BigTV English

Actor Shivaji: బిగ్ బాస్ కంటెస్టెంట్లు జంతువులతో సమానం.. ఇలా అనేసాడేంటీ భయ్యా?

Actor Shivaji: బిగ్ బాస్ కంటెస్టెంట్లు జంతువులతో సమానం.. ఇలా అనేసాడేంటీ భయ్యా?

Actor Shivaji: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివాజీ (Shivaji)ఎన్నో సినిమాలలో హీరోగాను విలన్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న ఈయన రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల గురించి కూడా నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచేవారు. సినీ ఇండస్ట్రీలోనూ, రాజకీయాలలో కొనసాగుతున్న శివాజీ అనుకోకుండా బిగ్ బాస్ 7(Bigg Boss 7) సీజన్లో కంటెంట్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన టాప్ 3 కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం శివాజీ పెద్ద ఎత్తున సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో గుర్తింపు పొందడమే కాకుండా కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.


మంగపతి పాత్రలో…

ఇటీవల ఈయన కోర్టు సినిమా(Court Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో మంగపతి పాత్రలో తన విలనిజం చూయిస్తూ అందరిని ఆకట్టుకున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీ సినిమాల గురించి రాజకీయాల గురించి ఎన్నో విషయాలు మాట్లాడారు అలాగే బిగ్ బాస్ కార్యక్రమం గురించి కూడా ఈయన పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం అనేది తన జీవితంలో ఒక అద్భుతం అంటూ తెలియచేశారు.


జంతువుల లాగా బ్రతికాము..

సినిమాలు ఒక అద్భుతం అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడం మరొక అద్భుతమని తెలిపారు. బిగ్ బాస్ కార్యక్రమం నన్ను ఎంతగానో మార్చేసిందని తెలిపారు. 105 రోజులు బిగ్ బాస్ కార్యక్రమంలో చాలా ఎంజాయ్ చేశానని తెలిపారు. నేను ఈ కార్యక్రమం నుంచి వచ్చేలోపు నా పెద్ద కొడుకు అమెరికా వెళ్లిపోతారు అదొక ఎమోషన్. ఎలాంటి ఫోన్లు ఉండవు.. తెలియని వారితో ప్రయాణం చేయాలి, ఆకలైతే అన్నం కోసం ఎదురు చూడాలి, దొరికింది తినాలి, డబ్బులు గురించి బాధ ఉండదు, అదొక అద్భుతమైన ప్రయాణం అని తెలిపారు. బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే హౌస్ లో ఉనన్ని రోజులు మనం కూడా ఒక జంతువులతో సమానంగా బ్రతికామని శివాజీ వెల్లడించారు.

జీవితంలో మార్పు వస్తుంది..

బయట జంతువులకు కూడా ఎలాంటి టెన్షన్లు ఉండవు. ఆకలైనప్పుడు తింటాయి లేదా ఊరికే ఉంటాయి .అలాగే బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా ఎలాంటి టెన్షన్లు లేకుండా తెలియని వారితో, ఫోన్ లేకుండా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా గడపటం నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని తెలియజేశారు. ఈ షో ప్రతి ఒక్కరి జీవితంలోను ఎంతో మార్పు తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి అంటూ బిగ్ బాస్ కార్యక్రమం గురించి శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక శివాజీ ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఈయనే విన్నర్ అవుతారని అందరూ భావించారు కానీ ఊహించని విధంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) ఈ సీజన్ లో విన్నర్ గా నిలిచారు. ఇక అమర్ రన్నర్ గా నిలవగా శివాజీ మూడో కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు.

Also Read: చూడకుండా కాఫీ అని ఎలా అంటావ్.. ఈటీవీ విన్‌కి జీ5 కౌంటర్

Related News

Bigg Boss Telugu: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. వీడియో వైరల్!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Bigg Boss Agnipariksha: ఒక్క ఛాన్స్ అంటూ గోల.. రేయ్ ఎక్కడ దొరికార్రా మీరంతా?

Bejawada Bebakka: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బెజవాడ బేబక్క… ఇల్లు చూశారా ఎంత బాగుందో?

Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ ఇంటిపై కాల్పులు.. ఏకంగా 12 రౌండ్లు గన్ షాట్స్

Bigg Boss 9 : బిగ్ బాస్ నుండి అదిరిపోయే అప్డేట్.. దివ్వెల మాధురి కన్ఫామ్.. మరి దువ్వాడ?

Big Stories

×