BigTV English

Genelia: మూడేళ్లుగా నా భర్త టార్చర్.. రితేష్ నిజ స్వరూపం బయట పెట్టిన జెనీలియా?

Genelia: మూడేళ్లుగా నా భర్త టార్చర్.. రితేష్ నిజ స్వరూపం బయట పెట్టిన జెనీలియా?

Genelia: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న జెనీలియా(Genelia) ఒకానొక సమయంలో వరుస హిట్ సినిమాల ద్వారా ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒవెలుగు వెలిగారు. ఇలా తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె బాలీవుడ్ నటుడు నిర్మాత రితేష్ దేశ్ ముఖ్ (Riteish Deshmukh) ను వివాహం చేసుకొని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. దాదాపు 13 సంవత్సరాలు పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న జెనీలియా ఇటీవలి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తిరిగి ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు.


వారికి నా అవసరం లేదు..

తాజాగా జెనీలియా కిరీట్ రెడ్డి(Kireeti Reddy) హీరోగా నటించిన “జూనియర్”(Junior) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జెనీలియా పాత్ర ఎంతో అద్భుతంగా ఉండటమే కాకుండా తన నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో జెనీలియా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన భర్త రితేష్ గురించే ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. తాను 13 సంవత్సరాలు పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన భర్త పిల్లలతో ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడిపానని తెలిపారు.


మజిలీ సినిమాలో నటించిన జెనీలియా?

ఇప్పుడు తన పిల్లలు పెద్దవాళ్లు కావడంతో వారి పనులను వారే చూసుకుంటున్నారు, వారికి నా అవసరం లేదు కనుక నేను తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని జెనీలియా తెలియజేశారు. అయితే జూనియర్ సినిమా తన రీ ఎంట్రీ సినిమా కాదని తెలిపారు. 2022 సంవత్సరంలో తన భర్త దర్శకత్వంలో తెరకెక్కిన “మజిలీ “(Majli)మరాఠి సినిమాలో సమంత పాత్రలో తానే నటించానని తెలిపారు. అది తన రీ ఎంట్రీ సినిమా అని జెనీలియా వెల్లడించారు. అయితే గత మూడు సంవత్సరాలుగా ఇంట్లో తన భర్త టార్చర్ భరించలేకపోతున్నానని ఈమె తెలిపారు.

రీ ఎంట్రీ కోసం టార్చర్..

గత మూడు సంవత్సరాలుగా తన భర్త సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వాలి అంటూ నన్ను భయంకరమైన టార్చర్ పెడుతున్నారని, ఆ టార్చర్ భరించలేకే తాను జూనియర్ సినిమా ద్వారా దక్షిణాది ప్రేక్షకుల ముందుకు వచ్చానని తెలియజేశారు. అయితే ఇక్కడ ప్రేక్షకులు నన్ను ఇప్పటికీ హాసినిగానే గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ఇలా మంచి కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలు లభిస్తే తప్పకుండా తాను నటిస్తాను అంటూ జెనీలియా తెలియజేశారు. ప్రస్తుతం ఈమె సినిమాల గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ స్పందిస్తూ.. సాధారణంగా పెళ్లయిన తర్వాత హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరమవుతారు కానీ ఈమెను ఇండస్ట్రీలోకి రావాలి అంటూ తన భర్త ప్రోత్సహించడం నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక తెలుగులో జెనీలియా బాయ్స్ ,రెడీ, ఢీ, బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.

Also Read: Star Actresses: కియరా మాత్రమే కాదు మొదట ఆడబిడ్డకు జన్మనిచ్చిన స్టార్స్ వీళ్ళే?

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×