Abhishek Sharma Car : ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 28న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా మ్యాచ్ గెలిచినప్పటికీ ట్రోఫీని మాత్రం అందుకోలేదు. అయితే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్నాడు. ఆ అవార్డును ఏసీసీ చైర్మన్ నఖ్వీ ఇవ్వకపోవడంతో అందుకున్నాడు. ఆ అవార్డు అందుకున్న తరువాత ఆ కారులో అభిషేక్ శర్మ, శుబ్ మన్ గిల్ ఇద్దరూ కలిసి దుబాయ్ వీధుల్లో తిరిగారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Suryakumar Yadav : మోడీ వల్లే ఇది సాధ్యం… ఇండియన్ ఆర్మీకి భారీ సాయం ప్రకటించిన సూర్య
టీమిండియా ఆసియా కప్ 2025 అవార్డు తీసుకోలేదు. కానీ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును ఎలా తీసుకున్నాడని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ అవార్డును HAVAL H9 అనే కంపెనీ అందజేయడంతో అభిషేక్ శర్మ ఈ అవార్డును అందుకున్నాడు. ఈ కారుని టీమిండియా మరో ఓపెనర్ శుబ్ మన్ గిల్ డ్రైవింగ్ చేసే ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించారు భారత ఆటగాళ్లు. దీనికి ప్రతికారంగా నఖ్వీ కూడా టీమిండియా కి ఇవ్వాల్సిన ట్రోఫీని, మెడల్స్ ను ఎత్తుకెళ్లిపోయాడు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండా సంబురాలు చేసుకొని నఖ్వీపై పుండు పై కారం చల్లారు. టీమిండియా ఆటగాళ్లు సంబురాలు జరుపుకుంటుంటే.. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా నఖ్వీ చేతి నుంచి అందుకున్న రన్నరప్ చెక్ అక్కడే పడేసి ఓవరాక్షన్ చేశాడు.
పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్ ఆటగాళ్లకు ప్రతీ మ్యాచ్ లో కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు టీమిండియా ఆటగాళ్లు. ఈ హైడ్రామా మధ్య టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకొని తన దేశ భక్తిని చాటుకున్నాడు. ఇక ఆసియా కప్ ద్వారా అతనికి లభించే మొత్తం మ్యాచ్ ఫీజు పహల్గామ్ ఉగ్రదాడిలో బాధిత కుటుంబాలకు, భారత సాయుధ దళాలకు విరాళంగా అందజేయనున్నట్టు ప్రకటించాడు. టీమిండియా కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయం పై యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ మధ్యకాలంలో టీమిండియా అద్భుతంగా రాణిస్తూ.. క్రికెట్ ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకుంది. వరుసగా మూడు బహుళ-జట్ల టోర్నమెంట్ లను గెలుచుకోవడం ద్వారా భారత క్రికెట్ జట్టు తన అభిమానుల హృదయాలను గెలుచుకుంది. గత 15 నెలల్లో టీమిండియా మూడు ప్రధాన టోర్నమెంట్ లను గెలుచుకుంది. 2024 టీ-20 వరల్డ్ కప్ నుంచి ప్రారంభమై.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2025 ఆసియా కప్ వరకు కొనసాగింది. ఈ టోర్నమెంట్లు అన్నింటినీ టీమిండియా క్లీన్ స్వీప్ చేయడం విశేషం.
Abhishek Sharma with Shubman Gill in his car received for his Player of the tournament award. ❤️ [Vipul Kashyap] pic.twitter.com/fk4IMTUWz9
— Johns. (@CricCrazyJohns) September 29, 2025