BigTV English

SS Rajamouli: వైద్య వ్యర్థాలతో రాజమౌళి డ్రెస్.. అలా ఎలా వేయాలనిపించింది అశ్విన్?

SS Rajamouli: వైద్య వ్యర్థాలతో రాజమౌళి డ్రెస్.. అలా ఎలా వేయాలనిపించింది అశ్విన్?

SS Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా, దర్శక ధీరుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో ఎస్.ఎస్ రాజమౌళి (S.S.Rajamouli) ఒకరు. ఈయన కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu) సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే రాజమౌళి పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించి సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రభాస్(Prabhas) హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Aswin) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి(Kalki) సినిమాలో కూడా రాజమౌళి కనిపించారు.


వైద్య వ్యర్థాలతో డిజైన్…

ఈ సినిమాలో ఎంతోమంది సెలబ్రిటీలో భాగమయ్యారు. ఇక రాజమౌళి కూడా ఈ సినిమాలో
బౌంటీ హంటర్‌గా(Bounty hunter) కనిపించి సందడి చేశారు. ఈ సినిమాలో రాజమౌళి కనిపించింది కొన్ని సెకండ్లు అయినప్పటికీ ఈయన పాత్ర వెనుక పెద్ద స్టోరీ ఉందని తాజాగా ఈయన కాస్ట్యూమ్ డిజైనర్ అర్చన అఖిల్ రావు(Archana Akhil Rao) రాజమౌళి లుక్ గురించి ఆయన కాస్ట్యూమ్ గురించి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమాలో రాజమౌళి ధరించిన కాస్ట్యూమ్ ఉద్దేశపూర్వకంగా డిజైన్ చేసినదని తెలిపారు. రాజమౌళి ధరించిన ఈ డ్రెస్ కాలర్ వైద్య వ్యర్థాలను ఉపయోగించి తయారు చేశారని తెలిపారు.


రాజమౌళి ఈగ సినిమా..

రాజమౌళి మెడలో ధరించిన లాకెట్ ప్రభాస్ నటించిన చత్రపతి సినిమాని సూచించగా, మరొకటి రాజమౌళి కంటి కింద ఒక చిన్న ఈగ టాటూ కనిపిస్తుందని, ఈ రెండు రాజమౌళి చత్రపతి ఈగ సినిమాలకు సింబాలిక్ గా పెట్టినట్లు తెలిపారు. ఈ రెండు నాగ్ అశ్విన్ ఆలోచనలని అర్చన తెలియజేశారు. మరోసారి మీరు కల్కి సినిమా కనుక చూస్తే తప్పకుండా బౌంటీ హంటర్ సన్నివేశాన్ని దగ్గరగా పరిశీలిస్తే వీటిని గమనించవచ్చు అంటూ అర్చన ఈ సందర్భంగా తెలియజేశారు. ఇకపోతే ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ.. రాజమౌళి కొన్ని సెకండ్ల పాత్ర వెనుక ఇంత కథ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు..

ఇకపోతే రాజమౌళి డ్రెస్సులో వైద్య వ్యర్థాలను వాడారనే విషయం తెలియడంతో ఆస్కార్ అవార్డు గ్రహీతకు అలాంటి డ్రెస్ ఎలా వేయాలనిపించింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక కల్కి సినిమాకు సీక్వెల్ సినిమా కూడా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ సినిమాలో బౌంటీ హంటర్ పాత్ర ఉంటుందా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా అతి త్వరలోనే షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుందని వచ్చేయేడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇటీవల నిర్మాత అశ్వినీ దత్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ఇక కల్కి సినిమా గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లక పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే.

Also Read: Genelia: మూడేళ్లుగా నా భర్త టార్చర్.. రితేష్ నిజ స్వరూపం బయట పెట్టిన జెనీలియా?

Related News

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Kishkindhapuri: ఆ టార్చర్ నుండి బయటపడేసిన కౌశిక్.. నో ముఖేష్ నో స్మోకింగ్..!

Madharaasi Collections : తెలుగు రాష్ట్రాల్లో షాకిచ్చిన ‘మదరాసి’.. ఇలా అయితే కష్టమే..!

Sukumar: పుష్ప 3 ర్యాంపేజ్.. సైమా అవార్డ్స్ స్టేజ్‌పై ఊహించని అప్డేట్ ఇచ్చిన సుక్కు

Sandeep Reddy Vanga: దానికి మించిన ఇంటర్వెల్ సీన్ ఇంకేదీ లేదు

Little hearts Collections : లిటిల్ హార్ట్స్‌కు బిగ్ షాక్… పాజిటివ్ టాక్ వచ్చినా తక్కువ కలెక్షన్లే

Big Stories

×