OTT Movie : కిల్లర్ జానర్ లో ప్రతి భాషలోనూ సినిమాలు తెరకెక్కుతున్నాయి. రకరకాల స్టోరీలతో ఈ సినిమాలు సీట్ ఎడ్జ్ థ్రిల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. క్లైమాక్స్ వరకు ఊహించని ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్ లతో హీట్ పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో జయం రవి, నయనతార కాంబినేషన్ లో ఒక మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించక పోయినా, ఒత్తిడిలో ఓటీటీలో బాగానే నడిచింది. ఈ చిత్రం ఒక సైకోపాత్ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి పోలీసు అధికారి చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘God’ 2023 అక్టోబర్ 6న తెలుగులో విడుదలైన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఇది 2023 సెప్టెంబర్ 28న తమిళంలో వచ్చిన ‘Iraivan’ సినిమాకి డబ్బింగ్ వెర్షన్. ఈ చిత్రాన్ని ఐ. అహ్మద్ దర్శకత్వం వహించారు. ఇందులో జయం రవి (అర్జున్), నయనతార (ప్రియా), రాహుల్ బోస్ (బ్రహ్మ), నరైన్ (ఆండ్రూ) ప్రధాన పాత్రల్లో నటించారు. దీనిని సుధన్ సుందరం, జయరాం జి.లు పాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది.
అర్జున్ అనే డీసీపీ నేరస్థులకు సింహస్వప్నం. చట్టాన్ని అతిక్రమించే నేరస్థులను, తన దైన పద్ధతులతో శిక్షించే ఒక డైనమిక్ పోలీసు అధికారి. అతని స్నేహితుడు ఆండ్రూ కూడా పోలీసు అధికారే. ఈ సమయంలో బ్రహ్మ అనే సైకోపాత్ సీరియల్ కిల్లర్, యువతులను కిరాతకంగా చంపుతూ నగరంలో భయాందోళన సృష్టిస్తాడు. శవాల వద్ద ఒక స్మైలీ సంతకం వదిలి వెళ్తుంటాడు. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ, అర్జున్ తన ప్రియురాలు ప్రియా సాయంతో బ్రహ్మను పట్టుకుంటాడు. కానీ ఒక సిచ్యువేషన్ లో బ్రహ్మ ఆండ్రూను చంపేస్తాడు. దీనికి బాధ్యత వహిస్తూ పోలీసు ఉద్యోగాన్ని అర్జున్ వదిలేస్తాడు. ఆతరువాత ఆండ్రూ కుటుంబాన్ని చూసుకుంటూ, తన బాధను పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు.
అయితే బ్రహ్మ జైలు నుండి తప్పించుకుని మళ్లీ హత్యలు చేయడం ప్రారంభిస్తాడు. దీంతో నగరంలో భయం మరింత పెరుగుతుంది. అర్జున్ తిరిగి బ్రహ్మను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతని జీవితం, ప్రియాతో సంబంధం ప్రమాదంలో పడతాయి. బ్రహ్మ ఆడే మైండ్ గేమ్ లో అర్జున్‌ను తీవ్రంగా ఇబ్బంది పడతాడు. కథలో ఒక ముఖ్యమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. బ్రహ్మ ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడనేది బయటపడుతుంది. చివరలో అర్జున్, బ్రహ్మ మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలు కథను ఉత్కంఠంగా ముగిస్తాయి. బ్రహ్మ ఎందుకు మహిళలను చంపుతున్నాడు ? అర్జున్ అతన్ని పట్టుకుంటాడా ? అనే విషయాలను, ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : పని మనిషిపై అంతులేని ప్రేమ… ఆ పాడు పని కోసం దిక్కుమాలిన ప్లాన్… ఇలాంటి గెస్ట్ ను ఎక్కడా చూసుండరు