Harish Shankar: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒకటి. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మీద అందరికీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం స్వతహాగా హరిశంకర్ పవన్ కళ్యాణ్ కి వీర అభిమాని కావడం వలన.
వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న అన్ని రికార్డ్స్ ని ఆ సినిమా కొల్లగొట్టింది. పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసిన సినిమా గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ సినిమా ని డిజైన్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
రోజురోజుకు లీకులు బెడద
ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా దర్శకుడు తో పాటు చిత్ర యూనిట్ అంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే రోజుకో లీక్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ శ్రీ లీలా కలిసి ఒక బస్సు దగ్గర మాట్లాడుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ వీడియో ఎప్పుడిదే అని సుమ ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు నిన్నటిది అని శ్రీలీలా చెప్పింది. అంటే దీనిని బట్టి ఎంత ఫాస్ట్ గా వీడియోలు వైరల్ అయిపోతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రీసెంట్ గా కూడా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో వైరల్ కావడంతో కొంతమంది ఫ్యాన్స్. కంప్లీట్ సినిమా చూడనిస్తారా లేకపోతే ఈ లీకులతోనే సరి పెడతారా అనే కామెంట్ చేస్తున్నారు.
హరీష్ శంకర్ జాగ్రత్త వహించాలి
ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా పవన్ కళ్యాణ్ ను ఎలా చూపించాలో హరీష్ శంకర్ కి బాగా తెలుసు. ఈ తరుణంలో ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా హరీష్ శంకర్ జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు లీక్డ్ వీడియోస్ లో పవన్ కళ్యాణ్ ని చూస్తే రేపు థియేటర్ లో ఆ సర్ప్రైజ్ అనేది ఫీల్ అవ్వలేం. ఇక పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి ఎటువంటి మేనరిజమ్స్ సెట్ అవుతాయి. ఎటువంటి డైలాగులు కనెక్ట్ అవుతాయి అనేది హరీష్ కి బాగా తెలుసు. రియల్ లైఫ్ కి కూడా దగ్గరగా ఉండే డైలాగ్స్ రాయడం హరీష్ కు కొట్టినపిండి. ఇక వీరి కాంబినేషన్లో మరోసారి తిక్క చూపించి బాక్సాఫీస్ లెక్కలు తేలుస్తారేమో వేచి చూడాలి.