OTT Movie : టైమ్ లూప్ జానర్ లో తెరకెక్కే సినిమాలు ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తూ అలరిస్తుంటాయి. ఈ చిత్రంలో ఒక ఫ్యామిలీ అతీంద్రీయ శక్తులు ఉండే ఒక గడ్డి మైదానంలో చిక్కుకుంటుంది. అక్కడ భయంకరమైన వాతావరణంలో ఈ కథ ఒక టైమ్ లూప్ లో తిరుగుతుంది. ప్రతి క్షణం ఉత్కంఠంగా సాగే ఈ సినిమా స్పైన్ చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘In the Tall Grass’ 2019 అక్టోబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ చిత్రం. దీనికి విన్సెంజో నటాలీ దర్శకత్వం వహించారు. ఇది స్టీఫెన్ కింగ్, జో హిల్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఇందులో లైస్‌లా డి ఒలివెరా, అవరీ విట్టెడ్, హారిసన్ గిల్బర్ట్‌సన్, విల్ బ్యూయీ జూనియర్, రాచెల్ విల్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 101 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 5.5/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
గర్భవతిగా ఉన్న బెకీని, ఆమె సోదరుడు కాల్ వైద్య పరీక్ష కోసం తీసుకెళ్తుంటాడు. వీళ్ళు ఒక రోడ్ ట్రిప్‌లో ఉండగా, ఒక నిర్మానుష్య మైదానం దగ్గర ఆగతారు. అక్కడ ఒక చిన్న పిల్లవాడు సహాయం కోసం కేకలు వేయడం వింటారు. బెకీ, కాల్ అతన్ని రక్షించడానికి ఒక గడ్డి మైదానంలోకి వెళ్తారు. కానీ అక్కడ వీళ్ళు విడిపోతారు. అయితే గడ్డి మైదానం వాళ్ళను తిరిగి బయటకు రానివ్వదు. ఈ మైదానంలో సమయం తేడాగా ఉంటుంది. వీళ్ళు ఒకరినొకరు చూసుకోలేరు, కానీ మాటలు వింటారు. ఇక్కడ ఒక నల్లరాయికి అతీంద్రీయ శక్తులు ఉంటాయి. వీళ్ళు ఈ గడ్డి మైదానంలో ఒకరినొకరు కనుగొనడానికి ప్రయత్నిస్తారు.
కానీ వీళ్ళని ఆ బ్లాక్ రాక్ నియంత్రిస్తుంటుంది. బెకీ గర్భవతిగా ఉండటం వల్ల ఆమె తన బిడ్డ కోసం భయపడుతుంది. ఈ సమయంలో కాల్ తన సోదరిని రక్షించడానికి పోరాడతాడు. ఈ కథలో టైమ్ లూప్‌లు, మళ్లీ మళ్లీ ఒకే సంఘటనలతో కన్ఫ్యూజ్ చేస్తాయి. బెకీ బాయ్‌ఫ్రెండ్ ట్రావిస్ కూడా వారిని వెతకడానికి మైదానంలోకి వస్తాడు. కానీ అతను కూడా అక్కడ చిక్కుకుంటాడు. కథ నడుస్తుండగా, ఈ గడ్డి మైదానంలో ఉండే బ్లాక్ రాక్ శక్తి బయటికి వస్తుంది. ఇప్పుడు అక్కడి నుండి ఒకరు మాత్రమే బయట పడే అవకాశం ఉంటుంది. మిగతవాళ్ళు తమ ప్రాణాలను త్యాగం చేయాల్సి వస్తుంది. చివరికి అక్కడ నుంచి ఎవరు బయట పడతారు ? ఆ నల్ల రాయి శక్తి ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
Read Also : హాస్పిటల్ కు వచ్చిన అమ్మాయిల్ని వదలకుండా అదే పని… ఐసీయూలో ముసలి డాక్టర్ అరాచకం భయ్యా