారు ఎలా ఈ గూగుల్ పే, ఫోన్ పే వాడుతారన్న ప్రశ్నలు వచ్చాయి. కానీ ఇప్పుడు అంతా UPIతోనే పనులు జరుగుతున్నాయి.

80 కోట్లకు పైగా జనానికి ఉచిత బియ్యం, గోధుమలు

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఆహార సబ్సిడీని ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆహార ధాన్య పథకంగా మార్చింది. 80 కోట్లకు పైగా ప్రజలు ఇప్పుడు నెలకు 5 కిలోల బియ్యం లేదా గోధుమలను ఉచితంగా పొందుతున్నారు. 2018 సెప్టెంబర్ లో ఆయుష్మాన్ భారత్‌ను ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ స్కీంగా పేరు పొందింది. 42 కోట్ల మంది ఈ స్కీంలో ఉన్నారు. అటు గత 11 ఏళ్లలో హైవేల నిర్మాణం, విస్తరణ జెట్ స్పీడ్ తో సాగింది. 2018-19 నుంచి హైవే విస్తరణ, నిర్మాణం ఏటా యావరేజ్ 10 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంది. 2020-21 నాటికి రోజుకు 37 కిలోమీటర్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఫాస్టాగ్ తీసుకొచ్చారు. టోల్ గేట్ల దగ్గర స్పీడ్ పెంచారు. అలాగే ఇప్పుడు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ తో జనానికి మరింత లబ్ది చేకూర్చారు మోడీ. 2019లో ప్రారంభమైన జల్ జీవన్ మిషన్ 81 శాతం ఇండ్లకు నీరు అందించడంలో కీలకంగా మారింది. 11 రాష్ట్రాలు ఇప్పుడు 100% కవరేజీ సాధించాయి. అటు గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని పేదలకు ఇండ్ల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన తీసుకొచ్చారు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 3.9 కోట్ల పక్కా ఇళ్లు మంజూరు చేయగా, వాటిలో 2.9 కోట్ల ఇండ్లు పూర్తయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 1.2 కోట్ల ఇళ్లు మంజూరు చేయగా, 94 లక్షలు పూర్తయ్యాయి.

Also Read: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు

2014 అక్టోబర్ 2 ప్రారంభించి స్వచ్ఛ భారత్ మిషన్ ఒక మైల్ స్టోన్ గా మార్చింది. బహిరంగ మల విసర్జన, చెత్తాచెదారం లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ మిషన్ ప్రారంభమైంది. సక్సెస్ దిశగా నడుస్తోంది. 2024 ఫిబ్రవరిలో ప్రారంభమైన పీఎం సూర్యఘర్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశీయ రూఫ్‌టాప్ సోలార్ ఇనిషియేటివ్ గా నిలిచింది. దాదాపు 20 లక్షల ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌ల ఏర్పాటు దిశగా కదిలారు. 2026 మార్చి నాటికి 40 లక్షల ఇళ్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు బిపిఎల్ కుటుంబాల మహిళలకు ఉచిత ఎల్‌పిజి కనెక్షన్‌లను అందించాలని ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని తెచ్చారు. 2025 జూన్ నాటికి మొత్తం 33 కోట్ల మంది LPG కస్టమర్లలో 10.3 కోట్లకు పైగా లబ్ధిదారులు PMUY పథకం కిందే ఉన్నారు. సో 11 ఏళ్లలో దేశాన్ని మార్పు దిశగా మోడీ నడిపించారు. అంతే కాదు అంతర్జాతీయంగా భారత్ ఖ్యాతిని పెంచారు. ఒక విజన్ తో ముందడుగు వేస్తున్నారు.

Story By Vidya Sagar, Bigtv

Related News

Modi Assets: 75 ఏళ్లుగా మోదీ సంపాదన ఇంతేనా? ఆయన ఎక్కడ పొదుపు చేస్తారు?

Election Commission: ఈవీఎంలపై ఈసీ సంచలన నిర్ణయం.. ఇక గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు..

Modi Birthday: తన బర్త్‌డేకు కేక్ కట్ చేయని ప్రధాని.. దానికి బదులు ఏం చేస్తున్నారంటే?

Monsoon Effect: నైరుతి ఎఫెక్ట్..! ముంచుకొస్తున్న మహా ప్రళయం.. భారత్ అంతమే?

PM Modi: నేటి నుంచి దేశవ్యాప్తంగా స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్

Maoists: మావోయిస్టులు కీలక నిర్ణయం.. పోరాటానికి తాత్కాలిక విరమణ, ఆయుధాలు వదిలేస్తాం!

Dehradun Cloudburst: డెహ్రాడూన్ వరద ప్రవాహంలో.. 10 మంది గల్లంతు

Big Stories

×