Suryakumar Yadav : ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 28న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా మ్యాచ్ గెలిచినప్పటికీ ట్రోఫీని మాత్రం అందుకోలేదు. అయితే ఈ విషయం తెలిసిన వారందరూ ఒక్కసారిగా ఆశ్యర్యపోతున్నారు. కానీ తాజాగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చాడు. పీసీబీ చైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ అందుకోకపోవడాన్ని తాను కాంట్రవర్సీగా చూడనని తెలిపారు. ప్రజల హృదయాలను గెలవడం నిజమైన ట్రోఫీతో సమానం. ప్రధాని నరేంద్ర మోడీ మా ముందు నిలబడ్డారని ఆయన ట్వీట్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన స్ట్రైక్లింగ్ తీసుకొని రన్స్ చేసినట్టు అనిపించింది. పహల్గామ్ బాధితుల, ఆర్మీ కోసం నేను చేయగలిగిన చేయం చేస్తాను అని తెలిపారు.
Also Read : IND VS PAK Final : పాకిస్థాన్ తో మ్యాచ్.. టీవీ బద్ధలు కొట్టిన శివసేన లీడర్ !
ఆసియా కప్ లో పాకిస్తాన్ ను చిత్తు చేసి భారత్ కప్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత క్రికెటర్లకు అభినందనలు చెబుతూ ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్ చేశారు. గేమ్స్ ఫీల్డ్ లో ఆపరేషన్ సిందూర్.. ఫలితం మాత్రం మారదు. భారతే గెలుస్తుంది. మన క్రికెటర్లకు శుభాకాంక్షలు అని తెలిపారు. భారత జెట్లు కూలాయంటూ సంజ్ఞలు చేస్తూ ఇటీవల సెలబ్రేట్ చేసుకున్న పాకిస్తాన్ ప్లేయర్లకు ప్రధాని కౌంటర్ ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి 9వసారి ఆసియా కప్ ను కైవసం చేసుకుంది. మ్యాచ్ ముగిసిన తరువాత ప్రెజెంటేషన్ సెర్మనీ ప్రారంభమైంది. భారత జట్టు ట్రోఫీ తీసుకోదని ముందు నుంచే వార్తలు వచ్చాయి.
పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీనే ఆసియా క్రికెట్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ గా ఉండటమే ఇందుకు కారణం అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ మేరకు సూర్యకుమార్ యాదవ్ తన ఎక్స్ ఖాతాలో కీలక ట్వీట్ చేశాడు. ఆసియా కప్ టోర్నమెంట్ ఆడినందుకు తనకు ఇచ్చే తన మ్యాచ్ ఫీజును మొత్తం పహల్గామ్ ఉగ్రవాద దాడిలో బాధితులైన మన సాయుధ దళాలకు బాధితుల కుటుంబాలకు మద్దతు తెలిపేందుకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించాడు. మరోవైపు పాకిస్తాన్ క్రికెటర్లు తమను ఎంత కవ్వించినా హుందాగానే ఉన్నామని తెలిపాడు. పాకిస్తాన్ జట్టుకు టీమిండియా కి చాలా తేడా ఉందని వెల్లడించాడు. “మేము ఆటను చాలా గౌరవప్రదంగా ఆడాలని భావించాం. వారు మాత్రం చాలా ప్రకటనలు చేస్తున్నారు. ఫలితం ఏదో ఒక జట్టుకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మేము కమ్ బ్యాక్ చేసిన విధానం మరిచిపోలేము. బయట ప్రజలు చాలా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే భావోద్వేగాలను పక్కన పెట్టండి నాణ్యమైన క్రికెట్ ఆడండి. చివరికీ ఫలితం ఎలా ఉన్నా సరే చూసుకుందాం” అని చెప్పినట్టు గుర్తు చేశారు సూర్యకుమార్ యాదవ్