BigTV English
Advertisement

BoyCutt Thammudu : ఎంత పని చేశావ్ శిరిష్ రెడ్డి… ఇప్పుడు బాయ్ కాట్ అంటున్నారు

BoyCutt Thammudu : ఎంత పని చేశావ్ శిరిష్ రెడ్డి… ఇప్పుడు బాయ్ కాట్ అంటున్నారు

BoyCutt Thammudu : ప్రశాంతంగా ఉన్న ఇండస్ట్రీ ఒక్కసారిగా వేడెక్కింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్స్ పుట్టుకొచ్చాయి. దిల్ రాజు 70 కోట్లు కుమ్మరించి నిర్మించిన తమ్ముడు సినిమాపై బాయ్ కాట్ ట్రెండ్ వచ్చింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. చూడం. సినిమాను బాయ్ కాట్ చేయడమే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. దీని అంతటికి కారణం ఏంటి ? అసలేం జరిగింది ? దీని తీవ్రత తమ్ముడు సినిమాపై ఎంత వరకు ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.


నితిన్ హీరోగా తమ్ముడు సినిమా వస్తుంది. ఈ నెల 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ రోజు రిలీజ్ రిలీజ్ ట్రైలర్ వచ్చింది. 2 వారాల క్రితం వచ్చిన ట్రైలర్ కంటే, ఈ రోజు వచ్చిన రిలీజ్ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే సినిమాలో సీరియస్‌నెస్ కూడా కనిపిస్తుంది. ఇది ఇప్పటి వరకు ప్లస్ అని చెప్పుకొవచ్చు.

అయితే ఇప్పుడు ఈ మూవీకి బాయ్ కాట్ భయం పట్టుకుంది. అది కూడా హీరో నితిన్ అంటే గౌరవించే మెగా అభిమానులు ఇప్పుడు బాయ్ కాట్ ట్రెండ్ తీసుకొచ్చారు. దీని అంతటికి కారణం దిల్ రాజు సోదరుడు శిరిష్.


ఈయన ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూనే ఇప్పుడు తమ్ముడు సినిమా పాలిట యమగండంలా మారిపోయింది. ఆ ఇంటర్వ్యూలో నిర్మాత శిరిష్.. గేమ్ ఛేంజర్ మూవీ గురించి మాట్లాడాడు. గేమ్ ఛేంజర్ వల్ల తాము చాలా నష్టపోయామని, తమ బతుకు అయిపోయిందని అనుకున్నారట. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ మూవీ డైరెక్టర్, హీరో కనీసం ఫోన్ చేసి మాట్లాడలేదు అంటూ కామెంట్ చేశాడు.

ఇప్పుడు ఈ కామెంటే ఇండస్ట్రీని హీటెక్కించింది. రామ్ చరణ్ / మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత నాలుగేళ్ల డేట్స్ దిల్ రాజు చేతిలో పెట్టాడు రామ్ చరణ్. అలాంటి టైంలో ఓ మంచి హిట్ సినిమా తీయొచ్చు కానీ, అలా కాకుండా ఓ డిజాస్టర్ మూవీని రామ్ చరణ్ కి ఇచ్చారు. పైగా నాలుగున్నర గంటల ఫుటేజ్ వచ్చేలా సినిమా తీస్తారా? ఆ మాత్రం చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నిర్మాతల దగ్గర లేదా ? అంటే ఫైర్ అవుతున్నారు.

ఇలా తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకుని ఇప్పుడు తమ అభిమాన హీరోపై నిందలు వేయడం ఏంటి అంటూ తప్పు బడుతున్నారు. అక్కడితో ఆగిపోలేదు… ఇప్పుడు శిరీష్ – దిల్ రాజు నిర్మిస్తున్న తమ్ముడు సినిమాను బాయ్ కాట్ చేయాలి అంటూ పోస్టులు పెడుతున్నారు. మెగా ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఈ బాయ్ కాట్ తమ్ముడు ట్రెండ్‌ను వైరల్ చేస్తున్నారు.

అలాగే, నిన్న తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దిల్ రాజు… తాము రామ్ చరణ్ కు హిట్ ఇవ్వలేకపోయామని అన్నాడు. తొందర్లోనే రామ్ చరణ్‌తో సినిమా చేస్తామని, చర్చలు కూడా జరుగుతున్నాయని అన్నాడు. నిన్న శిరీష్ ఇంటర్వ్యూ తర్వాత… దిల్ రాజు సినిమా చేస్తా అని వచ్చినా కూడా చేయొద్దు అని రామ్ చరణ్ ను ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

Related News

Janhvi Kapoor : ఇది నా అదృష్టం, జాన్వి పాపా పెద్ది కన్సర్ట్ లో ఎంత ముద్దుగా మాట్లాడిందో

Ram Charan: నా కల నిజం అయిపోయింది, కన్సర్ట్ లో రామ్ చరణ్ అదిరిపోయే ఎంట్రీ

SSMB29 : మొత్తానికి మహేష్ బాబు అప్డేట్ ఇచ్చాడు, గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ పై మహేష్ రియాక్షన్.

Gouri G Kishan : నాకు మారి సెల్వరాజ్ సార్ ఫోన్ చేశారు, ఇష్యూ గురించి ఏం చెప్పారంటే?

The Great Pre wedding show: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాపై బెల్లంకొండ రియాక్షన్, మొదటి సెలబ్రిటీ సపోర్ట్

Shraddha Das: అల్లు అర్జున్ టాలీవుడ్ షారుక్.. నా ప్రపంచమే మారిపోయిందన్న నటి!

Actor Vikranth: అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ..700 మంది ఎంప్లాయిస్.. ఈ హీరో బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదే!

Ajay Bhupathi : ఘట్టమనేని వారసుడు సినిమా టైటిల్ ఇదే, ఆ సెంటిమెంట్ వదలని అజయ్ భూపతి

Big Stories

×